Lottery: లాటరీలో గెలిచింది రూ.328 కోట్లు.. కానీ అతడికి వచ్చింది మాత్రం కేవలం రూ.174 కోట్లే.. ఇంత తేడా ఎందుకంటే..!

ABN , First Publish Date - 2023-04-12T16:34:33+05:30 IST

జీవితంలో లక్షాధికారి కూడా కాలేనోడు.. ఏకంగా ఒక్కసారే కోటీశ్వరుడైపోయాడు. అతని సుడి ఎలా తిరిగిందో

Lottery: లాటరీలో గెలిచింది రూ.328 కోట్లు.. కానీ అతడికి వచ్చింది మాత్రం కేవలం రూ.174 కోట్లే.. ఇంత తేడా ఎందుకంటే..!
Lottery

ఏదైనా సుడి ఉంటే తప్ప జీవితం బాగుపడదు? అంటారు. అప్పుడప్పుడూ నలుగురు కలుసుకున్నప్పుడూ జోక్‌లు కూడా వేసుకుంటుంటారు. లేదంటే తల రాతైనా మారాలి.. రా అంటూ సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకొందరైతే లక్షాధికారులం ఎప్పుడవుతాం..రా అంటుంటారు. ఇలా ఎదురైనా సందర్భాలు మన జీవితంలో చాలా చూసుంటాం. కానీ ఇప్పుడు మాట్లాడేది.. జోకు కాదు.. కామెడీ అంతకంటే కాదు. అక్షరాల నిజం. జీవితంలో లక్షాధికారి కూడా కాలేనోడు.. ఏకంగా ఒక్కసారే కోటీశ్వరుడైపోయాడు. అతని సుడి ఎలా తిరిగిందో ఈ వార్త చదవండి.

చాలా మందికి లాటరీ టికెట్లు (Lottery Ticket) కొనే అలవాటు ఉంటుంది. కొంత మంది సరదాగా కొంటే.. మరి కొందరు ఏదైనా అదృష్టం కలిసొస్తుందని భావిస్తుంటారు. అలా భావించిన ఓ వ్యక్తి లాటరీ టికెట్ కొన్నాడు. కానీ ఆ సంగతే మరిచిపోయాడు. కానీ నిజంగానే అతడి పంట పండింది. మామోలు అదృష్టం కాదు.. ఏకంగా కోట్లలో కాసుల వర్షం కురిసింది.

అతడో విశ్రాంత మెకానిక్. అమెరికాలోని (US Man) అయోవా రాష్ట్రానికి చెందిన ఎర్ల్ లాపే (61) డబ్యూక్ నగరంలో నివాసం ఉంటున్నాడు. ఏప్రిల్ ఫూల్స్ డే (ఏప్రిల్ 1)న అయోవా లాటరీ కేంద్ర కార్యాలయంలో లొట్టో అమెరికా టికెట్‌ కొనుగోలు చేశాడు. లాటరీ టికెట్లు డ్రా తీసినప్పుడు లాపే పేరు సలెక్ట్ అయింది. అంతే అతడు కొన్న టికెట్ 40 మిలియన్ డాలర్ల బహుమతికి ఎంపికైంది. అంటే సుమారు రూ.328 కోట్లు (Wins Rs 328 Crore) గెలుచుకున్నాడు. ఇక చూడండి అతని ఆనందానికి అవధులే లేవు.

లాపే బహుమతి స్వీకరించడానికి లాటరీ కార్యాలయానికి వచ్చాడు. లాటరీ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఒకేసారి తీసుకునే ఆప్షన్‌ను ఎంపిక చేశాడు. దీంతో అతడికి 21.28 మిలియన్ డాలర్లు మాత్రమే ముట్టాయి. అంటే సుమారు రూ.174 కోట్లే లభించాయి. అలా కాకుండా ఏడాదికి కొంత కొంత తీసుకుంటే మాత్రం 29 సంవత్సరాల్లో అతడు గెలుచుకున్న 40 మిలియన్ డాలర్లూ లభించేవి. కానీ ఒకేసారి బహుమతి మొత్తాన్ని తీసుకోవడంతో కొంతే ముట్టింది.

బహుమతిని స్వీకరించిన అనంతరం లాపే మాట్లాడుతూ.. లాటరీ గెలిచాక జోక్ అనుకున్నానని.. ఏప్రిల్ ఫూల్ అవుతానేమోనని బిగ్గరగా నవ్వేసినట్లు వివరించాడు. తనకు లభించిన డబ్బును కుటుంబ అవసరాలకు ఖర్చు చేయడంతో పాటు... అనారోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు సహాయం చేయనున్నట్లు లాపే చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: Viral Video: వారెవ్వా.. ఏం ట్రైనింగ్ ఇచ్చావు బాసూ.. కుర్రాడితో బ్యాట్మింటన్ ఆడుకుంటున్న మూడు పిల్లులు..!

ఇది కూడా చదవండి: అన్నీ మర్చిపోదాం.. ఇంటికి రండని పిలిస్తే.. ప్రేమ పెళ్లయిన 4 ఏళ్లకు భార్యతో సహా ఇంటికి వెళ్లాడా భర్త.. 10 రోజుల తర్వాత..

Updated Date - 2023-04-12T16:34:33+05:30 IST