Shocking: విమానంలో కలకలం.. గాఢనిద్రలో ఉన్న 32 ఏళ్ల తెలుగు మహిళ.. ఏదో తగులుతున్నట్టు అనిపించి.. కళ్లు తెరిచి చూస్తే..!
ABN , First Publish Date - 2023-11-09T12:04:58+05:30 IST
విమానాల్లో కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఇటీవల తరచూ వివాదాస్పదం అవుతోంది. తోటి ప్రయాణికులపై దాడి, లైంగిక వేధింపులు, మూత్రవిసర్జన చేయడం లాంటి ఘటనలు పరిపాటిగా మారాయి. ఇలాంటి ఘటనలపై విమానయాన సంస్థలు, డీజీసీఏ స్పందించి, చర్యలు తీసుకుంటున్నప్పటికీ అలాంటి వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు.
Shocking: విమానాల్లో కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఇటీవల తరచూ వివాదాస్పదం అవుతోంది. తోటి ప్రయాణికులపై దాడి, లైంగిక వేధింపులు, మూత్రవిసర్జన చేయడం లాంటి ఘటనలు పరిపాటిగా మారాయి. ఇలాంటి ఘటనలపై విమానయాన సంస్థలు, డీజీసీఏ స్పందించి, చర్యలు తీసుకుంటున్నప్పటికీ అలాంటి వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ ఘటన లూఫ్తాన్సా విమానం (Lufthansa flight) లో చోటు చేసుకుంది. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న తెలుగు మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ మహిళ పక్కన కూర్చున్న వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Wife: బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు భార్యకు చెప్పి.. సీక్రెట్‌గా ఇంటికి తిరిగొచ్చిన భర్త.. తెల్లారేసరికి ఊరంతా ఉలిక్కిపడే ఘటన..
వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాంక్‌ఫర్ట్- బెంగళూరు (Frankfurt to Bengaluru) లుఫ్తాన్సా విమానంలో నవంబర్ 6 వ తేదీన ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. గాఢనిద్రలో ఉన్న 32 ఏళ్ల తెలుగు మహిళ.. ఏదో తగులుతున్నట్టు అనిపించడంతో కళ్లు తెరిచి చూసింది. పక్కనే కూర్చున్న 52ఏళ్ల ప్రయాణికుడు ఆమె ప్రైవేటు భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆమె ఆ వ్యక్తిని వారించింది. కానీ, ఆ తర్వాత కూడా అతడు అలాగే ప్రవర్తిస్తూ.. వేధింపులు ఆపకపోవడంతో ఎయిర్‌లైన్స్ సిబ్బందికి విషయాన్ని తెలియజేసింది. వెంటనే స్పందించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆమెను వేరే సీటులో కూర్చొబెట్టారు.
Wife: నెలల తరబడి ఇంటికి రాని భర్త.. ఒకరికి ముగ్గురిని పెళ్లి చేసుకున్న భార్య.. ఆమె నిర్వాకం అసలెలా బయటపడిందంటే..!
ఇక విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Kempegowda International Airport) లో ల్యాండ్ అయిన తర్వాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఐపీసీ 354ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత అతడు బెయిల్‌పై విడుదలైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, సదరు వ్యక్తి యూఎస్ పౌరసత్వం కలిగి ఉన్న ఓ ఎన్నారై అని పోలీసుల విచారణలో తెలింది.