Shocking Video: నువ్వు నిజంగా గొప్పోడివి సామీ.. ఎద్దును బైక్‌పై తీసుకెళ్తున్న వ్యక్తి.. డేంజరస్ డ్రైవింగ్ అంటూ నెటిజన్లు ఆగ్రహం!
ABN , First Publish Date - 2023-11-12T19:00:29+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ (Viral Videos) అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి మోటారుసైకిల్‌పై (Bike) ఏకంగా ఒక ఎద్దును (Bull) కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు. అదే రోడ్డులో వెళ్తున్న వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Bull on Bike).
@nareshbahrain అనే వ్యక్తి ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ఎద్దును బైక్‌పై కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు. చిన్న పిల్లను కూర్చోబెట్టుకున్నట్టు బైక్ ముందు ఎద్దును కూర్చోబెట్టి డ్రైవింగ్ చేస్తున్నాడు. అలాగని అతడు మెల్లిగా వెళ్లడం లేదు. వేగంగానే ప్రయాణిస్తున్నాడు. ఆ ఎద్దు కూడా చాలా జాలీగా ఆ రైడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆ ఎద్దు ఏ మాత్రం కదలినా బైక్ మీద వెళ్తున్న వ్యక్తికే కాదు.. ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న వారికి కూడా భారీ ప్రమాదం తప్పదు.
Viral Video: ఛీ..ఛీ.. మ్యాగీని ఇలా ఎవరైనా తింటారా? వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై నెటిజన్ల ఆగ్రహం..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అతడి డ్రైవింగ్ స్కిల్స్ అమోఘం``, ``కాన్ఫిడెన్స్ బాగానే ఉంది.. కానీ, ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదం తప్పదు``, ``ఆ ఎద్దు ఎంత సౌకర్యంగా కూర్చుందో చూడండి``, ``ఆ ఎద్దుకు అలాంటి రైడ్‌లు అలవాటు అనుకుంటా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.