Viral Video: గాజులు తొడిగి, చీర కప్పి.. కుక్కకు సీమంతం చేసిన కుటుంబం.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-10-01T15:42:43+05:30 IST
పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా కుక్కలను చాలా మంది ప్రేమగా పెంచుకుంటారు. పెంపుడు కుక్కను తమ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు. దాని సంతోషాన్ని తాము పంచుకుంటారు. వాటికి ప్రత్యేకంగా బర్త్ డేలు కూడా సెలబ్రేట్ చేస్తుంటారు.
పెంపుడు జంతువులను (Pet) చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా కుక్కలను చాలా మంది ప్రేమగా పెంచుకుంటారు. పెంపుడు కుక్కను (Pet Dog) తమ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు. దాని సంతోషాన్ని తాము పంచుకుంటారు. వాటికి ప్రత్యేకంగా బర్త్ డేలు కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా ఓ కుటుంబం తమ కుక్కకు సీమంతం ఫంక్షన్ చేసింది (Baby shower ceremony to Dog). తాజాగా గోల్డెన్ రిట్రీవర్ డాగ్ కు యజమానులు సీమంతం చేసిన వీడియో తాజాగా వైరల్ (Viral Video) అవుతోంది.
తమ పెంపుడు కుక్క రోజీ గర్భం దాల్చి డెలివరీకి సిద్ధమవుతున్న తరుణంలో దాని యజమానులైన సిద్ధార్థ్ శివమ్ కుటుంబం ఘనంగా సీమంతం ఫంక్షన్ చేసింది. కుక్క నుదిటిన బొట్టు పెట్టి, గాజులు తొడిగి, పువ్వులు చల్లి, స్వీట్లు తినిపించారు. అలాగే రోజీ ముందు ``ఐయామ్ రెడీ`` అని బోర్డ్ కూడా పెట్టారు. అలాగే రోజీ భాగస్వామి అయిన రెమో ముందు ``ఐయామ్ దేర్`` అని బోర్డు పెట్టారు. ఆ ఈవెంట్ మొత్తాన్ని వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Mathematics: బాబోయ్.. అమ్మాయిల లెక్కలు ఇలా ఉంటాయా? నెటిజన్ల స్పందన ఏంటంటే..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. 1.7 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``రోజీకి, రెమోకు శుభాకాంక్షలు``, ``ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది``, ``ఆ యజమానులు చాలా గొప్పవాళ్లు``, ``కుక్కకు సీమంతం.. వెరీ క్యూట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.