Viral Video: యువతి ఫొటో తీస్తుండగా ఏకంగా ఫోన్‌నే మింగేసిన ఏనుగు.. చివరకు మావటి ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2023-02-01T16:47:43+05:30 IST
ఏనుగుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. యువతి ఫొటో తీస్తుండగా ఉన్నట్టుండి ఏనుగు.. ఏకంగా ఫోన్‌నే మింగేస్తుంది. తర్వాత మావటి చేసిన పని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు...
కొందరికి కళ్ల ముందు కనిపించే ప్రతి దృశ్యాన్నీ తమ ఫోన్లలో బంధించడం అలవాటు. ఇంకొందరు మనుషులు, జంతువులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు, మరికొన్ని సార్లు తమాషా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి వీడియోలు కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం ఏనుగుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. యువతి ఫొటో తీస్తుండగా ఉన్నట్టుండి ఏనుగు.. ఏకంగా ఫోన్‌నే మింగేస్తుంది. తర్వాత మావటి చేసిన పని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
థాయిలాండ్‌లోని (Thailand) ఏనుగుల పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాత వీడియో అయినా ప్రస్తుతం తెగ వైరల్ (Viral videos) అవుతోంది. పార్కులో ఏనుగులను చూసేందుకు కొందరు చైనీస్ పర్యాటకులు (Chinese tourists) వస్తారు. వారిలో ఇద్దరు యువతులు (young women) ఏనుగులను ఆసక్తిగా తిలకిస్తుంటారు. వారిలో ఓ యువతి ఏనుగుకు (elephant) ఆహారం తినిపిస్తుంటుంది. మరో యువతి ఏనుగును ఫొటోలు తీస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సడన్‌గా తమాషా ఘటన చోటు చేసుకుంటుంది. ఏనుగును మరీ దగ్గరగా ఫొటో తీసేందుకు వెళ్లిన యువతికి ఏనుగు షాక్ ఇస్తుంది. అదేదో తినే పదార్థం అనుకుని చటుక్కున్న తొండంతో పట్టుకుని మింగేస్తుంది. ఇంకేముందీ.. అయ్యో..! నా ఐ ఫోన్ (i phone).. అంటూ యువతి కేకలు పెడుతుంది.
అక్కడే ఉన్న మావటి ఏమైందని ప్రశ్నిస్తాడు. చివరకు జరిగింది తెలుసుకుని.. తానేమీ చేయలేనని, మరుసటి రోజు రమ్మని సలహా ఇస్తాడు. అతను చెప్పినట్లుగా మరుసటి రోజు ఏనుగు వద్దకు వెళ్లిన యువతులు.. ఏనుగు మింగేసిన ఫోన్‌కు రింగ్ చేస్తారు. అదే సమయంలో ఏనుగు మలంలో ఉన్న ఐఫోన్‌ను బయటకు తీసి, క్లీన్ చేసి యువతికి అందజేస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఇది ఫేక్ అంటుండగా, మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ.. ఓ లుక్కేయండి..