Slap Kabaddi: ఇదెక్కడి ఆట.. గేమ్ పేరుతో ఒకర్నొకరు కొట్టుకుంటున్న పాకిస్థానీయులు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-07-05T18:19:17+05:30 IST

మనకు కబడ్డీ తెలుసు.. కుస్తీ పోటీలు కూడా తెలుసు.. ఆ రెండూ వేర్వేరు ఆటలు.. అయితే పాకిస్థాన్‌లో ఓ ప్రాంతంలో ఆ రెండింటినీ కలిపి ఓ కొత్త ఆటను తయారు చేశారు.. ఆ గేమ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. ఆ కొత్తరకం ఆట పేరు ``స్లాప్ కబడ్డీ``.

Slap Kabaddi: ఇదెక్కడి ఆట.. గేమ్ పేరుతో ఒకర్నొకరు కొట్టుకుంటున్న పాకిస్థానీయులు.. వీడియో వైరల్!

మనకు కబడ్డీ (Kabaddi) తెలుసు.. కుస్తీ పోటీలు కూడా తెలుసు.. ఆ రెండూ వేర్వేరు ఆటలు.. అయితే పాకిస్థాన్‌లో ఓ ప్రాంతంలో ఆ రెండింటినీ కలిపి ఓ కొత్త ఆటను తయారు చేశారు.. ఆ గేమ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయింది.. ఆ కొత్తరకం ఆట పేరు ``స్లాప్ కబడ్డీ`` (Slap Kabaddi). అంటే కబడ్డీ పేరుతో ఒకర్నొకరు చేతులతో కొట్టుకోవడమే. ఆ కొత్త ఆటపై నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. @WonderW97800751 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు గేమ్ ఆడుతున్నారు. కానీ, దానిని చూస్తుంటే వారు ఆడుకుంటున్నారో, లేదా కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు చెంప దెబ్బలు కొడుతూ పోటీ పడుతున్నారు. ఈ వీడియోను పాకిస్థాన్‌ (Pakistan)లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 2.19 లక్షల మంది వీక్షించారు.

Viral Video: ఆ వధువు ట్యాలెంట్‌కు అందరూ ఫిదా.. వివాహ వేడుకలో ఆమె డ్యాన్స్ చూస్తే షాకవ్వాల్సిందే..

వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``వారు ఆడుతున్నట్టు లేదు.. పాత పగలు తీర్చుకుంటున్నట్టు ఉంది``, ``ఆట బాగుంది.. మనకు పడని వారితో ఆడితే బాగుంటుంది``, ``ఇది జుకర్‌బర్గ్, ఎలన్ మస్క్ మధ్య జరుగుతున్న సోషల్ మీడియా ఆధిపత్య పోరులా ఉంది`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-05T18:19:17+05:30 IST