Share News

Anju: ఆమె కనుక మా ఊరికి వస్తే ప్రాణాలతో వదిలి పెట్టం.. పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన అంజూ సొంతూళ్లో పరిస్థితి ఇదీ..!

ABN , First Publish Date - 2023-12-01T13:40:16+05:30 IST

Anju who Fled for Facebook to Pak: అంజూ.. నాలుగు నెలల కింద ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దానికి కారణం రాజస్థాన్‌కు చెందిన అంజూ.. తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం ఏకంగా పాకిస్థాన్‌కు వెళ్లడమే. అంతేనా.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పాకిస్థానీని పెళ్లి కూడా చేసుకుంది.

Anju: ఆమె కనుక మా ఊరికి వస్తే ప్రాణాలతో వదిలి పెట్టం.. పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన అంజూ సొంతూళ్లో పరిస్థితి ఇదీ..!

Anju who Fled for Facebook to Pak: అంజూ.. నాలుగు నెలల కింద ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దానికి కారణం రాజస్థాన్‌కు చెందిన అంజూ.. తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం ఏకంగా పాకిస్థాన్‌కు వెళ్లడమే. అంతేనా.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పాకిస్థానీని పెళ్లి కూడా చేసుకుంది. అంతే.. అప్పటి నుంచి ఆమె వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే, జూలై నెలలో దాయాది దేశానికి వెళ్లిన ఆమె సరిగ్గా నాలుగు నెలల తర్వాత మళ్లీ భారత్‌కు తిరిగొచ్చింది. పాకిస్తాన్, పంజాబ్ సరిహద్దులోని వాఘా బోర్డర్ ద్వారా ఆమె బుధవారం రాత్రి ఇండియాలోకి ప్రవేశించింది. ఆ సమయంలోనే వాఘా సరిహద్దు వద్ద భద్రతాధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మొదట బీఎస్ఎఫ్ క్యాంప్ వద్ద ఆమెను విచారించిన అధికారులు.. ఆ తర్వాత అక్కడి నుంచి గోల్డెన్ సిటీ అమృత్‌సర్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి తరలించారు.

Viral Video: భవిష్యత్తులో జరిగేది ఇదే.. అమెరికాలో ఈ భారతీయ యువతికి షాకింగ్ అనుభవం.. కారు ఎక్కగానే..!


Anju.jpg

ఇదిలాఉంటే.. బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడిన అంజూ.. తాను భారత్‌కు ఎందుకు తిరిగొచ్చానన్నది వెల్లడించింది. ‘నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం. నా కొడుకు, కూతురు లేకుండా ఉండలేకపోతున్నాను. అక్కడ నాకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయినప్పటికీ పిల్లలు పదే పదే గుర్తుకు వస్తున్నారు. వారిని నా వద్దకు తీసుకెళ్లాలని తిరిగి వచ్చాను. నా పిల్లలను నా వెంట తీసుకెళ్తాను. అదే సమయంలో నా భర్తకు కూడా విడాకులు ఇస్తాను. చట్టపరంగా చేయాల్సిన పనులను చేయడానికే ఇండియాకు తిరిగి వచ్చాను..’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త అరవింద్.. ఆమె అసలు తిరిగి వస్తున్న సంగతే తనకు తెలియదని అన్నాడు. ఆమె గురించి మాట్లాడేందుకే తనకు మనస్కరించడం లేదనీ.. ఆమె పేరును తన వద్ద ప్రస్తావించవద్దని మండిపడ్డాడు.

అంజూపై సొంతూళ్లో కన్నెర్ర..

అటు అంజూ సొంతూరులో కూడా ఆమెపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ అంజూ తమ గ్రామంలో అడుగు పెడితే.. ఆమె తండ్రిని కూడా గ్రామం నుంచి బహిష్కరిస్తామని అన్నారు. ఆమె కనుక మా ఊరికి వస్తే ప్రాణాలతో వదిలి పెట్టబోమని వారు హెచ్చరించారు. ఆమె తన కుటుంబంతో పాటు గ్రామానికే కాకుండా దేశం మొత్తానికి చెడు పేరు తెచ్చిపెట్టిందని గ్రామస్థులు మండిపడుతున్నారు. అంజు మహిళల పేరుకే కళంకం తెచ్చిందని, అలాంటి మహిళకు ఈ గ్రామంలో నివసించే హక్కు లేదని వారు అంటున్నారు.

NRIs: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ముగ్గురు నరరూప రాక్షసులు.. 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు..!

Updated Date - 2023-12-01T13:41:57+05:30 IST