Viral: జపాన్ నుంచి వైద్య బృందం.. ఏరికోరి మరీ కేరళలోని ఆ ఆస్పత్రికి ఎందుకు వచ్చింది..? ఓ 9 ఏళ్ల పిల్లాడి విషయంలో..!
ABN , First Publish Date - 2023-11-09T14:01:53+05:30 IST
కేరళలో 9ఏళ్ళ పిల్లాడికి జరిగిన వైద్యం తెలిసి జపాన్ డాక్టర్లే ఆశ్చర్యపోయారు. కట్టగట్టుకుని మరీ వారు కేరళకు చేరుకున్నారు.
భారత్ లోని రాష్ట్రాలలో కేరళకు చాలా ప్రత్యేకత ఉంది. అక్కడి ప్రాంతాలు చాలావరకు ప్రకృతిలో మమేకం అయిపోయి ఉంటాయి. కేరళ ఆయుర్వేద వైద్యం ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందింది. అలాంటి కేరళకు జపాన్ వైద్యులు కట్టగట్టుకుని వచ్చారు. ఓ సాధారణ ఆసుపత్రిలో 9ఏళ్ల పిల్లాడికి జరిగిన వైద్యం గురించి తెలుసుకునేందుకు వారెంతో ఆసక్తిగా అక్కడికి వచ్చారు.కేరళ వైద్యుల వైద్యం గురించి తెలుసుకుని వారు ఆశ్ఛర్యపోతున్నారు. ఈ వైద్యుల రాకతో వివిధ దేశాల దృష్టి భారత్, కేరళ వైపుకు మళ్లింది. ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరిచిన ఈ సంఘటన ఏంటి? భారత్ వైద్యులు చేసిన అద్భుతం ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
ప్రపంచంలో ప్రజల ప్రాణాలను బలిగొనే చాలారకాల వైరస్ లు పుట్టుకొచ్చాయి. వాటిలో నిఫా వైరస్(nipah virus) కూడా ఒకటి. నిఫా వైరస్ గబ్బిలాల ద్వారా సంక్రమిస్తుంది. జ్వరం, వాంతులు, కండరాల నొప్పి, తలనొప్పి వంటి సాధారణ లక్షణాలతో మొదలై మూర్చ, న్యుమోనియా, శ్వాస సంబంధ సమస్యలతో ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఆ మధ్యకాలంలో నిఫా వైరస్ కేరళను(Kerala) వణికించింది. నిఫా వైరస్ సోకిన ఓ 9ఏళ్ళ పిల్లాడు(9years boy) చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా ఆ పిల్లాడి తల్లిదండ్రులు చివరి ఆశగా కోజికోడ్ లోని ఆస్టర్ మిమ్స్ ఆసుపత్రిలో(aster mims hospital kozhikode) చేర్చారు. వెంటిలేటర్ మీద చివరి గడియలు లెక్కపెడుతున్న ఈ పిల్లాడికి మిమ్స్ వైద్యులు చికిత్స అందించారు. వైద్యుల కృషి ఫలితంగా పిల్లాడు ప్రాణణాపాయం నుండి బయటపడ్డాడు. ప్రపంచంలో నిఫా వైరస్ సోకి ప్రాణాలతో బయటపడటం ఎక్కడా జరగలేదు. ఈ వైరస్ కు చికిత్స చేసి రోగిని బ్రతికించడం ప్రపంచంలో ఇదే మొదలు. ఇదే విషయం అంతర్జాతీయ మీడియాలో ప్రచురణ కాగా ఈ వార్త చూసిన జపాన్ వైద్యులు(Japan Doctors) ఆశ్చర్యపోయారు.
ఇది కూడా చదవండి: Garlic: వంటింట్లో కనిపించే వెల్లుల్లి గురించి మీకు తెలియని 7 నిజాలు.. కూరల్లో వాడేది ఇందుకేనన్నమాట..!
ఆరుమందితో కూడిన జపాన్ వైద్య బృందం(Japan Doctors team) భారత రాయబార కార్యాలయం ద్వారా కేరళకు చేరుకుంది. కేరళ వైద్యులు నిఫా వైరస్ కు అందించిన చికిత్స, వారు ఆరోగ్య కార్తకర్తలకు వ్యాధి సోకకుండా తీసుకున్న జాగ్రత్తలు, వ్యాధి నివారణ కోసం వారు అవలంభించిన మార్గాలు, వేగవంతమైన పరీక్షల నిర్వాహణ. తక్షణ చర్యలు, ఆసుపత్రిలో ఐసోలేషన్ గది మొదలైనవన్నీ జపాన్ వైద్యులు అడిగి తెలుసుకున్నారు . 9ఏళ్ళ పిల్లాడు నిఫా వైరస్ నుండి కోలుకోవడానికి జరిగిన చికిత్స ఆ పిల్లాడి రిపోర్టులు మొదలైనవన్నీ పరిశీలించారు. కేరళ వైద్యులను జపాన్ కు వచ్చి అక్కడి వైద్యవిధానాలను పరిశీలించాల్సిందిగా ఆహ్వానించింది.