Viral: ఇదేం ప్రేమరా బాబు.. రోడ్డుపై వెళ్తుండగా ఫోన్‌ను చోరీ చేసిన వాడితోనే రెండేళ్లుగా ప్రేమాయణం.. వీళ్ల కథ వింటే..!

ABN , First Publish Date - 2023-07-27T13:28:20+05:30 IST

ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంటే ఓ దొంగ ఆమె ఫోన్ లాక్కుపోయాడు. ఆ దొంగోడు ఫోన్ లో ఆమె ఫోటో చూసి ఫిదా అయ్యాడట. విచిత్రంగా ఆ అమ్మాయి కూడా ఈ దొంగోడిని ప్రేమించడం మొదలెట్టింది.

Viral: ఇదేం ప్రేమరా బాబు.. రోడ్డుపై వెళ్తుండగా ఫోన్‌ను చోరీ చేసిన వాడితోనే రెండేళ్లుగా ప్రేమాయణం.. వీళ్ల కథ వింటే..!

ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో చెప్పడం కష్టం. అలాగే ప్రేమకు ధనిక, పేద తారతమ్యాలు కూడా ఉండవు. ఇది చాలా మంది విషయంలో జరిగేదే. కానీ ఎటొచ్చి మనుషుల గురించి తెలిసిన తరువాత అభిప్రాయాలు మారుతుంటాయి. ఈ మహిళ మాత్రం అందుకు విభిన్నం. ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంటే ఓ దొంగ ఆమె ఫోన్ లాక్కుపోయాడు. ఆ దొంగోడు ఫోన్ లో ఆమె ఫోటో చూసి ఫిదా అయ్యాడట. విచిత్రంగా ఆ అమ్మాయి కూడా ఈ దొంగోడిని ప్రేమించడం మొదలెట్టింది. అందరినీ విస్తుపోయేలా చేస్తున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

బ్రెజిల్(Brazil) దేశంలో ఇమాన్యూలా అనే పేరు గల యువతి తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తోంది. ఆమె ఒకరోజు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. అదే సమయంలో ఆ దారిలోనే నడుస్తున్న దొంగ(thief) యువతి చేతిలో ఉన్న ఫోన్(Phone) ను చూశాడు. అతను అదను చూసి ఆమె చేతిలో ఫోన్ లాక్కుని పరారయ్యాడు. అదే రోజు అతను తన గదికి చేరుకున్నతరువాత తను దొంగిలించిన ఫోన్ ను ఆన్ చేయగా డిస్ప్లే మీద ఇమాన్యూలా ఫోటో కనిపించింది(women photo on phone display). ఆమె ఫోటో చూడగానే అతను ఫిదా అయిపోయాడు. అతనికి అప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం వల్ల ఆమె తనకు గర్ల్ ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. వెంటనే ఆమెను కలిసి తన ప్రేమ విషయం చెప్పాడు(thief propose to women). అదేం విచిత్రమో ఏమో కానీ అతను వచ్చి అలా ప్రపోజ్ చేయగానే ఇమాన్యూలా అతని ప్రేమకు పచ్చజెండా ఊపింది. వారిద్దరూ రెండేళ్ళ నుండి ప్రేమలో మునిగి తేలుతున్నారు.

Viral: 40 శాతం డిస్కౌంట్‌ ఉందని ఆన్‌లైన్‌లో డ్రైఫ్రూట్స్ ఆర్డర్ ఇస్తే.. ఏకంగా రూ.7 లక్షలు మటాష్.. ఆమె చేసిన తప్పేంటంటే..!



వీరిద్దరి ప్రేమ అటూ ఇటూ తిరిగి సోషల్ మీడియాలోకి చొచ్చుకొచ్చింది. ఓ ఛానల్ నిర్వాహకులు వీరిని ఫ్రశ్నించగా జరిగిన సంగతంతా ఎంతో మురిపెంగా చెప్పుకొచ్చారు. ఇమాన్యూలా కు ప్రపోజ్ చేయడం గురించి సదరు దొంగను ప్రశ్నించగా 'ఆమె నాకు చాలా నచ్చింది. అసలంత అందమైన అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. నేను ఇప్పటికీ ఆమె ఫోన్ దొంగతనం చేసినందుకు చింతిస్తూనే ఉన్నాను. కానీ నేను ఆ పని చేయకపోతే ఆమె నాకు దక్కేది కాదు' అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రం తమ కూతురు ప్రేమిస్తున్నది దొంగను అనే విషయం తెలియదట. వీరి ప్రేమ కథ తెలిసిన పలువులు విభిన్న రకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొందరు వీరి ప్రేమను పొగుడుతుంటే, మరికొందరు చాలా కామెడిగా ఉంది, బ్రెజిల్ లోనే ఇలాంటివి జరుగుతాయి అని అంటున్నారు.

Viral: ఓ మహిళకు చాలా ఏళ్ల నుంచి నడుమునొప్పి.. చివరకు భరించలేక ఆస్పత్రికి వెళ్తే టెస్టులు చేసిన డాక్టర్లే షాక్.. 20 ఏళ్లుగా..!


Updated Date - 2023-07-27T13:28:20+05:30 IST