Viral: ఆశలన్నీ వదిలేసుకున్నారు.. కానీ సడన్‌గా మోగిందో కాలింగ్ బెల్.. తలుపులు తీసి చూస్తే కనిపించిన వ్యక్తిని చూసి..!

ABN , First Publish Date - 2023-07-20T12:51:03+05:30 IST

సమాజమంతా బ్రష్టు పట్టిపోయింది, మనుషులంతా స్వార్థపరులయ్యారు అని గగ్గోలు పెట్టేవారి నోరు మూయించడానికి అక్కడక్కడా కొన్ని ఆశ్చర్యపోయే సంఘటనలు జరుగుతుంటాయి.

Viral: ఆశలన్నీ వదిలేసుకున్నారు.. కానీ సడన్‌గా మోగిందో కాలింగ్ బెల్.. తలుపులు తీసి చూస్తే కనిపించిన వ్యక్తిని చూసి..!

సమాజమంతా బ్రష్టు పట్టిపోయింది, మనుషులంతా స్వార్థపరులయ్యారు అని గగ్గోలు పెట్టేవారి నోరు మూయించడానికి అక్కడక్కడా కొన్ని ఆశ్చర్యపోయే సంఘటనలు జరుగుతుంటాయి. 10రూపాయల నోటు పోగొట్టుకుంటేనే బాధపడిపోతుంటాం. అలాంటిది వేలాది రూపాయలు విలువ చేసే వస్తువు పోతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. ఇద్దరు స్నేహితులకు అదే బాధ పరిచయమైంది. పోగొట్టుకున్న వస్తువు గురించి బాధపడుతున్న సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఎంత ధనవంతులైనా సరే డబ్బు కానీ,ఇతర విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోవాలని అనుకోరు. ఒకవేళ పోయాయంటే మాత్రం చాలా బాధపడతారు. ఢిల్లీ(Delhi)కి చెందిన శామ్యుల్ అనే వ్యక్తి ఫిట్ నెస్ కోచ్ గా(fitness coach) పనిచేస్తున్నాడు. అతను తన స్నేహితుడు వివేక్ తో కలసి ఢిల్లీలోని IGI విమానశ్రయం(IGI Airport) నుండి మేరు క్యాబ్(@Merucabs) బుక్ చేసుకున్నాడు. ఆ క్యాబ్ డ్రైవర్ హీరాలాల్ మండల్ వారిని పికప్ చేసుకుని వారు బస చేసే హోటల్ వద్ద దించాడు. ఆ తరువాత స్నేహితులిద్దరూ హోటల్ లో తమ గదికి చేరుకున్న తరువాత శామ్యూల్ స్నేహితుడు వివేక్ తన పాకెట్ గమనించుకని షాకయ్యాడు. పాకెట్ లో ఉండాల్సి న మొబైల్ లేదు. హోటల్ గదికి వస్తున్నప్పుడు క్యాబ్ లోనే ఫోన్ మిస్సయినట్టు వారికి అర్థమైంది(Phone missing in cab). క్యాబ్ డ్రైవర్ ను సంప్రదించి ఫోన్ అడుగుదాం అనుకున్నారు. కానీ అతని ఫోన్ నెంబర్ వారి దగ్గర లేదు. దీంతో ఇక ఫోన్ తమ నుండి పూర్తీగా చేజారిపోయినట్టేనని దాని మీద ఆశ వదిలేసుకున్నారు.

Weight Loss Mistakes: బరువు తగ్గాలని ప్రయత్నించేవాళ్లు.. పొరపాటున కూడా ఈ 7 ఆహార పదార్థాలను పొద్దున్నే తినకండి..


స్నేహితులిద్దరూ హోటల్ గదిలో ధీనంగా కూర్చున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది. కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి తపులుపు తీయగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాకయ్యారు. తమను విమానాశ్రయం నుండి హోటల్ కు చేర్చిన క్యాబ్ డ్రైవర్ హీరాలాల్ మండల్ వారి ఎదురుగా నిలబడుకున్నాడు. సార్ మీ ఫోన్ నా క్యాబ్ లో మిస్సయింది అంటూ వారి మొబైల్ తిరిగి ఇచ్చేశాడు(cab driver return mobile). దీంతో ఆ స్నేహితులు ఆశ్చర్యపోయారు. అతని మంచితనానికి, నిజాయితీకి ముగ్దులైపోయారు. ఇలాంటి క్యాబ్ డ్రైవర్ లు ఉండటం మేరు క్యాబ్స్ అదృష్టమని, ఇలాంటి వారిని గుర్తించాలని చెబుతూ Shajan Samuel తన ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి హీరాలాల్ మండల్ తమకు ఫోన్ అందజేస్తున్న ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు క్యాబ్ డ్రైవర్ హీరాలాల్ మండల్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'నేటికాలంలో ఇలాంటి నిజాయితీపరులు ఉండటం గర్వించదగ్గ విషయం' అని పేర్కొన్నారు. 'భారతీయ జాతిరత్నాలు వీరు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'ఇలాంటి మంచి పని చేసిన వారిని గుర్తించి, అభినందించడం ముఖ్యం' అని మరికొందరు అంటున్నారు. కాగా హీరాలాల్ గతంలోనూ ఓ విదేశీయుడు తన వాలెట్ క్యాబ్ లో మరచిపోతే వెతుక్కుంటూ వెళ్లి మరీ ఇచ్చాడట.

Viral: జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులూ.. మీకో సవాల్.. ఈ ఫొటోలో అసలు ఎన్ని అంకెలు ఉన్నాయో చెప్పగలరా..?


Updated Date - 2023-07-20T12:51:03+05:30 IST