Share News

Viral: కుక్క, పిల్లి వల్లే ఘోరం.. ఈ ఫొటోలోని తండ్రీకొడుకులిద్దరూ.. ఒకరి తర్వాత మరొకరు ఎలా చనిపోయారంటే..!

ABN , First Publish Date - 2023-12-07T15:28:02+05:30 IST

పాపం ఎదిగొచ్చిన కొడుకు, ఇంటికి పెద్ద అయిన తండ్రి ఇద్దరూ కేవలం వారం రోజుల్లోపే మరణించారు. అది కూడా ఓ పిల్లి, కుక్క కారణంగా.. అసలు సంఘటన తెలస్తే షాకవుతారు.

Viral: కుక్క, పిల్లి వల్లే ఘోరం.. ఈ ఫొటోలోని తండ్రీకొడుకులిద్దరూ.. ఒకరి తర్వాత మరొకరు ఎలా చనిపోయారంటే..!

మరణాలు పలు రకాలుగా సంభవిస్తాయి. కానీ ఊహించని విధంగా జరిగే మరణాలు కుటుంబాలను, ప్రజలను భయాందోళనకు గురిచేస్తాయి. పాపం ఎదిగొచ్చిన కొడుకు, ఇంటికి పెద్ద అయిన తండ్రి ఇద్దరూ కేవలం వారం రోజుల్లోపే మరణించారు. అది కూడా ఓ పిల్లి, కుక్క కారణంగా కావడం అందరినీ భయానికి గురిచేస్తోంది. ఇలా కూడా మరణాలు సంభవిస్తాయా అని ప్రజలను కలవరపెడుతోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో చోటు చేసుకున్న ఈ షాకింగ్ మరణాల గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం కాన్పూర్ లోని అక్భ్రర్ పూర్ నగరంలో ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని కుటుంబంలో ఎదిగొచ్చిన కొడుకు కూడా ఉన్నాడు. కుటుంబ సభ్యులు సరదాగా ఓ పిల్లిని పెంచుకున్నారు. వారు దాన్ని తమ కుటుంబంలో ఒకరిగా చూసుకునేవారు. దాంతో ఆడుకోవడం, అల్లరిచేయడం చేసేవారు. ఒకరోజు పిల్లి ఇంటి బయట ఉన్న సమయంలో ఓ వీధి కుక్క పిల్లిమీద దాడి చేసింది. దాడిలో పిల్లి తప్పించుకుంది కానీ దానికి కుక్క కాటు పడింది. దీంతో కొన్ని రోజుల్లోనే పిల్లిలో రేబిస్ వ్యాధి అభివృద్ది చెందింది(rabies developed in cat). అయితే కుటుంబ సభ్యులు దీన్ని పట్టించుకోలేదు. ఒకరోజు ఇంట్లో కుర్రాడు పిల్లితో ఆడుకుంటున్నప్పుడు పిల్లి గోళ్లతో గీరింది. అతను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులలోపే అతని ఆరోగ్య పరిస్థితి దిగజారింది. పిల్లి లక్షణాలు అతనిలో కనిపించడం మొదలుపెట్టాయి. ఆ తరువాత అతను మరణించాడు.

ఇది కూడా చదవండి: Smartphones: పాత ఫోన్లను అమ్మేస్తున్నా.. ఎక్ఛేంజ్ చేస్తున్నారా..? ఈ 5 విషయాలను అస్సలు మర్చిపోవద్దు..!



కొడుకు మరణించిన వారం రోజులలోనే ఆ ఇంటి పెద్ద కూడా అనారోగ్యానికి గురయ్యాడు. అచ్చం కొడుకు మరణించిన విధంగానే అతను కూడా మరణించాడు. కేవలం వారం రోజులలోపే ఇంటి మగవారు ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇతర కుటుంబ సభ్యులకు ఇలానే వ్యాధి సోకుతుందేమోనని వారు భయందోళనలో ఉన్నారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ ప్రాంత ప్రజలు ఈ రెండు మరణాలతో హడలిపోతున్నారు. పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇప్పించాలని లేకపోతే ఇలాగే జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Bride: అత్తారింటికి వెళ్తుండగా సడన్‌గా కారును ఆపమన్న వధువు.. ఈ భర్త నాకొద్దంటూ తిరిగి పుట్టింటికి.. అసలేం జరిగిందంటే..!


Updated Date - 2023-12-07T15:28:04+05:30 IST