Viral News: పొలంలో పనిచేస్తుండగా బయటపడిందో పెట్టె.. అనుమానంగానే ఓపెన్ చేసిన రైతుకు భారీ షాక్.. 157 ఏళ్ల క్రితం నాటి..!
ABN , First Publish Date - 2023-07-14T10:38:06+05:30 IST
10రూపాయల నోటు దొరికితేనే అదృష్టంగా ఫీలైపోతుంటారు కానీ.. ఈ రైతుకు ఏకంగా తన పొలంలో పెట్టె దొరికింది. అది తెరవగానే..
దారిలో వెళుతున్నప్పడు 10రూపాయల నోటు దొరికితేనే అదొక పెద్ద అదృష్టంగా ఫీలైపోయేవాళ్లుంటారు. కానీ ఊహించని విధంగా భోషాణాలు, పెట్టెలు దొరికితే.. ఆ ఫీల్ మాటల్లో చెప్పలేనిది. ఓ రైతుకు అలాంటి అనుభవం ఎదురయ్యింది. ఓ రైతు తన మానాన తను పంట వేయడం కోసం భూమి తవ్వుతున్నాడు. అతని నాగలికి ఏదో అడ్డొచ్చింది, ముందుకు కదలడం ఆగిపోయింది. ఏమై ఉంటుందా అని అతను ఆ ప్రాంతంలో తవ్వగానే ఓ పెట్టె దొరికింది. అది చూసి అతను షాకయ్యాడు. పెట్టె తెరవగానే అతని కళ్ళు జిగేలుమన్నాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి వివరంగా తెలుసుకంటే..
అదృష్టం(Luck) ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. లక్ష్మిదేవి తనకు తాను మనల్ని వరిస్తే ఆ కిక్కే వేరు. అమెరికాలోని(America) కెంటుకీ(Kentucky) రాష్ట్రంలో ఓ రైతు(Farmer) తన పొలంలో పనిచేస్తున్నాడు. అందులో భాగంగా అతను భూమి దున్నుతున్నాడు. అయితే ఒక్కసారిగా భూమి దున్నడంలో ఆటంకం ఏర్పడింది. ఏమై ఉంటుందా అని అతను ఆ ప్రాంతంలో జాగ్రత్తగా తవ్వగా ఓ పెట్టె బయటపడింది(Box). ఆ పెట్టెను తవ్వగానే అతను షాకయ్యాడు. అందులో బంగారు, వెండి నాణేలు(Gold, Silver coins) మట్టికొట్టుకుపోయి కనిపించాయి. తను చూసింది నిజమా కాదా అనే ఆలోచనలో అతను చాలాసేపు సందిగ్ధంలో ఉండిపోయాడు. ఆ తరువాత ఆ నాణేలను కొన్ని చేతుల్లోకి తీసుకుని కడిగాడు. అవి దగదగా మెరిసిపోతూ కనిపించాయి. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
Ambani Family: అంత పెద్ద ఇంద్రభవనంలో అన్నీ వదిలేసి.. 27వ అంతస్తులోనే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఉండటం వెనుక..!
ఈ నాణేలు అన్నీ 1840-1863 కాలానికి చెందినవిగా తెలిశాయి. అమెరికాలో 1861-1865 వరకు అంతర్యుద్దం జరిగింది(America civil war). ఈ యుద్దం తరువాత అక్కడి అన్ని బంగారు, వెండి నాణేల మీద 'ఇన్ గాడ్ వి ట్రస్ట్' అని రాయబడింది. ఈ వాక్యాలు రైతుకు లభించిన నాణేల మీద కూడా ఉన్నాయట. దీన్ని బట్టి ఇవి యుద్ద సమయం, యుద్దం ముగిసిన తరువాత ఎవరో భూమిలో నిక్షిప్తం చేశారని అంటున్నారు. రైతుకు భూమిలో దొరికిన బంగారు నాణేలు సుమారు 700(700 gold coins), వెండినాణేల లెక్క తెలియలేదు. ఇవి భూమిలో ఇన్నేళ్ళ పాటు నిక్షిప్తమైపోయినా వీటి మెరుపు చెక్కుచెదరలేదు. మట్టితో దొరికిన తరువాత వీటిని నీటితో శుభ్రం చేయగానే దగదగా మెరుస్తున్నాయి. అంతేకాదు ఈ బంగారు వెండి నాణేలతో పాటు అప్పట్లో వాడుకలో ఉన్న 1డాలర్, 10, 20 డాలర్ల నాణేలు కూడా భూమిలో లభ్యమయ్యాయి, అరుదైన లిబర్టీ ప్యాటర్న్ నాణేలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నిధికి ఆర్కియాలజీ విభాగం వారు 'గ్రేట్ కెంటకీ హోర్డ్' అని పేరు పెట్టారు. కాగా ఈ నాణేలను వేలానికి పెట్టారు. ఈ నాణేలలో కొన్నింటి విలువ లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు.దీంతో ఈ రైతు దశ మారోపోయినట్టే అంటున్నారంతా.