Viral News: అమ్మ బాబోయ్.. కారు నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా రూ.123 కోట్లా..? ఫ్యాన్సీ నెంబర్ అంటే మరీ ఇంత పిచ్చా..?

ABN , First Publish Date - 2023-04-11T16:00:27+05:30 IST

ఒకటి రెండు కాదు ఏకంగా 123కోట్లతో ఫ్యాన్సీ నెంబర్ అనే మాట వినగానే దిమ్మతిరిగిపోతోంది అందరికీ కానీ ఈ నెంబర్ కొనుగోలు చేసిన వ్యక్తికి గతంలో..

Viral News: అమ్మ బాబోయ్.. కారు నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా రూ.123 కోట్లా..? ఫ్యాన్సీ నెంబర్ అంటే మరీ ఇంత పిచ్చా..?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 123కోట్లు. అది కూడా కేవలం కారు నెంబర్ ప్లేట్(car number plate) కోసమే అంటే దిమ్మ తిరిగిపోతోంది కదా! కానీ నిజమండీ.. లక్ష రూపాయల(one lakh rupee)తో మొదలయ్యే ఈ నెంబర్ ప్లేట్ ల గోల ఫ్యాన్సీ నెంబర్లంటూ 5లక్షల(5 lakhs) వరకు ఉంటుంది. కానీ ఏకంగా 123కోట్ల రూపాయలతో ఫ్యాన్సీ నెంబర్(123 crores fancy number) అంటే ఆ నెంబర్లో ఉన్న స్పెషాలిటీ.. దానికోసం జరిగిన పోటీ.. అసలెందుకు అంత ధర పోయింది? అని బోలెడు సందేహాలు కలుగుతాయి. దీని గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

దుబాయ్(Dubai) అంటేనే సంపన్నుల నిలయం. ఎంతో మంది ధనికులు అక్కడ జీవించడానికి ఇష్టపడతారు. దానిక్కారణం అక్కడ పన్నులు ఉండవని. దేశాలన్నీ ఆర్థిక మాంద్యం(economic depression) గురించి ఆలోచిస్తుంటే దుబాయ్ మాత్రం బలమైన ఆర్థికవ్యవస్థతో ధీమాగా ఉంటుంది. ఈ దుబాయ్ లో బల్వీందర్ సింగ్ సాహ్ని అనే వ్యాపారవేత్త(business man) ఉన్నాడు. 2006లో ఇతను దుబాయ్ లో ఉన్న ప్రతిష్టాత్మకమైన బుర్ఝ్ అల్ అరబ్ హోటల్(hotel burj al arab) కు వెళ్ళాడు. అక్కడ ఆయన కార్ నెంబర్ ప్లేట్ లో చాలా నెంబర్లు ఉన్నాయని లోపలికి అనుమతించలేదు. రెండంకెల నెంబర్ ప్లేట్(two numbers number plate) అయినా ఉండాలి. లేదా ఆ హోటల్ లో ముందుగానే రిజర్వేషన్(reservation) అయినా చేయించి ఉండాలి. లేకపోతే లోపలికి అనుమతించరు. దాంతో రెండంకెల నెంబర్ ప్లేట్ కొనుగోలు చేయాలని అతను ఎప్పటినుండో ట్రై చేసేవాడు. ఆ ప్రయత్నంలోనే 2016లో D5 అనే నెంబర్ ప్లేట్ ను 33మిలియన్ దిర్హామ్ లను వెచ్చించి కొనుగోలు చేశాడు. దీని విలువ భారతీయ కరెన్సీలో 73కోట్లు.

White hair: కొబ్బరి నూనెలో ఈ రెండిటినీ కలపి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!


ఇప్పుడు మళ్ళీ అతనే 55మిలియన్ దిర్హామ్ లు వెచ్చించి P7 అనే నెంబర్ ప్లేట్ ను కొనుగోలు చేశాడు. దీని ధర భారతీయ కరెన్సీలో 123కోట్లు. ఈ వేలం పాటలో వచ్చే డబ్బు స్వచ్చంద సంస్థలకు వెళుతుందనే కారణంతో సాహ్ని నెంబర్ ప్లేట్ కొనుగోలు చేసినట్టు చెప్పాడు. కాగా ఇప్పుడు కోనుగోలు చేసిన నెంబర్ ప్లేట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. 2008లో నయీద్ అబ్దుల్ గఫార్ ఖౌరీ 52.2 మిలియన్ దిర్హామ్ లతో నెంబర్ ప్లేట్ కొనుగోలు చేశాడు. ఇప్పటిదాకా అదే అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ గా నమోదై ఉండేది. సాహ్ని ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

Viral Video: రైతన్నా.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఓ ఖాళీ బీరు బాటిల్‌ను, ఓ మొబైల్ పౌచ్‌ను కలిపి ఇలా చెట్టుకు ఎందుకు వేళాడదీశాడో చూస్తే..


Updated Date - 2023-04-11T16:00:27+05:30 IST