Viral News: నాకు క్యాన్సర్ ఉందంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫిట్నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ బాధాకరమైన పోస్ట్.. మూడేళ్ళ తరువాత తెలిసిన నిజాలివీ..
ABN , First Publish Date - 2023-06-11T17:44:08+05:30 IST
మనుషులకు స్పందించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సహాయం చేయకపోయినా ఎదుటి వారి బాధలు, కష్టాలు విన్నప్పుడు అయ్యో పాపం అనేస్తుంటాం. అంతేనా.. వారికి కాసిన్ని ధైర్య వచనాలు చెప్పి వారిని ఊరడిస్తాం కూడా. ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ లో
మనుషులకు స్పందించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సహాయం చేయకపోయినా ఎదుటి వారి బాధలు, కష్టాలు విన్నప్పుడు అయ్యో పాపం అనేస్తుంటాం. అంతేనా.. వారికి కాసిన్ని ధైర్య వచనాలు చెప్పి వారిని ఊరడిస్తాం కూడా. సరిగ్గా మూడేళ్ళ క్రితం ఫిట్నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా పేరుపొందిన ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ లో నాకు క్యాన్సర్ ఉందంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన వారు ఆమెకు మానసిక ధైర్యం చెప్పారు. ఆమెను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఆమెను సరైన ఆరోగ్యం దిశగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అయితే మూడేళ్ళ తరువాత.. అంటే ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె పోస్ట్ చూసి ఆమె అనుచరులు కోపంతో రగిలిపోతున్నారు. ఈ సంఘటనరకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
యూట్యూబ్(You Tube)లో ఇన్స్ట్రాగ్రామ్ (Instagram)లో ఎంతో మంది తమ జీవితంలో బాధలు, సంతోషాలు షేర్ చేసుకుంటారు. ఈ కారణంగా వారు సబ్స్ర్కైబర్లను, ఫాలోయర్లను సంపాదించుకుని డబ్బు చేసుకుంటూ ఉంటారు. మియాన్ బావోబావో అనే పేరు కలిగిన విదేశీ మహిళ కూడా మూడేళ్ళ క్రితం నాకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్(pancreatitis cancer last stage) లో ఉంది అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ (Instagram post) పెట్టింది. అది చూసి చాలా మంది ఆమెకు ధైర్యం చెప్పారు. 'మేము నీవెంటే ఉంటాం నువ్వు సంతోషంగా ఉండు, ఆరోగ్యం చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి'అంటూ ఎంతో పాజిటివ్ గా స్పందించారు. మియాన్ బావోబావో ఫిట్నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ కావడంతో ఆమె రోజూ వర్కౌట్స్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసేది(Women shared workouts videos in Instagram). ప్రతి వీడియోలో తను క్యాన్సర్ ను జయించడానికి చేస్తున్న పోరాటాన్ని, తన వర్కౌట్స్ అన్నీ క్యాన్సర్ చికిత్సలో భాగమని చెప్పేది. దీంతో గత మూడేళ్ళ నుండి 11వేల మంది ఆమెను అనుసరిస్తూ వచ్చారు.
Viral video: ఓ రైతుకు ఇంతకన్నా ఏమి కావాలి.. పొలంలో నిరాశగా కూర్చుని ఉన్న రైతునుచూసి పెంపుడు జంతువులు ఏమి చేశాయంటే..
కాగా తాజాగా మియాన్ బావోబావో తన ఇన్స్టాగ్రామ్ పేజిలో పెట్టిన ఓ పోస్ట్ ధుమారం రేపింది. 'నాకు క్యాన్సర్ లేదు, కేవలం అనుచరులను పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను క్యాన్సర్ ఉన్నట్టు మూడేళ్ళ నుండి అబద్దం చెబుతూ వస్తున్నాను. నా కుటుంబ సభ్యులకు కూడా అబద్దం చెప్పాను. స్నేహితులకు, అభిమానులకు, నెటిన్లకు అందరికీ క్షమాపణ చెబుతున్నాను' అని ఆమె పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, ఆమె అనుచరులు ఆమె మీద చాలా కోపంగా ఉన్నారు. ఫాలోయర్స్ కోసం మరీ ఇంత దిగజారాలా అని ఆమెను నేరుగా దూషించడం మొదలుపెట్టారు. 'ఇలాంటి గేమ్స్ ప్లే చేయడం వల్ల నిజంగా క్యాన్సర్ ఉన్నవారిని ఎగతాళి చేసినట్టు అవుతుంది' అని ఆమె మీద మండిపడ్డారు. కాగా మియాన్ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఎక్స్-రే ను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకుని అందరినీ నమ్మించినట్టు తెలిసింది. ఈమె కారణంగా సోషల్ మీడియాలో ఇలాంటివి చెప్పేవారిని నమ్మకండి అని అంటున్నారు పలువురు నెటిజన్లు.