Tomato Thulabaram: టమోటాలతో తులాభారం.. అవాక్కవుతున్న జనం
ABN , First Publish Date - 2023-07-17T19:08:32+05:30 IST
అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనకాపల్లిలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు టమోటాలతో తులాభారం నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమ కోరిక నెరవేరితో అమ్మవారికి తమ కుమార్తె పేరు మీద నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకున్నారు. సదరు దంపతుల కోరిక నెరవేరడంతో అమ్మవారికి టమోటాలతో తులాభారం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు.
దేశవ్యాప్తంగా సామాన్యులకు టమోటా (Tamota) ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కిలో టమోటా రూ.150కి పైగానే పలుకుతోంది. దీంతో టమోటాలను కొనేందుకు ప్రజలు జంకుతున్నారు. ఒకవేళ కొనుగోలు చేసినా ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నారు. గతంలో కిలో రూ.20 పలికిన టమోటా ఇప్పుడు ఖరీదైన కూరగాయల (Costly Vegetable) జాబితాలో చేరిపోవడంతో కొన్ని చోట్ల వ్యాపారులు సీసీ కెమెరాల నిఘాలో టమోటాలను విక్రయిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి (Anakapalli) జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనకాపల్లిలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు టమోటాలతో తులాభారం నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమ కోరిక నెరవేరితో అమ్మవారికి తమ కుమార్తె పేరు మీద నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకున్నారు. సదరు దంపతుల కోరిక నెరవేరడంతో అమ్మవారికి టమోటాలతో తులాభారం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. దీని కోసం 51 కేజీల టమోటాలతో పాటు బెల్లం, పంచదార కూడా సమర్పించుకున్నారు. వీటిని ఆలయంలో నిత్యాన్న దానం కోసం వినియోగించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Viral Video: పాపం.. ఈ అమ్మాయి.. కోతే కదా భయపడిపోతుందిలే అనుకుంటే.. ఇలా షాకిస్తుందని అస్సలు ఊహంచలేదు..!
కాగా అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో నిర్వహించిన టమోటాల తులాభారాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. బెల్లం, పంచదార, డబ్బులు వంటి వాటితో దేవుడికి తులాభారం వేయడం చూశామే కానీ ఇలా టమోటాలతో కూడా తులాభారం వేస్తారా అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. కొందరు అయితే ఈ తులాభారాన్ని తమ ఫోన్‌లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మరోవైపు దేశంలో పలు చోట్ల టమోటాల దొంగతనాలు భారీగా జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల టమోటాలను శుభకార్యాల్లో వినూత్నంగా బహుమతులుగా ఇస్తున్నారు. అటు టమోటాలతో కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. మొత్తానికి ధరల కారణంగా టమోటాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి.