Viral News: బీచ్ ఒడ్డున షాకింగ్ సీన్.. పాదచారులకు దూరంగా కనిపించిందో ఆకారం.. ఏంటా అని వెళ్లి చూస్తే..!

ABN , First Publish Date - 2023-07-20T16:44:01+05:30 IST

సముద్రం దగ్గరగా ఉన్న ప్రజలు హాయిగా ఉదయం సాయంత్రం సముద్రతీరాన వాకింగ్ చేస్తుంటారు. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి వెళ్ళే వారు కూడా ఉంటారు. ఈ విధంగానే కొందరు ఉదయాన్నే బీచ్ ఒడ్డున వాకింగ్ కు వెళ్ళారు. కానీ..

Viral News: బీచ్ ఒడ్డున షాకింగ్ సీన్.. పాదచారులకు దూరంగా కనిపించిందో ఆకారం.. ఏంటా అని వెళ్లి చూస్తే..!

సముద్రం అంటే అందరికీ ఇష్టం. సముద్రం దగ్గరగా ఉన్న ప్రజలు హాయిగా ఉదయం సాయంత్రం సముద్రతీరాన వాకింగ్ చేస్తుంటారు. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి వెళ్ళే వారు కూడా ఉంటారు. ఈ విధంగానే కొందరు ఉదయాన్నే బీచ్ ఒడ్డున వాకింగ్ కు వెళ్ళారు. వారు వాకింగ్ చేస్తోంటే దూరంగా వారికి పొడవుగా ఒక ఆకారం కనిపించింది. ఏమిటా అని దగ్గరకెళ్ళి చూసి షాకయ్యారు. లావుగా, భారీగా ఉన్న పాము వారికంట పడింది. దాన్ని చూసి వారు భయపడిపోయారు. కానీ దాన్ని సముద్రంలోకి తోసెయ్యాలని అనుకున్నారు. దీని తరువాత జరిగిన సంఘటనలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. బీచ్ అంటే ఇష్టమున్నవారు కూడా ఇప్పుడు భయపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియా(Australia) దేశంలో క్వీన్స్ లాండ్ సన్‌షైన్ కోస్ట్‌(Queensland Sunshine coast) ఉంది. ఉదయాన్నే సముద్రపు ఒడ్డున వాకింగ్ కు వెళ్లిన కొందరికి దూరంగా ఓ ఆకారం కనిపించింది. ఏమయ్యుంటుందా అని అనుమానంగానే దగ్గరకు వెళ్ళారు. మీటరు పైన పొడవు, దానికి తగిన లావుతో భారీగా ఉన్న పాము(Snake)కనిపించింది. మొదట ఆ పామును సముద్రంలో తిరిగి విడిచిపెట్టాలని వారు అనుకున్నారు. కానీ ఆ పాము కదలడానికి ఇబ్బంది పడుతుంటే సన్‌షైన్ కోస్ట్‌ స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్లు వెంటనే అక్కడికి చేరుకుని ఆ పామును చూసి షాకయ్యారు. అది స్టోక్స్ సముద్రపు పామని(stokes's sea snake), చాలా విషపూరితమైనదని(most poisonous snake) వారు చెప్పారు. ఇలాంటి పాములను తాకితేనే ప్రాణాలకు ప్రమాదమని, వాటిని తిరిగి సముద్రంలోకి వదిలివేయాలనే ప్రయత్నాలు చేయద్దని వారు ప్రజలను హెచ్చరించారు. పాము వయసు 10సంవత్సరాలు ఉండవచ్చని, దాని బరువు 2నుండి 3కేజీలు ఉంటుందని అంచనా వేశారు. ఆ పాము ఒకవైపు చర్మం కట్ అయి ఉండటంతో దాన్ని సంరక్షించే నిమిత్తం జాగ్రత్తగా ఆస్ట్రైలియా జూ వణ్యప్రాణి ఆసుపత్రికి(Australia Wild animal hospital) తరలించారు.

bee.gif

Viral: ఆశలన్నీ వదిలేసుకున్నారు.. కానీ సడన్‌గా మోగిందో కాలింగ్ బెల్.. తలుపులు తీసి చూస్తే కనిపించిన వ్యక్తిని చూసి..!


ఈ సంఘటన తరువాత అంతా ఇక సమస్య ముగిసిందని అనుకుంటున్న సమయంలో సన్‌షైన్ కోస్ట్‌ స్నేక్ క్యాచెర్స్ విషాద వార్తను తెలిపారు. ఆ పామును ఇంకా ఆసుపత్రికి తరలిస్తుండగానే దారి మధ్యలోనే అది ప్రాణాలు వదిలిందని తెలిపారు. ఆ పాము అప్పటికే చాలా దెబ్బతిని ఉందని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఇది తెలిశాక నెటిజన్లు బాధపడ్డారు. ఈ పాము వ్యవహారం తెలిసిన నెటిజన్లు కొందరు ఆశ్చర్యపోతున్నారు. 'సముద్రపు పాము ఇంత పెద్దగా, విషపూరితంగా ఉంటాయని నేను అస్సలు అనుకోలేదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఈ ఫోటోలో పాము దాని జీవితం చివరి దశలో ఉందంటే ఆశ్చర్యోంగానూ, బాధగానూ ఉంది' అని మరొకరు కామెంట్ చేశారు.

Health Tips: తెలియక చేస్తున్న మిస్టేక్ ఇదే.. పొరపాటున కూడా రెండోసారి వేడి చేయకూడని ఆహార పదార్థాలివీ..!


Updated Date - 2023-07-20T16:44:01+05:30 IST