Viral News: ఈ టీ షాప్ ఓనర్ తెలివి మామూలుగా లేదుగా.. ఛాయ్ షాప్‌నకు అతడు పెట్టిన పేరుపై నెట్టింట హాట్ టాపిక్..!

ABN , First Publish Date - 2023-05-18T13:46:49+05:30 IST

వేగవంతమవుతున్న ఈ ప్రపంచంలో అన్ని విషయాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యాపారం అనేది కత్తిమీద సాము లాంటిది. కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారులు చాలా కొత్తగానూ, తెలివిగానూ ఆలోచిస్తారు. ఓ టీ షాప్ వ్యాపారి ఆలోచన చూసి నెటిజన్లు షాకవుతున్నారు..

Viral News: ఈ టీ షాప్ ఓనర్ తెలివి మామూలుగా లేదుగా.. ఛాయ్ షాప్‌నకు అతడు పెట్టిన పేరుపై నెట్టింట హాట్ టాపిక్..!

వేగవంతమవుతున్న ఈ ప్రపంచంలో అన్ని విషయాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యాపారం అనేది కత్తిమీద సాము లాంటిది. కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారులు చాలా కొత్తగానూ, తెలివిగానూ ఆలోచిస్తారు. ఓ టీ షాప్ వ్యాపారి ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను షాపుకు పెట్టిన పేరు ఏంటో తెలిసి నెటిజన్లు కళ్ళు ఇంత చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఇప్పటికాలంలో హోటల్స్ కు కొదవే లేదు. ఇంటి నుండి అడుగు బయట పెడితే చాలు హోటళ్ళు, టీ కొట్లు, రెస్టారెంట్లు. రోడ్డు సైడ్ కూడా తోపుడు బండ్లు ఇలా చాలా పలకరిస్తాయి. దీంతో ఫుడ్ బిజినెస్ లో పోటీ తత్వం(food business cpmpitetion) చాలానే ఉంది. కానీ వ్యాపార సూత్రం(business principle) తెలిసినోడు ఎలాగైనా డబ్బు సంపాదిస్తాడు. అందుకోసం ఆకర్షణ మంత్రం ఉపయోగిస్తాడు. అందులో ఒక భాగమే షాప్ లకు, రెస్టారెంట్లకు పెట్టే పేర్లు కాస్త కొత్తగా, వింతగా(new and different) ఉండటం. ఓ టీ షాప్ ఓనర్(Tea shop owner) కస్టమర్లను ఆకర్షించేందుకు టెక్నాలజీ మైండ్ తో ఆలోచించాడు. ఈ మధ్యన ఎక్కడ చూసిన చాట్ బాట్(Chat boat), చాట్ జీపిటి(Chat GPT) గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. టీ షాప్ ఓనర్ చాట్ జీపిటి ఆధారంగా.. ఛాయ్ జిపిటి ChaiGPT అని తన దుకాణానికి పేరు పెట్టాడు. దానికి 'జెన్యూన్లీ ప్యూర్ టీ' అనే క్యాప్షన్ కూడా జోడించాడు. ఛాట్ జీపిటి(CHAT GPT) ఉదృతం అవుతున్న ఈ కాలంలో అతను టీ షాప్ కు అలా పేరు పెట్టడం చూసి సోషల్ మీడియా అవాక్కవుతోంది.

Bride: పెళ్లి పీటలపై నుంచి మధ్యలోనే లేచి వెళ్లిపోయిన వధువు.. అసలు కారణం తెలిసి శభాష్ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన బంధువులు..!


ఈ టీ షాపుకు సంబంధించిన ఫోటోను స్వాతి అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ అకౌంట్ SwatKat నుండి షేర్ చేశారు. 'సిలికాన్ వ్యాలీ సంస్ధ మేము బెస్ట్ స్టార్టప్ ఐడియాలు ఇస్తాము అని చెబుతుంది. కానీ భారతీయ టీ షాపులకు ఆ అవసరం లేదు' అని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'వ్యాపారులు కూడా టెక్నాలజీని చాలా తొందరగానే ఒంటబట్టించుకుంటున్నారు' అంటున్నారు. ChaiGPT అనే పేరు వల్ల చాలామంది అక్కడికి వెళ్ళి టీ తాగడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.

Viral Video: అమ్మాయిలూ.. బీ అలెర్ట్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారా..? ఈ యువతికి ఏం జరిగిందో చూస్తే..!


Updated Date - 2023-05-18T13:46:49+05:30 IST