Viral News: ఈ మహిళది కదా అదృష్టమంటే.. రూ.660 పెట్టి ఓ షాపులో కొని.. అసలు అదేంటో తెలిసి రూ.33 లక్షలకు మళ్లీ అమ్మేసింది..!
ABN , First Publish Date - 2023-05-19T11:33:22+05:30 IST
కొన్నతరువాత వస్తువును అమ్మితే చాలా వరకు నష్టం వస్తుంది. కానీ ఈ మహిళను మాత్రం అదృష్టలక్ష్మి వరించింది. ఒకటి రెెండు కాదు ఏకంగా 33లక్షల రూపాయలు దోసిట్లో వచ్చి పడ్డాయి. ఇంతకీ ఆమె కొన్నదేంటో చూస్తే..
చాలామంది ఏదైనా వస్తువు కొన్నతరువాత డబ్బు అత్యవసరం వల్లో లేక వస్తువు అంతగా నచ్చకనో ఇతరులకు అమ్మేస్తుంటారు. అలా అమ్మినప్పుడు కొన్న విలువ తగ్గించుకుని నష్టానికి అమ్మడం చూస్తూంటాం. కానీ ఈ మహిళ విషయంలో మాత్రం భిన్నంగా ఉంది. ఆమె 660 రూపాయలు పెట్టి కొనుగోలు చేసినదాన్ని ఏకంగా 33లక్షలకు అమ్మింది. బంగారం కంటే కూడా ఎక్కువ ధర పలికిన ఆ వస్తువేంటి? ఎందుకు అంత ధర.. పూర్తీగా తెలుసుకుంటే..
అదృష్టం(Luck) అనేది ఎప్పుడూ అందంగా కనిపించదు. రాయిలాగా కనబడే వజ్రంలాగే ఉంటుంది అదృష్టం కూడా. న్యూయార్క్(New York) కు చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. ఆ మహిళ దాన్ని గుర్తించి అదృష్టాన్ని సొంతం చేసుకుంది. న్యూయార్క్ కు చెందిన నాన్సీ కాలీవర్ అనే మహిళ 2017 లో వేసవి కాలంలో తన పని ముగించుకుని ఇంటికి వెళుతోంది. ఆమె వెళ్తున్న దారిలో సాల్వేషన్ ఆర్మీ ఉంది. అక్కడ అమ్మకానికి పెట్టిన నాలుగు పింగాణి ప్లేట్లు(4 ceramic plates) ఆమెను ఆకర్షించాయి. మొదట కొనడం ఎందుకులే దండగ అనుకుంది. కానీ, ఆ ప్లేట్లు తన డైనింగ్ టేబుల్ మీద చాలా అందంగా ఉంటాయనే ఆలోచన ఆమెను కొనకుండా ఉండనివ్వలేదు. దీంతో ఆమె నాలుగు పింగాణీ ప్లేట్ల సెట్ ను 660/ రూపాయలకు కొనుగోలు చేసింది. వాటిని కొని ఇంటికెళ్ళిన తరువాత ఆమె ఆ ప్లేట్లను చూస్తే వాటిలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది . నల్లని పింగాణీ ప్లేట్ల మీద తెల్లని లైన్లతో ముఖాకృతిని పోలిన ఆ ప్లేట్లు సాధారణమైనవిలా అనిపించలేదామెకు. వెంటనే ఆమె గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. చాలా వెతికిన తరువాత ఆమెకు దిమ్మ తిరిగిపోయే నిజం తెలిసింది.
Table Fan Cooler: ఎండలకు తట్టుకోలేక వెరైటీ ప్లాన్.. టేబుల్ ఫ్యాన్‌ను సింపుల్ ట్రిక్స్‌తో కూలర్‌గా మార్చేశాడు..!
ఆ ప్లేట్ల మీద ఉన్న ఆకృతులను ప్రముఖ చిత్రాకారుడు పికాసో(Famous painter Picasso) గీసినవిగా తెలిసింది. 1940 సంవత్సరంలో దక్షిణ ఫ్రెంచ్ సిటీ అయిన మడౌరాలో వాటిని తయారు చేశారట, పికాసో స్వయంగా ఆ ప్లేట్ల మీద ఆకృతులు(Picasso painted shapes on plates) గీశారని తెలిసింది. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. 'నేను వీటిని కొన్నప్పుడు సాధారణమైనవే అనుకున్నాను. కానీ గూగుల్ సెర్చ్ తరువాత అవెంత విలువైనవో తెలిసి షాకయ్యాను. సంతోషంతో ఏడ్చాను' అని చెప్పుకొచ్చింది. ఈ పింగాణీ ప్లేట్లను వరుసగా 9, 10, 13 లక్షలకు అమ్మింది. మిగిలిన ఒక ప్లేట్ ను అలాగే తన దగ్గర భధ్రపరుచుకుంది. దాన్ని 20 సంవత్సరాల తరువాత అమ్మి, ఆ డబ్బును తన కూతుళ్ళకు ఇస్తానని చెప్పుకొచ్చింది. కాగా ఇలా పురాతన వస్తువులను కొని వాటిని అధిక ధరకు అమ్మడం ఈమెకు ఇదే మొదటిసారి కాదట. కొన్నేళ్ళ కిందట అలెగ్జాండర్ మెకిక్వీన్ సూట్ ను 20 డాలర్లకు కొనుగోలు చేసి దాన్ని తిరిగి 6.62 లక్షల రూపాయలకు అమ్మిందట. ఏదిఏమైనా 'మట్టిలో బంగారాన్ని వెతకడం ఈ మహిళకు బాగా తెలిసినట్టుంది' అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'పెద్దవాళ్ళు పాత వస్తువులను అమ్మడానికి అంత సులువుగా ఒప్పుకోరు ఇందుకే' అని మరికొందరు అంటున్నారు.