Viral News: ఈ 4 ఏళ్ల బాలుడికి ఏమయింది..? పుట్టుకతోనే ముఖం ఇలా ఉండటానికి కారణమేంటి..? ప్రస్తుతం ఈ పిల్లాడి పరిస్థితి ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-04-15T22:46:45+05:30 IST

ప్రతి ఆడపిల్ల తను గర్భవతిగా(Pregnancy) ఉన్నప్పుడు తనకు పుట్టే బిడ్డ అందంగా, చందమామలాగా ఉండాలని, గుమ్మడిపండులా ముద్దుగా బొద్దుగా పుట్టాలని ఆశ పడుతుంది. ఓ తల్లి కూడా అదే విధంగా ఆశ పడింది. కానీ..

Viral News: ఈ 4 ఏళ్ల బాలుడికి ఏమయింది..? పుట్టుకతోనే ముఖం ఇలా ఉండటానికి కారణమేంటి..? ప్రస్తుతం ఈ పిల్లాడి పరిస్థితి ఏంటంటే..!

ప్రతి ఆడపిల్ల తను గర్భవతిగా(Pregnancy) ఉన్నప్పుడు తనకు పుట్టే బిడ్డ అందంగా, చందమామలాగా ఉండాలని, గుమ్మడిపండులా ముద్దుగా బొద్దుగా పుట్టాలని ఆశ పడుతుంది. ఓ తల్లి కూడా అదే విధంగా ఆశ పడింది. కానీ ఆమె ఆశ అడియాశలు చేస్తూ ఆమె బిడ్డ పుట్టుకతోనే అనారోగ్య సమస్యతో పుట్టాడు. అది కూడా చాలా అరుదైన సమస్యతో పుట్టాడు. ఎవరైనా ఆ పిల్లాడిని చూస్తే భయపడేలా అతని ముఖం ఉంది. అసలింతకూ ఆ పిల్లాడు అలా ఎందుకు పుట్టాడు ? పిల్లాడికున్న సమస్య ఏంటి ? ప్రస్తుతం పిల్లాడి పరిస్థితి ఏంటి తెలుసుకుంటే..

హర్యానా(Haryana) రాష్ట్రం గురుగ్రామ్(Gurugram) లో ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను ఐటి సంస్థలో(IT Company) పనిచేస్తున్నాడు. ఇతని భార్య నాలుగేళ్ళ కిందట(four years back) మగపిల్లాడిని ప్రసవించింది. అయితే పిల్లాడికి మిడ్ లైన్ ఫేషియల్ క్లెఫ్ట్ సిండ్రోమ్(median facial cleft syndrome) అనే వింత వ్యాధి ఉందని వైద్యులు నిర్థారించారు. ఈ సమస్య 10లక్షల మంది పిల్లలలో ఒకరికి మాత్రమే(one case in 10lkhs kids) వచ్చే అరుదైన వ్యాధి(rare problem) ఇది. ఈ వ్యాధిలో పిల్లల ముఖం ఆకారం(face shape) మొత్తం అసాధారణంగా ఉంటుంది. ముఖంకు మధ్యలో గ్యాప్ ఏర్పడి పెదవి, ముక్కు, అంగిలి అన్నీ చాలా దూరంగా విస్తరించి ఉన్నాయి. కళ్లు దాదాపు చెవులు ఉన్నంత దూరంలో ఉంటాయి. ఈ సమస్య వల్ల పిల్లాడిలో మానసిక సమస్యల(Mental issues) నుండి దృష్టి సంబంధ(vision problems) సమస్యలు, మాట్లాడటం(talking), ఆహారం తీసుకోవడం(taking food) ఇలా ప్రతి విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

kid2.gif


కాబోయే భర్తతో రోజూ ఫోన్‌కాల్స్.. నిత్యం చాటింగ్.. కానీ సడన్‌గా అతడి నుంచి నో రెస్పాన్స్.. ఆరా తీస్తే అసలు నిజం తెలిసి ఆ యువతికి షాక్..!


పిల్లాడి ముఖాన్ని మామూలుగా చేసేందుకు దాదాపు 10మంది వైద్యులు 18గంటల పాటు శ్రమించి సర్జరీ(surgery) చేశారు. మొదట ఈ డాక్టర్లు 3డి ప్రింటెడ్ మోడల్స్(3d printed models) లో సర్డరీని మాక్ టెస్ట్(mock test) నిర్వహించారు. ఆ తరువాత ఫిజికల్ గా సర్జరీని ప్రాక్టీస్ చేశారు. కళ్ళ మధ్య పెరిగిన ఎముక, మృదు కణజాలాన్ని తొలగించడం ద్వారా ముఖంలో దూరదూరంగా ఉన్న భాగాలను దగ్గరగా తీసుకొచ్చారు. సర్జరీ తరువాత పిల్లాడిని 2-3రోజులు వెంటిలేటర్ మీద ఉంచారు. ఆ తరువాత సాధరణ వార్డుకు తరలించారు. పిల్లాడు సాధరణ స్థితికి రావడానికి 3నుండి 4వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. కాగా పిల్లాడు ఈ సర్జరీ తరువాత ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నాడు.

Wife: భార్యకు ప్రభుత్వోద్యోగం వచ్చిందని సంతోషించాల్సింది పోయి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఒంటి చేత్తోనే ఆమె విధులు నిర్వహించడం వెనుక..!


Updated Date - 2023-04-15T22:46:45+05:30 IST