Viral News: అయ్యయ్యో.. ఇదేం విచిత్రం.. ఓ పక్షిని కాపాడబోయి.. రూ.లక్ష నష్టపోయిన యువతి..!

ABN , First Publish Date - 2023-05-30T15:37:37+05:30 IST

ఆమె చేసిన ఒకే ఒక తప్పు చేతులారా లక్షరూపాయలు కోల్పోయేలా చేసింది. ఈ విషయం తెలిసి అందరూ విస్తుపోతున్నారు. 'బాబోయ్ ఇలా కూడా జరుగుతాయా?' అని

Viral News: అయ్యయ్యో.. ఇదేం విచిత్రం.. ఓ పక్షిని కాపాడబోయి.. రూ.లక్ష నష్టపోయిన యువతి..!

'ఏ నిమిషాన ఏమి జరుగునో ఎవరూహించెదరు' అని అప్పట్లో లవకుశ సినిమాలోనే గట్టిగా పాట రూపంలో చెప్పేశారు. ఓ మహిళ కూడా పక్షిని కాపాడుకోబోయి డబ్బు కోల్పోతానని అస్సలు ఊహించి ఉండదు. పాపం ఆమె తెలిసీ తెలియకుండా చేసిన ఒకే ఒక తప్పు చేతులారా లక్షరూపాయలు కోల్పోయేలా చేసింది. ఈ విషయం తెలిసి అందరూ విస్తుపోతున్నారు. 'బాబోయ్ ఇలా కూడా జరుగుతాయా?' అని భయపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ముంబైకి(Mumbai) చెందిన ధ్వని మెహతా అనే మహిళ మహాలక్ష్మీ(Mahalakshmi) ప్రాంతంలో ఓ ఫేమస్ స్టూడియోలో పనిచేస్తోంది(Women working in studio). తాజాగా ఆమెకు చాలా వింత అనుభవం ఎదురయ్యింది. ఆమె పనిచేస్తున్న కార్యాలయంలో ఓ పక్షి తీవ్రమైన గాయాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది(bird injured). ఆ పక్షిని రెస్క్యూ చేసి కాపాడటం ఆమె వల్ల కాలేదు. దీంతో బర్డ్ రెస్క్యూ(bird rescue) చేసేవారికోసం గూగుల్ లో వెతికింది. ఆమెకు ఒక NGO సంస్ట టోల్ ఫ్రీ నెంబర్ కనబడగానే ఆ నెంబర్ కు కాల్ చేసి విషయం చెప్పింది. అవతలి వైపు నుండి మాట్లాడినవారు ఆ మహిళకు ఒక లింక్ పంపి అందులో ఉన్న ఫారమ్ నింపి పంపమన్నారు. దీంతో ధ్వని ఆ ఫారమ్ నింపి వారికి పంపింది. వారు వచ్చి సహాయం చెయ్యడానికి గానూ వారు కేవలం ఒక్కరూపాయి మాత్రమే చెల్లించమని అడగడంతో ఆమె వారికి ఒక్కరూపాయి సెండ్ చేసింది(one rupee send in online). అయితే ఇదంతా అయ్యాక ఎంతసేపైనా సదరు బర్డ్ రెస్క్యూ వారు ధ్వని కార్యాలయానికి చేరుకోలేదు. ధ్వని ఎదురుచూసి ఇక ఆ విషయాన్ని వదిలేసింది.

Viral Video: వామ్మో.. ఈ పాప వయసు కేవలం 8 ఏళ్లే.. కానీ కాలేజీ కుర్రాళ్లకు సైతం సవాల్ విసురుతోందిగా..!


ఈ సంఘటన అంతా జరిగిన నాలుగు రోజుల తరువాత ధ్వని ట్రైన్ జర్నీలో ఆమె బ్యాంక్ ఖాతా నుండి 99,988రూపాయలు కట్ అయిన్టటు బ్యాంకు నుండి మెసేజ్(bank alert message) వచ్చింది. అది చూసి ధ్వని షాకయ్యింది. వెంటనే ఏదో లొసుగు జరిగిందని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది(women approach cyber crime police). సైబర్ క్రైమ్ వారి ఆదేశానుసారం బ్యాంకులో కూడా ఫిర్యాదు చేసింది. డబ్బు బదీలీ అయిన బ్యాంకు ఖాతాకు సంబంధించి సమాచారం కోసం బ్యాంకు వారు సెల్ ఫోన్ కంపెనీలను సంప్రదించారు. మహిళకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఇంటర్నెట్ లో కనిపించే టోల్ ఫ్రీ నెంబర్లు, ఆన్లైన్ లో ఫారాలు పూరించడం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Unwanted Hair: ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించుకోవడం ఇంత సులువా? ఇలా చేశారంటే అవాంచిత రోమాలు జన్మలో మళ్లీ రావు..


Updated Date - 2023-05-30T15:37:37+05:30 IST