Viral: అయ్యయ్యో.. ఏడేళ్ల బాలిక చేయిపై ఇలా అయిందేంటి..? ఆ తల్లి చెబుతున్న షాకింగ్ నిజాలివీ..!
ABN , First Publish Date - 2023-09-13T16:01:02+05:30 IST
7ఏళ్ళ పాపకు చెయ్యి మీద సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రగా ఉబ్బిపోయి భయంకరంగా కనిపిస్తోంది. దీనికారణంగా ఆ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దీని వెనుక కారణం తెలిసి డాక్టర్లు కూడా షాకయ్యారు.
అంతా సాధారణం అనుకునే విషయాలు కొన్నిసార్లు పిల్లలకు ప్రమాదాలు తెచ్చిపెడతాయి. ఆ పాప వయసు ఏడేళ్లే. ఆమె సరదా కోసం చేసిన ఒక పని పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. చెయ్యి మీద సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రగా ఉబ్బిపోయి భయంకరంగా కనిపిస్తోంది. దీనికారణంగా ఆ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఆ పాపకు అలా జరగడానికి కారణం ఏంటని వైద్యులు ఆమెను అడిగితే.. ఆమె చెప్పిన సమాధానం విని వైద్యులు షాకయ్యారు. వైద్యులే కాదు ఆ పాప చెయ్యి చూసినవారు, దానికి గల కారణం తెలుసుకున్నవారు భయపడిపోతున్నారు. 'బాబోయ్ పిల్లలు సరదా అనుకుంటారు కానీ ఇంత డేంజరా?' అని అంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
యునైటెడ్ కింగ్డమ్(UK) లో 7ఏళ్ల బాలిక(7years girl) సరదా కారణంగా పెద్ద ప్రమాదానికి లోనైంది. మహిళలకు గోరింటాకు(mehndi) అంటే ఎంతో ఇష్టం. పెద్దలు అందమైన డిజైన్లు పెట్టుకుంటూ ఉంటే అది చూసి పిల్లలు కూడా తమకు పెట్టమని మొండి చేస్తారు. చెట్టునుండి కోసిన ఆకు అయితే ఎలాంటి హాని కలిగించదు. కానీ మార్కెట్లో దొరికే మెహందీ కోన్ లు, పౌడర్లు రసాయనాలతో తయారుచేస్తారు. సున్నితమైన చర్మం కలవారికి ఇవి చాలా హాని చేస్తాయి. మటిల్డా అనే 7ఏళ్ళ బాలిక తన సెలవు రోజుల్లో టర్కీలో ఒక హోటల్ ను తల్లిద్ండ్రులతో కలసి సందర్శించింది. ఆ హోటల్ లో హెన్నాతో వివిధ రకాల టాటూలు వేస్తున్నారు. అది చూసిన మటిల్డా 'నేనూ టాటూ వేయించుకుంటాను' అని మొండి చేసింది. సరేనని మటిల్డా తల్లి కూతురుకి ఇష్టమైన సీతాకోకచిలుక టాటూనూ హెన్నాతో వేయించింది. ఆ త రువాత వారు హాయిగా ఇంటికి వెళ్ళారు. చేతిమీద ఎర్రని సీతాకోకచిలుక టాటూ చూసుకుని ఆ పాప ఎంతో మురిసిపోయింది. కానీ వారం రోజుల తరువాత మటిల్డా చెయ్యి మండటం, దురద పెట్టడం ప్రారంభమైంది. సీతాకోకచిలుక ఆకారంలో చెయ్యిమీద చర్మం ఎర్రగా ఉబ్బిపోయి చాలా వికారంగా తయారైంది. పాప పరిస్థితి చూసి ఉండలేక ఆమెను హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. హెన్నా టాటూ కారణంగా పాపకు అలా అయ్యిందని తెలిసి డాక్టర్లు కూడా షాకయ్యారు. పాప తల్లి ఈ విషయాన్నంతటినీ ఫేస్ బుక్ లో పంచుకున్నారు.
Health Tips: రాత్రి పూట స్నానం చేసే అలవాటుందా? అయితే ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..
పాపను పరీక్షించిన వైద్యులలో ఒకరు మాట్లాడుతూ 'టాటూ వేయడానికి ఉపయోగించిన హెన్నాలో రసాయనాల మోతాదు ఎక్కువై ఉంటుంది. ఎర్రగా పండుతుందనే కారణంతో చాలామంది రసాయనాలు ఎక్కువ వినియోగిస్తారు. కానీ అది సున్నితమైన చర్మం గలవారిలో ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు. పిల్లలలో చర్మం సహజంగానే సున్నితంగా ఉంటుంది. పిల్లలకు ఎప్పుడైనా హెన్నా టాటూ వేయించినా, లేదా తల్లులే నేరుగా వేసినా చాలా జాగ్రత్తగా ఉండండి' అని చెప్పుకొచ్చారు.