Viral: బాబోయ్.. ఇదేం వింత జీవి.. చూస్తేనే భయపడిపోతున్న జనం.. అది ఉమ్మితే నోట్లోంచి వస్తున్నదేంటో చూసి..!

ABN , First Publish Date - 2023-06-16T15:52:19+05:30 IST

ఈ సృష్టిలో మనకు తెలిసిన వాటికంటే తెలియని ప్రాణులే ఎక్కువగా ఉంటాయి. కొత్త జీవులను చూసినప్పుడు వాటి ఆకారం నుండి, వాటి చర్యల వరకు చాలా వింతగా అనిపిస్తాయి. అలాంటి వాటిని చూసి షాక్ కు గురవుతూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ వింత జీవికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జెర్రిలాగా పొడవుగా, ఎరుపు రంగులో కసిపిస్తున్న ఈ పురుగు ఉమ్మితే..

Viral: బాబోయ్.. ఇదేం వింత జీవి.. చూస్తేనే భయపడిపోతున్న జనం.. అది ఉమ్మితే నోట్లోంచి వస్తున్నదేంటో చూసి..!

ఈ సృష్టిలో కోట్ల కొలది జీవరాశులు ఉన్నాయి. వీటిలో మనకు తెలిసిన వాటికంటే తెలియనివే ఎక్కువగా ఉంటాయి. కొత్త జీవులను చూసినప్పుడు వాటి ఆకారం నుండి, వాటి చర్యల వరకు చాలా వింతగా అనిపిస్తాయి. అలాంటి వాటిని చూసి షాక్ కు గురవుతూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ వింత జీవికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జెర్రిలాగా పొడవుగా, ఎరుపు రంగులో కసిపిస్తున్న ఈ పురుగు ఉమ్మితే నోట్లోంచి వస్తున్నదేంటో చూసి అందరూ భయపడుతున్నారు. 'అది గ్రహాంతర జీవిలా ఉంది' అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కొత్త జీవుల ఉనికి ఎప్పుడూ ఈ ప్రపంచాన్ని కంగారు పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజలకు చాలా తక్కువగా తెలిసిన రిబ్బన్ వార్మ్ అదే పని చేస్తోంది. వేలెడంత పొడవుతో(finger length) ఎరుపురంగులో(red colour), జెర్రిలాగా(centipede) ఉన్న ఈ పురుగును రిబ్బన్ వార్మ్(ribbon warm) అంటారు. రిబ్బన్ వార్మ్ ను ఒక వ్యక్తి తన అరచేతిలో పెట్టుకుని ఉన్నాడు. ఆ రిబ్బన్ వార్మ్ కు మొదట్లో నలుపు రంగు ఉంది. ఆ వ్యక్తి రిబ్బన్ వార్మ్ మొదట్లో తన వేలితో రెండు మూడు సార్లు కొట్టాడు. ఆ వెంటనే రిబ్బన్ వార్మ్ నోట్లో నుండి తెలుపు రంగులో చెట్టు కాండం, వేరు ఆకారంలో ఉన్న కండరాలు(muscles like tree trunk and roots) బయటకు చొచ్చుకుని వచ్చాయి. అవి వ్యక్తి చేతిమీద విస్తారంగా పరుచుకున్నాయి. ఈ రిబ్బన్ వార్మ్ లు సన్నగా కేవలం కొన్ని మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటాయి. ఇవి పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగులలో ఉంటాయి. ఈ పురుగుల శరీరంలోపల ప్రత్యేకమైన కండరాల నిర్మాణం ఉంటుంది. ఎవరైనా దీనిమీద దాడి చేసినప్పుడు చెట్టువేరు లాంటి కండరాలను బయట పెట్టడం ద్వారా భయపెడుతుంది. ఆ సమయంలో దీని శరీరం క్రమంగా లోపలికి, బయటకు సాగినట్టు అవుతుంది. ఇవి ఉత్తర సముద్రపు నీటిలో(North sea water) రాళ్లమధ్య జీవిస్తాయని తెలిసింది.

Swiggy Delivery Boy: అరగంట ఆలస్యమైందేంటని అసహనం.. ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ చెప్పింది విని ఆమెకు షాక్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!


ఈ వీడియోను Massimo అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయాందోళనకు లోనవుతున్నారు. 'ఆ పురుగును చూస్తోంటే వెన్ను చల్లగా అయిపోతోంది' అంటున్నారు. 'అది అసహ్యంగా అనిపించడంలేదా? అలా చేతిమీద ఎలా ఉంచుకున్నారు?' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 'ఆ పురుగు చర్యను చూస్తుంటే రాత్రిళ్లు నిద్రలో పీడకలలు రావడం ఖాయం' అని అంటున్నారు.

Resignation Letter: మూడే మూడు పదాల్లో రిజైన్‌ లెటర్‌ను ఇచ్చేశాడో ఉద్యోగి.. అసలు ఆ రాజీనామా లేఖలో ఏం రాశాడో చూస్తే..!


Updated Date - 2023-06-16T15:55:55+05:30 IST