Viral: ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..
ABN , First Publish Date - 2023-10-10T12:11:16+05:30 IST
ప్రపంచంలో అతిపెద్ద రెండ వ హిందూ దేవాలయంగా అక్షరధామ్ దేవాలయం ఆవిర్భవించింది. విచిత్రం ఏమిటంటే ఈ రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం విదేశాల్లో నిర్మింపబడింది.
హిందువులు దేవాలయాలను చాలా పవిత్రంగా భావిస్తారు. భారతదేశంలో బోలెడు దేవాలయాలు ఉన్నాయి. ఇవి సనాతన ధర్మంలో ఉన్న గొప్పదనాన్ని మాత్రమే కాకుండా కళలో ఉన్న గొప్పదనాన్ని కూడా వ్యక్తం చేస్తుంటాయి. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం భారతదేశంలోని శ్రీరంగంలో ఉంది. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. దీని తర్వాత శ్రీపురంలోని లక్షీనారాయణీ దేవి దేవాలయం రెండవ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ దేవాలయాన్ని అక్షరధామ్ దేవాలయం అధిగమించింది. విచిత్రం ఏమిటంటే ఈ రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం విదేశాల్లో నిర్మింపబడింది. ప్రపంచం యావత్తూ ఆసక్తిగా మారిన అక్షరధామ్ దేవాలయం గురించి వివరంగా తెలుసుకుంటే..
భారతదేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలు(Temple) ఉన్నాయి. వందల, వేల యేళ్ల కిందట నిర్మించిన దేవాలయాలు భారతీయ శిల్పకళను చాటిచెబుతుంటాయి. ఈ కోవలోకి ఇప్పుడొక అద్భుతమైన దేవాలయం చేరింది. అదే అమెరికాలో(America) న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో నెలకొల్పిన అక్షరధామ్(Akshardham Temple)) దేవాలయం. 2011లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం 2023లో ముగిసింది. 2023, సెప్టెంబర్ 30 న ఈ ఆలయం ప్రారంభమైంది. మహంత్ స్వామి మహరరాజ్ సన్నిధిలో ఆదివారం భక్తుల కోసం ఈ ఆలయాన్ని తెరిచారు. స్వామి మహారాజ్ ఆచార వ్యవహారాలు, సంప్రదాయ కార్యక్రమాల మధ్య ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆలయం స్వామి నారాయణుడికి అంకితం చేశారు.
Flipkart vs Amazon: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఈ రెండింటిలో ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడంటే..!
ప్రపంచ నలుమూలల నుండి 12,500మంది వాలంటీర్లు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 185ఎకరాల విస్తీర్ణంలో నిర్మింపబడిన ఈ దేవాలయంలో అతిపెద్ద రాతిగోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అక్కడి వాలంటీర్లు ఈ దేవాలయం అమెరికాకు భారతదేశ వారసత్వాన్ని, సంస్కృతిని అందజేస్తుందని అంటున్నారు.