Viral Video: బుడ్డోడు కాదండోయ్.. బాల భీముడు.. 12 ఏళ్ల వయసుకే సిక్స్ ప్యాక్ బాడీ.. ఏకంగా 91 కేజీల బరువు ఈజీగా ఎత్తేస్తాడు..!

ABN , First Publish Date - 2023-04-14T19:42:36+05:30 IST

నెలల తరబడి జిమ్ లో కసరత్తులు చేసి, దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకుంటూ కండలు పెంచడం చాలా పెద్ద టాస్క్. కానీ జస్ట్ 12ఏళ్ళ(12 years boy) పిల్లకాయ ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీ(six pack body) డవలప్ చేశాడండోయ్.. లక్షణంగా ఆటలు ఆడుకోవాల్సిన వయసులో

Viral Video: బుడ్డోడు కాదండోయ్.. బాల భీముడు.. 12 ఏళ్ల వయసుకే సిక్స్ ప్యాక్ బాడీ.. ఏకంగా 91 కేజీల బరువు ఈజీగా ఎత్తేస్తాడు..!

సినిమాల్లో హీరోల దేహ దారుఢ్యం(Hero's body fitness) చూసి ఫిదా అవ్వని అభిమానులు ఉండరు. మరీ ముఖ్యంగా కండలు తిరిగిన శరీరంతో అమ్మాయిల్ని పడేయాలని ప్రయత్నించే కుర్రకారు కూడా ఉన్నారు. కానీ బాడీ బిల్డింగ్(body building) అనేది అందరికీ సాధ్యమ్యయే పని కాదు. నెలల తరబడి జిమ్ లో కసరత్తులు చేసి, దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకుంటూ కండలు పెంచడం చాలా పెద్ద టాస్క్. కానీ జస్ట్ 12ఏళ్ళ(12 years boy) పిల్లకాయ ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీ(six pack body) డవలప్ చేశాడండోయ్.. లక్షణంగా ఆటలు ఆడుకోవాల్సిన వయసులో అలవోకగా 91కేజీల బరువు ఎత్తుతూ(lifting 91kg weight) కుర్రోళ్ళకు సవాల్ విసురుతున్నాడు. ఇంతకూ ఈ బాల భీముడు ఎవరు? ఈ బుడ్డోడి కథేంటి తెలుసుకుంటే..

సాధారణంగా ఉదయం 5.30 గంటల(Morning 5.30 AM) సమయంలో 12ఏళ్ళ పిల్లలు ఏం చేస్తుంటారు? దుప్పట్లో కుక్కపిల్లల్లాగా వెచ్చగా బజ్జుని ఉంటారు.. కానీ ఈ పిల్లాడు మాత్రం ఉదయం 5 గంటలకు నిద్రలేచి తయారయ్యి 5.30కు పరుగులు తీయడం మొదలుపెడతాడు. వినడానికి షాకింగ్ గా అనిపిస్తుంది కానీ నిజమండీ బాబూ.. బ్రెజిల్(Brazil) దేశంలోని సాల్వడార్(Salvador) ప్రాంతలో నివసిస్తున్న నెటో అనే పిల్లాడు సాధారణ పిల్లలకు విభిన్నంగా ఉన్నాడు. మొదట్లో నెటో ఫుట్ బాల్(Foot ball) అంటే చాలా ఆసక్తి చూపించేవాడు. ఆ తరువాత తన తండ్రి రిచర్డ్ తో కలసి జిమ్ కు వెళ్ళేవాడు. అక్కడ అందరూ కసరత్తులు చేసి శరీర దారుఢ్యం పెంచుకోవడం చూసి నెటోకు కూడా ఆసక్తి కలిగింది. జిమ్ లో నెలల తరబడి శిక్షణ తీసుకున్నా.. కుర్రాళ్ళు చేయలేని టాస్క్ లు కేవలం 15రోజులలో నెటో చేశాడట. దీంతో నెటోలో ఉన్న ప్రత్యేకత అతని తండ్రికి అర్థమైంది. నెటోకు ఫిట్నెస్ ట్రైనింగ్(Fitness Training) ఇప్పించడం మొదలుపెట్టాడు. ఎవరో బాడీ బిల్డర్ పూనకంలోకి వచ్చినట్టు తన బరువుకు మూడు రెట్ల బరువును 12ఏళ్ళ వయసుకే ఎత్తేస్తున్నాడు నెటో. సాల్వడార్ లో జరిగిన అనేక వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్(Weight lifting championship) లలో పాల్గొన్నాడు.

Cadbury Bournvita ఆరోగ్యానికి మంచిదేనా..? తయారు చేసేందుకు వాడేదేంటి..?.. అసలు నిజాలివేనంటూ వైరల్‌గా మారిన ఓ వ్యక్తి వీడియో..


ఉదయం 5.30 గంటలకు 5కిలోమీటర్ల(5k.m run) పరుగుతో ఈ బాలభీముడి దినచర్య ప్రారంభమవుతుంది. పరుగు పూర్తవగానే సిట్అప్స్ చేస్తూ స్కూలుకు వెళ్ళడానికి రెడీ అవుతాడట. స్కూలు అయిపోగానే కాస్త రిలాక్స్ అయ్యి, హోంవర్క్ పూర్తీ చేసి మళ్ళీ కసరత్తులు ప్రారంభిస్తాడు. పెద్ద పెద్ద బరువులు ఎత్తడం, స్క్వాట్స్, బెంచ్ ప్రెస్, బైసెప్స్ కర్ల్స్ వంటి వ్యాయామాలు చేస్తూ అందరికీ షాకులిస్తున్నాడు. cacauzinho_neto అనే ఇన్స్టాగ్రామ్ పేజీ(Instagram page) నుండి తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలు(Workout videos) పోస్ట్ చేస్తుంటాడు నెటో. నెటోకు ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండోయ్.. కాగా నెటోకు ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్ మాత్రమే కాదు వ్యాయామాలకు తగిన ఫుడ్ సజెస్ట్ చేసే న్యూట్రిషనిస్ట్, ఆరోగ్య సమస్యలు పరిశీలించేందుకు డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ కూడా ఉన్నారట. వీరందరి సహకారంతో ఈ బుడ్డోడు ఏ రికార్డులు తిరగరాస్తాడో అంటున్నారు నెటిజన్లు.

Success Story: కాళ్లూ చేతులూ పనిచేయవు.. పుట్టినప్పటి నుంచీ కుర్చీకే పరిమితం.. అయినా 3 ప్రభుత్వోద్యోగాలకు సెలెక్ట్..!


Updated Date - 2023-04-14T19:42:36+05:30 IST