Viral video: ఓ మహిళ చేతిలో బిడ్డను చూడగానే గొరిల్లాల ఊహించని రియాక్షన్.. పరిగెత్తి వెళ్లి మరీ అవి చేసిన పనేంటో మీరే చూడండి..
ABN , First Publish Date - 2023-06-18T11:32:06+05:30 IST
మనుషులను పోలిన ప్రవర్తన కొన్ని జంతువులకు ఉంటుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో మనుషుల ప్రవర్తనకు దగ్గరగా ఉండే ప్రాణులలో కోతులు, గొరిల్లాలు,ప్రథమ స్థానంలో ఉంటాయి. ఓ తల్లి గొరిల్లా మహిళ చేతిలో బిడ్డను చూడగానే..
మనిషి కోతి నుండి వచ్చాడని సైన్స్ నుండి చరిత్ర దాకా ఎన్నో చెబుతున్నాయి. సరిగ్గా గమనిస్తే కోతులు, కోతి జాతికే చెందిన చింపాజీలు, గొరిల్లాల ప్రవర్తన మనుషుల ప్రవర్తనకు దగ్గరగా ఉంటుంది. ఓ మహిళ తన నెలల శిశువును తీసుకుని జూకు వెళ్ళింది. అక్కడ గ్లాస్ వెనుక ఉన్న గొరిల్లాకు ఇవతలి వైపు నుండి తన శిశువును చూపించింది. అది చూసిన మరుక్షణమే ఆ గొరిల్లా ప్రవర్తన చూసి అందరూ షాకవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
మనుషులను పోలిన ప్రవర్తన కొన్ని జంతువులకు ఉంటుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో మనుషుల ప్రవర్తనకు దగ్గరగా ఉండే ప్రాణులలో కోతులు, గొరిల్లాలు,ప్రథమ స్థానంలో ఉంటాయి. మనుషులు తమ పిల్లలు అల్లరి చేస్తే దండించం, పిల్లలను క్రమశిక్షణగా ఉంచడం, ప్రేమగా లాలించడం వంటి పనులు ఎలా చేస్తారో గొరిల్లాలు కూడా అలానే చేస్తాయి(gorilla behave like humans). ఓ మహిళ తన నెలల శిశువును(months baby)తీసుకుని జూకు(Zoo) వెళ్లింది. అక్కడ మహిళ గ్లాస్ వెనుక ఉన్న గొరిల్లాకు తన శిశువును ఇవతలివైపు నుండి చూపించింది(Women shows her baby to gorilla). మహిళ చేతుల్లో ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ శిశువు చాలా అందంగా ఉన్నాడు. ఆ శిశువును చూడగానే ఆ ఆడ గొరిల్లాలో ఉన్న అమ్మతనం ఒక్కసారిగా స్పందించింది. అది మగ గొరిల్లాతో
ఇటీవలే తనకు పుట్టిన బేబీ గొరిల్లాను తీసుకురమ్మని చెప్పింది. భార్య ఆజ్ఞను పాటిస్తూ మగ గొరిల్లా పరుగు పరుగున అక్కడినుండి వెళ్ళి బేబీ గొరిల్లాను తీసుకొచ్చి ఆడ గొరిల్లా చేతిలో ఉంచింది. ఆడ గొరిల్లా వెంటనే తన బేబీ గొరిల్లాని రెండు చేతులతో పైకెత్తి మహిళకు చూపించి(Mother gorilla shows her baby to women), ఆ తరువాత ముద్దు చేస్తూ లాలిస్తుంది. మనుషులు తమ పిల్లల పట్ల ఎలాగైతే ప్రేమను ప్రకటిస్తారో అచ్చం అలాగే గొరిల్లాలు కూడా తల్లిదండ్రుల పాత్రను అనుభూతి చెందుతున్నాయి.
ఈ వీడియోను Hipatia అనే ట్విట్టర్ అకౌంట్(Twitter account) నుండి షేర్ చేశారు. 'ఆ తల్లి గొరిల్లా కూడా మహిళ లాగే తన బిడ్డను చూపించాలని అనుకుంది' అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు గొరిల్లా ప్రవర్తనకు ఫిధా అవుతున్నారు. 'గొరిల్లాకు తన బిడ్డ పట్ల ఉన్న ప్రేమ మనుషుల హృదయాల్ని కదిలిస్తోంది' అంటున్నారు. 'వీడియో ఎంత అందంగా ఉందో.. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తన బిడ్డల పట్ల ప్రేమ ఉంటుంది' అని కామెంట్స్ చేస్తున్నారు. 'ఆ తల్లి గొరిల్లా తన బిడ్డను మహిళకు చూపించడానికి ఎంత ఆరాటపడిందో..' అని అంటున్నారు.