Viral video: ప్రాణాపాయంలో ఉందికదా అని చిరుత పులిని కాపాడాడొక వ్యక్తి.. ఆ తరువాత జరిందేంటో చూస్తే..
ABN , First Publish Date - 2023-08-27T11:33:22+05:30 IST
తన దారిన తాను పోకుండా చిరుత దగ్గరరకు వెళ్ళి నీళ్ళు తాగించి దాన్ని కాపాడాడొక వ్యక్తి. దీని తరువాత షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ చూసినవారికి చిరుత పులి వేట ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. పులి వేటాడే ఎర స్థానంలో తమను తాము ఊహించుకుంటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పాటుకు లోనవ్వడం ఖాయం. వేగంగా పరిగెత్తి పీక పట్టుకుని, చీల్చి చెండాడుతుంది చిరుత. అలాంటి చిరుత దాహంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిడుతోంటే ఓ వ్యక్తి చూశాడు. అతను తన దారిన తాను పోకుండా దాని దగ్గరరకు వెళ్ళి నీళ్ళు తాగించి దాన్ని కాపాడాడు. దీని తరువాత షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా విస్తుపోతున్నారు. దీనికి సంబధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
అడవి జంతువులలో(wild animals) పులులు(tigers), సింహాలు(Lions) చాలా ప్రమాదకరమైన జంతువులు. చిరుత పులులు(Leopard) అయితే మరీనూ. వాటి కంట పడిన ఏ జంతువు అయినా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అలాంటి చిరుతను కాపాడాడొక వ్యక్తి(man save Leopard). వీడియోలో ఓ చిరుత పులి చాలా భారంగా శ్వాస తీసుకుంటూ ఏదో ప్రమాదంలో ఉన్నట్టే కనిపిస్తుంది. అదే అడవిలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్(wild life photographer) ఒకరు చిరుత అవస్థను చూశారు. అతను చిరుత దగ్గరకు వెళ్ళి తన చేతిని చిరుత నోటి ముందు ఉంటి బాటల్ లో నీటిని మెల్లగా పోశాడు. ఆశ్చర్యంగా ఆ చిరుత చిన్న పిల్లి కూనలాగా అతని చేతిలో నీటిని తాగింది. అది నీళ్లు తాగిన తరువాత ఆ వ్యక్తి చిరుతను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అక్కడ దాని అనారోగ్య సమస్య తెలుసుకుని దానికి చికిత్స ఇప్పించాడు. చికిత్స తరువాత ఆ చిరుతను తిరిగి అడవిలో వదిపెట్టేస్తాడు. అడవిలోకి వెళ్ళిపోతున్న చిరుతను అతను ఫోటో తీస్తుండగా ఆ చిరుత వెనక్కు వచ్చింది. అది నేరుగా ఫోటోగ్రాఫర్ ముందుగా వచ్చి కెమెరాముందు కూర్చుంది. ఆ తరువాత కూడా అతను అడవిలో కూర్చుని ఉండగా అతని దగ్గరకు ఎంతో ఆప్యాయంగా వచ్చి తన ముఖంతో అతని ముఖాన్ని రాస్తూ తన కృతజ్ఞత తెలియజేస్తుంది. చిరుత, ఫోటోగ్రాఫర్ మీద పెంచుకున్న ప్రేమ, అతని పట్ల దానికున్న కృతజ్ఞత, ఆ ఫోటోగ్రాఫర్ మంచి మనసు ఈ వీడియోలో స్పష్టంగా అర్థమవుతున్నాయి.
Viral Video: తుమ్ము వచ్చినప్పుడు కళ్లను మూయకపోతే జరిగేదేంటి..? ఈ యువతి అదే ప్రయోగాన్ని చేసింది.. చివరకు..!
ఈ వీడియోను Hakan Kapucu అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'జంతువులు పొందిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతగా ఉంటాయి' అనే ట్యాగ్ ను మెన్షన్ చేశారు. ఆగస్టు 22న పోస్ట్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటికి 39లక్షల మంది వీక్షించారు. 90వేలమంది పైగా లైక్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'ప్రేమను ఇస్తే అది తిరిగొస్తుంది అంటారు. అది ఇదే కదా' అని ఒకరు కామెంట్ చేశారు. 'మనుషులు జంతువుల నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని మరొకరు కామెంట్ చేశారు. 'మంచివారు ఎవరనేది ఆ జంువులకు బాగా తెలుసు' అని ఇంకొందరు అంటున్నారు.