Viral Video: జింక ఏదో తింటోంటే సరదాగా వీడియో తీసిన ఫోటోగ్రాఫర్.. డౌటొచ్చి జూమ్ చేసి చూస్తే ఊహించని షాక్.. అసలు విషయం మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-06-12T12:59:24+05:30 IST

జింకలు చాలా అందమైన జంతువులు. వాటి చురుకుదనం వాటికి మరింత అందాన్ని తెచ్చిపెడతుంది. అడవుల్లో ఉండే ఈ సాధుజంతువులంటే అందరికీ ఇష్టమే. ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అడవికి వెళ్ళినప్పుడు అతనికి పచ్చిక దగ్గర ఓ జింక కనిపించింది. అది ఏదో తింటోంటే దాన్ని సరదాగా వీడియో తీశాడు. కాని..

Viral Video: జింక ఏదో తింటోంటే సరదాగా వీడియో తీసిన ఫోటోగ్రాఫర్.. డౌటొచ్చి జూమ్ చేసి చూస్తే ఊహించని షాక్.. అసలు విషయం మీరే చూడండి..

జింకలు చాలా అందమైన జంతువులు. వాటి చురుకుదనం వాటికి మరింత అందాన్ని తెచ్చిపెడతుంది. అడవుల్లో ఉండే ఈ సాధుజంతువులంటే అందరికీ ఇష్టమే. ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అడవికి వెళ్ళినప్పుడు అతనికి పచ్చిక దగ్గర ఓ జింక కనిపించింది. అది ఏదో తింటోంటే దాన్ని సరదాగా వీడియో తీశాడు. కాని ఆ జింక తింటున్నది ఏంటో అర్థం కాక అతను జూమ్ చేసి చూశాడు. ఆ వెంటనే షాకవ్వడం అతని వంతయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా విస్తుపోతున్నారు. 'వామ్మో జింకలు ఇలా కూడా చేస్తాయా?' అని అంటున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఒక్కోసారి జంతువుల(Animals) చర్యలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ముఖ్యంగా అడవి జంతువుల ప్రవర్తన(wild Animals behave ness) వాటి లైఫ్ స్టైల్ గురించి అంత తొందరగా ఎవరికీ అర్థం కాదు. ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్(Wild life photographer) తన జీప్ లో వైల్డ్ అనిమల్ పార్క్ లో వెళుతుండగా ఒకచోట జింక(deer) కనిపించింది. అది పచ్చిక దగ్గర నిలబడుకుని ఏదో తింటోంటే ఫోటోగ్రాఫర్ దాన్ని సరదాగా వీడియో తీశాడు. కానీ ఆ జింక తింటున్నదేంటో అతనికి అర్థం కాలేదు. దీంతో కెమెరాను జూమ్ చేసి చూడగానే అతను అదిరిపడ్డాడు. జింక పొడవాటి పామును నోటితో నములుతూ(deer eating snake) కనిపించింది. అది పామును గడ్డిపరకలా నెమరేస్తూ నిలబడుకుంది.

Viral video: ఓ రైతుకు ఇంతకన్నా ఏమి కావాలి.. పొలంలో నిరాశగా కూర్చుని ఉన్న రైతునుచూసి పెంపుడు జంతువులు ఏమి చేశాయంటే..


ఈ వీడియోను ప్రముఖ ఫారెస్ట్ ఆఫీసర్(Forest officer) సుశాంత నంద Susanta Nanda తన ట్విట్టర్ అకౌంట్(Twitter Account) నుండి షేర్ చేశారు. 'ప్రకృతిని అర్థం చేసుకోవడంలో కెమెరాలు బాగా ఉపయోగపడుతున్నాయి. కొన్నిసార్లు శాకాహార జంతువులు కూడా పాముల్ని తింటాయి'. అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'జంతువులు మనుగడ కోసం తమ పద్దతులు మార్చుకుంటాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'శాకాహార జంతువులు మాంసాహరం తినగలవు కానీ మాంసాహర జంతువులు శాకాహారం తినలేవు ఇదే తేడా' అని మరొకరు కామెంట్ చేశారు. 'అది చైనా జింక కావచ్చు అందుకే పాముల్ని తింటోంది' అని ఇంకొకరు చమత్కారం చేశారు.

Viral Video: మొబైల్ మాయలో పడిన ఓ తల్లి చేసిన నిర్వాకం.. జరిగిందేంటో తెలిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు..


Updated Date - 2023-06-12T12:59:24+05:30 IST