Viral Video: తుమ్ము వచ్చినప్పుడు కళ్లను మూయకపోతే జరిగేదేంటి..? ఈ యువతి అదే ప్రయోగాన్ని చేసింది.. చివరకు..!

ABN , First Publish Date - 2023-08-25T12:18:44+05:30 IST

తుమ్ము వచ్చినప్పుడు కళ్లు మూసుకోవడం సహజం. తుమ్మేటప్పుడు బలవంతంగా కళ్లు తెరిస్తే ప్రమాదమని చెబుతుంటారు. కానీ ఈ యువతి బలవంతంగా చేసిన పనికి..

Viral Video: తుమ్ము వచ్చినప్పుడు కళ్లను మూయకపోతే జరిగేదేంటి..? ఈ యువతి అదే ప్రయోగాన్ని చేసింది.. చివరకు..!

శరీరంలో కొన్ని అసంకల్పిత చర్యలు ఉన్నాయి. తుమ్మడం, ఆవలించడం, గుండె కొట్టుకోవడం, శ్వాస పీల్చడం, కనురెప్పలు ఆర్పడం ఇవన్నీ అసంకల్పిత చర్యలే. మనిషి ప్రమేయం లేకుండా ఇవన్నీ అలా జరిగిపోతాయి. తుమ్ము వచ్చినప్పుడు కళ్లు మూసుకోవడం సహజం. తుమ్మేటప్పుడు బలవంతంగా కళ్లు తెరిస్తే చచ్చిపోతారని, కళ్లు పోతాయని, కంటి నరాలు దెబ్బతింటాయని వివిధ రకాలుగా నమ్ముతుంటారు. కానీ ఓ అమ్మాయికి వింత ఆలోచన పుట్టింది. తుమ్ము వచ్చినప్పుడు కళ్ళు మూసుకోకపోతే జరిగేదేంటో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని అనుకుంది. కళ్ళు మూసుకోకుండా తుమ్ముతానంటూ ఛాలెంజ్ తీసుకుంది. ఈమె ఛాలెంజ్ అంతా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఇంటర్నెట్ వేగం పెరిగిన తరువాత సోషల్ మీడియా ప్రజలకు మరింత చేరువ అయ్యింది. వివిధ రకాల ప్లాట్ ఫామ్ లలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎంతోమంది వింత వింత ఛాలెంజ్ లు స్వీకరిస్తుంటారు. ఓ అమ్మాయి ఇలాగే కళ్లు మూయకుండా తుమ్ముుతానంటూ ఛాలెంజ్ తీసుకుంది(sneeze with eyes open). వీడియోలో ఓ అమ్మాయి(young lady) తుమ్మురావడం కోసం పెన్నును ముక్కులోకి జొప్పిస్తుంది. ఆమె ప్రయత్నం ఫలించి ఆమెకు తుమ్ము వస్తుంది. అయితే ఆమె కళ్లు మూసుకోకుండా బలవంతంగా కళ్లు పెద్దగా తెరచి మరీ తుమ్మింది. ఇలా తుమ్మినప్పుడు ఆమె కళ్ళు మూసుకోకపోయినా, ఆమె కనురెప్పలు కదలడం చూడచ్చు. ఇలా తుమ్మినందుకు ఆమె కళ్ళలో నీళ్ళు రావడం లేదా ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం వంటివేమీ జరగలేదు. పైపెచ్చు తుమ్ము ఛాలెంజ్ పూర్తవగానే ఆమె గట్టిగా నవ్వుతుంది.

Hair Care Tips: జుట్టు నల్లగా మారిపోవాలా..? తలస్నానం చేసేటప్పుడు షాంపూ బదులుగా వీటిని వాడితే..!



ఈ వీడియోను bela_amor అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్ల రియాక్షన్ మాములుగా లేదు. 'ఆమె కళ్లు తెరచి తుమ్మడం ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించింది' అని చాలామందిలో ఉన్న నమ్మకాన్ని ఒకరు వ్యక్తం చేశారు. 'కళ్లు తెరచి తుమ్మితే కళ్ళు బయటకు వస్తాయి' అని ఇంకొకరు అన్నారు. 'ఆమె ప్రకృతి నియమాన్ని ఉల్లంఘిస్తోంది' అని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు. 'నేను ఎప్పుడైనా డల్ గా ఉన్నప్పుడు ఈ వీడియో చూస్తే చాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాను' అని మరొకరు అన్నారు. చాలామంది ఈ వీడియో చూసి బాగా నవ్వుతున్నారు.

Woman: స్నానం చేసి బాత్రూం నుంచి బయటికొచ్చిన వెంటనే చేసిన ఒక్క మిస్టేక్‌తో.. ఆ యువతి ప్రాణాలే పోయాయ్..!


Updated Date - 2023-08-25T12:18:44+05:30 IST