Viral Video: మహీంద్రా ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తిని చూసి అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. అసలెందుకిదంతా? అంటూ ట్వీట్..
ABN , First Publish Date - 2023-11-19T15:26:24+05:30 IST
ఓ కుర్రాడు ట్రాక్టర్ నడుపుతున్న తీరు చూసి ఆనంద్ మహీంద్రా విస్తుపోయాడు. ఎందుకిలా చేస్తున్నారు నాకర్ఖం కాలేదంటూ సందేహం వ్యక్తం చేశారు.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఆయన సోషల్ మీడియాలో పరిచయం చేసే వివిధ విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. తన ఫాలోయర్స్ ను ఎంటర్టైన్ చేయడంలో ఆయన ఎప్పుడూ విఫలం కారు. ఇప్పుడు కూడా ఆయన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహీంద్రా ట్రాక్టర్ నడుపుతున్న ఈ వీడియోను చూసి ఆయన విస్తుపోయారు. 'బాగానే ఉంది కానీ అసలెందుకిదంతా?' అంటూ ప్రశ్న సంధించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ట్రాక్టర్ డ్రైవింగ్ తీరు చూసి అవాక్కవుతున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
భారతదేశ ప్రజలు కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. సాధారణమైన వస్తువులనే విభిన్నంగా మార్చడం, నలుగురి దృష్టిలో పడటం చాలా మంది చేసే పని. అలా ఓ కుర్రాడు చేసిన పని ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) దృష్టిలో పడింది. ఆనంద్ మహీంద్రా ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో ఒక వ్యక్తి 'మహీంద్రా ట్రాక్టర్'(Mahindra tractor) ను నడుపుతున్నారు. ట్రాక్టర్ అయితే రహదారి పైనే నడుస్తోంది కానీ ట్రాక్టర్ డ్రైవింగ్ సీటు ఉండాల్సిన చోట లేదు. ఫలితంగా ఆ డ్రైవింగ్ సీటు ట్రాక్టర్ సీటు ఉండాల్సిన చోటు నుండి 4,5 అడుగుల ఎత్తులో ఉంది(4-5 feet height). సరిగ్గా గమనిస్తే అతను ఇనుప రాడ్ సహాయంతో డ్రైవింగ్ సీటును ఎత్తులో అమర్చినట్టు అర్థం అవుతుంది. అంతెత్తున కూర్చున్న అతను చాలా చాకచక్యంగా డ్రైవింగ్ సీటులో కూర్చుని హ్యాండిల్ తిప్పుతాడు. ట్రాక్టర్ కూడా చాలా సాఫీగా ముందుకు కదులుతోంది. అతని డ్రైవింగ్ వల్ల అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇది కూడా చదవండి: పొద్దు తిరుగుడు విత్తనాలు తింటే ఎన్ని లాభాలో..!
ఈ ఆసక్తికరమైన వీడియోను anand mahindra తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'చాలా ఆసక్తిగా ఉంది, అయితే నాదొక ప్రశ్న.. ఇలా ఎందుకు చేస్తున్నారు?' అనే క్యాప్షన్ ఈ వీడియోకు మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు అవాక్కవుతున్నారు. తమకు తోచిన కామెంట్లు కూడా చేస్తున్నారు. 'అంత ఎత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తే ట్రాఫిక్ బాగా కనిపిస్తుందని అలా చేశారేమో' అని ఒకరు కామెంట్ చేశారు. 'బహుశా అతను పంట ఎత్తు ఎక్కువగా ఉన్న పొలంలో ట్రాక్టర్ ను ఉపయోగించడానికి అలాంటి మార్పు చేసుకున్నాడేమో. దీని వల్ల అతనికి ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా కనిపిస్తుంది కదా' అని మరొకరు కామెంట్ చేశారు. 'అతను కంపెనీ ట్యాగ్ లైన్ కు న్యాయం చేశాడు. 'మహీంద్రా రైజ్' అనే ట్యాగ్ లైన్ కు భలే సెట్ అయ్యిందిప్పుడు' అని ఇంకొకరు అన్నారు.