Viral Video: మంచు చిరుత వేట ఎప్పుడైనా చూశారా? దాని పరుగు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్!
ABN , First Publish Date - 2023-03-16T15:03:43+05:30 IST
అడవి చిరుతకు జేజమ్మలాంటిది.. దీని కంట జంతువు పడితే.. నోటికి చిక్కినట్టే..
అడవికి రాజు సింహం అయినా పులికి ఉండే రేంజ్ వేరు. ఈ పులులలో కూడా చిరుతలు చాలా డేంజర్ అని చెబుతారు. చిరుత కంటికి జంతువు చిక్కిందంటే ఇక దాని నోటికి కూడా చిక్కినట్టే.. అయితే ఈ చిరుతలకు కూడా జేజమ్మలాంటిది మంచు చిరుత. ఇది సాధారణంగా కనబడటం తక్కువ. అలాంటిది ఏకంగా వేటాడుతూ కెమెరా కంటికి చిక్కింది. ఈ మంచు చిరుత వేట చూశారంటే గూస్ బంప్స్ వస్తాయ్.. మెగాస్టార్ చెప్పినట్టు పూనకాలు లోడింగే.. ఈ వీడియో గురించి వివరంగా తెలుసుకుంటే..
మంచు చిరుతలు(Snow Leopard) మంచు పర్వతాలైన హిమాలయాల(Himalaya Mountains)లో ఎంతో ప్రమాదకరమైన జంతువులు(Most Dangerous Animals). ఇవి సాధారణంగా మనుషులకు కనిపించడం తక్కువ. ఎంతో దట్టమైన లోయలలో, శిఖరాల మీద ఇవి నివసిస్తుంటాయి. హిమాలయ శిఖరాల మధ్య ఉన్న లడఖ్(Ladakh) లో మంచు చిరుత పులి వేట(Snow Leopard Hunt) కెమెరాకు చిక్కింది. ఈ చిరుతలు తమ శరీరం కంటే మూడు రెట్లు పెద్దగా ఉన్న జంతువులను అయినా సునాయాసంగా మట్టుబెట్టగలవు. వేటలో వీటికున్న నైపుణ్యంను బట్టి వీటిని ఘోస్ట్ ఆఫ్ ది మౌంటైన్(Ghost Of The Mountain) అని, 'పర్వతాల దయ్యం' అని పిలుస్తారు. ఇలా పిలవడంలోనే ఇవి ఎంత ప్రమాదమైనవో చెప్పేయచ్చు. ఒంటరిగా జీవించే ఈ మంచుచిరుతలు ఎక్కువగా జమ్మూ కాశ్మీర్(Jammu kashmir), హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), సిక్కిం(Sikkim), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) రాష్ట్రాలలో ఎత్తైన పర్వత ప్రాంతాలలో నివసిస్తాయి.
వీడియోలో మూడు జంతువులు గుంపుగా ఉన్నప్పుడు మంచు చిరుత ఒక్కసారిగా వాటిమీదకు పరిగెడుతూ వచ్చింది. వాటిలో రెండు వేరువేరు దిక్కులకు వెళ్ళిపోగా ఒకటి మాత్రం నేరుగా వెనక్కు పరిగెత్తింది. దాన్ని వెంబడించిన చిరుత కొన్ని సెకెన్లలోనే ఆ జంతువును మట్టుబెట్టింది. ఈ వీడియో చూస్తుంటే అదేదో పూనకం వచ్చినట్టే అనిపిస్తుంది. Praveen Kaswan IFS అనే ట్విట్టర్ యూజర్ ట్వి్ట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియో షేర్ చేశారు. What a brilliant hunter అనే క్యాప్షన్ తో ఈయన షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గూస్ బంప్స్ వస్తున్నాయ్ ఈ వీడియో చూస్తుంటే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.