Viral Video: ఆటో ఆగకుండానే.. యమా స్పీడ్‌గా వెళ్తూనే పంక్చర్ అయిన టైర్‌ను మార్చేసిన డ్రైవర్.. చూస్తే అవాక్కవడం ఖాయం..!
ABN , First Publish Date - 2023-05-04T17:04:44+05:30 IST
ఆటో వెనుక టైర్ పంక్చర్ అయితే ఆ భాగాన్ని గాల్లో లేపి, ఆటో రన్ అవుతుండగానే పంక్చర్ అయిన టైర్ ను మార్చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.
బైక్, కార్, ఆటో ఇలా ఏ వాహనంకు అయినా టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తారు? దాన్ని నెట్టుకుంటూ పంక్చర్ షాపుకు తీసుకెళ్లి దాన్ని సరిచేయిస్తారు. కానీ ఈ కుర్రాళ్ళను చూస్తే అవాక్కవడం గ్యారెంటీ. ఆటో వెనుక టైర్ పంక్చర్ అయితే ఆ భాగాన్ని గాల్లో లేపి, ఆటో రన్ అవుతుండగానే పంక్చర్ అయిన టైర్ ను మార్చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'ఓరినాయనో వీళ్ళదేమి పిచ్చి ధైర్యమో ఏమో!' అని నోళ్ళు వెళ్లబెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
పంక్చర్(puncture) అయిన వాహనాలను నడపడం కష్టం, అలాగే వాటిని నెట్టుకుంటూ వెళ్లడం కూడా కష్టమే. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం తెలివిగా ఆలోచించాడు. తెలివి అనడం కంటే పెద్ద సాహసవంతమైన ఆలోచన అని చెప్పవచ్చు. వీడియోలో ఒక అటో చాలా వేగంగా రోడ్డు మీద వెళుతోంది. ఆ ఆటో వెనుక ఒక టైర్ పంక్చర్(tire puncture in auto back side) అయ్యింది. అయితే ఆ ఆటో నడుపుతున్న వ్యక్తి ఆటోను ఒకవైపుకు వంచి నడుపుతున్నాడు. గాల్లో లేచిన భాగంలో పంక్చర్ అయిన టైర్ ఉంది. ఆటోలో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చి కిందకు వంగి పంక్చర్ అయిన టైర్ ను తీసేశాడు(remove puncture tire ). ఆ తరువాత ఆ ఆటో వెనుక మరొక ఆటో రయ్యి మని దూసుకొచ్చింది. రెండో ఆటోలో ఉన్న వ్యక్తి పంక్చర్ అయిన ఆటోలో ఉన్న వ్యక్తికి ఒక కొత్త టైర్ ను అందించాడు. అతను పాత టైర్ స్థానంలో కొత్త టైర్ ను సెట్ చేయడం(replace new tire ) చూడొచ్చు.
Viral News: 80 ఏళ్ల క్రితం నాటి అయిదో తరగతి ప్రశ్నాపత్రం.. ఒక్క ప్రశ్నకయినా సమాధానం చెప్పగలిగితే చాలా గ్రేట్ అట..!
సినిమా స్టంట్ లాగా ఆటోను ఒకేవైపు వంచి డ్రైవ్ చేయడం పెద్ద రిస్క్ అని అందరూ భయపడ్డారు. మరొకవైపు ఆటోలోనుండి బయటకు వంగి మరీ పంక్చర్ అయిన టైర్ ను తీయడం, దాని స్థానంలో కొత్తది సెట్ చేయడం చూస్తే వీళ్ళదేం పిచ్చిధైర్యం బాబోయ్ అనిపించకమానదు. ఈ వీడియోను Skills అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీళ్ల పనికి నోరెళ్లబెడుతున్నారు. 'వామ్మో వీళ్లేంటి ఇంత దారుణంగా ఉన్నారు' అని కామెంట్స్ చేస్తున్నారు. 'వారు టైర్ మార్చే స్టంట్ చేస్తూ ప్రాణాలు రిస్క్ లో పెడుతున్నారు' అని మరికొందరు కామెంట్స్ చేశారు.