Viral Video: జూ కు వచ్చిన సందర్శకులపై రాళ్ళు విసిరిన చింపాంజీ పిల్ల.. చివరకు దానికి ఏ గతి పట్టిందో మీరే చూడండి!

ABN , First Publish Date - 2023-03-26T12:55:22+05:30 IST

చింపాంజీ పిల్ల(Baby Chimpanzee) చేతికి అందిన రాయి తీసుకుని దూరంగా తమను చూస్తూ ఫోటోలు తీస్తున్న సందర్శకులపై విసిరింది. ఆ తరువాత..

 Viral Video: జూ కు వచ్చిన సందర్శకులపై రాళ్ళు విసిరిన చింపాంజీ పిల్ల.. చివరకు దానికి ఏ గతి పట్టిందో మీరే చూడండి!

ఇంట్లో పిల్లలు అల్లరిపనులు చేస్తుంటే ఏంటి మీ కోతి(Monkey) చేష్టలు అని అరుస్తుంటారు పెద్దలు. అల్లరిపనులకు కోతికి ఉన్న లింక్ అలాంటిది మరి. కోతులకు చింపాంజీలకు మధ్య రూపంలో చాలా వత్యాసం ఉన్నా.. వాటి ప్రవర్తన మాత్రం ఇంచుమించు ఒకలా ఉంటుంది. మనుషులు కోతినుండి అభివృద్ది చెందారని చెబుతారు. చింపాజీలు మనుషుల్లా బాధ్యతగా ఉంటాయి. ఓ చింపాంజీ పిల్ల ఆకతాయిలా జూ కు వచ్చిన సందర్శకులపై రాళ్ళు విసిరింది. ఆ తరువాత పెద్ద చింపాంజీ చేసిన పని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తుంటే పెద్దవాళ్ళు ఎంతో ఓపికతో భరిస్తారు. కానీ బయటి వాళ్లను కొట్టడం, తిట్టడం, వారితో గొడవ పడటం వంటి పనులు చేస్తే మాత్రం పెద్దలకు కోపం వస్తుంది. చిన్నతనంలో ఇతరులను కొట్టి ఆ తరువాత పెద్దల చేతుల్లో చింత బరికెలు, ఈతబరికెల దెబ్బలు తినడం చాలామందికి గుర్తుండే ఉంటుంది . కేవలం మనుషులు మాత్రమే కాదండోయ్.. చింపాజీలు(Chimpanzee) కూడా అచ్చం మనుషుల్లాగే తమ పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటాయి. దానికి ఈ వీడియో పెద్ద నిదర్శనం. జూలో పెద్ద బండరాళ్ళ మీద కొన్ని చింపాంజీలు గుంపుగా ఉన్నాయి. ఆ చింపాంజీలలో ఓ ఆకతాయి చింపాంజీ పిల్ల(Baby Chimpanzee) చేతికి అందిన రాయి తీసుకుని దూరంగా తమను చూస్తూ ఫోటోలు తీస్తున్న సందర్శకులపై విసిరింది(Baby Chimpanzee Throw stone on Zoo Visitors). చింపాంజీ పిల్ల రాళ్లు తీసుకుని సందర్శకుపై విసరగానే పెద్ద చింపాంజీకి కోపం వచ్చింది. అచ్చం చిన్నప్పుడు మనం ఎవరినైనా కొట్టామని మన పెద్దోళ్ళకు తెలియగానే బెత్తం తీసుకుని ఎలాగేతే నాలుగు పీకేవారో.. అలాగే పెద్ద చింపాంజీ కూడా చేతికి దొరికిన కర్ర తీసుకుని పిల్ల చింపాంజీ వీపు విమానం మోత మోగించింది.

Read also: Viral Video: ఇనుప కంచెలో ఇరుక్కుపోయిన జింకను కాపాడాడొక వ్యక్తి.. ఆ తరువాత జింక ఏం చేసిందో చూస్తే షాకవుతారు..


పెద్ద చింపాంజీ పిల్ల చింపాంజీని బెత్తం తీసుకుని కొడుతున్నప్పుడు అక్కడ కొందరు ఫోటోగ్రాఫర్లు వీడియో తీశారు. సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి(IFS Officer Susanta Nanda) తన ట్విట్టర్ అకౌంట్(Susanta Nanda) లో ఈ వీడియో షేర్ చేశారు. 'ఈ జంతువులు కూడా మనలాగే ఉన్నాయి. పిల్లలకు మంచి నడవడిక నేర్పేది తల్లిదండ్రులే.. ఈ చింపాంజీ అదే చేసింది' అని వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద చింపాంజీ ప్రవర్తనకు ఫిదా అవుతున్నారు. నేటికాలం తల్లిదండ్రులు ఈ చింపాంజీని చూసి నేర్చుకోవాలని అంటున్నారు. 'పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా వారిని సమర్థించుకునే తల్లిదండ్రులు ఈ చింపాంజీని స్పూర్తిగా తీసుకోవాలి'అని మరికొందరు చెబుతున్నారు.

Read also: Snake: గుమ్మం ముందే కాపుగాచిన పాము.. రాత్రంతా నిద్రలేకుండా గడిపిన కుటుంబ సభ్యులు.. ఓ బల్ల మీదకు ఎక్కి మరీ..


Updated Date - 2023-03-26T12:55:22+05:30 IST