Viral Video: సింహాన్ని చూడగానే భయపడిన గున్న ఏనుగులు.. వెంటనే పెద్ద ఏనుగులు ఏం చేశాయో చూస్తే..

ABN , First Publish Date - 2023-07-13T10:19:57+05:30 IST

ఆకారంలో ఏనుగు పెద్దదే అయినా.. సింహం అడవికి రాజు. ఓ సింహం ఏనుగుపిల్లను చూసి దూకుడుగా దానిమీదకు పరుగు తీసింది. అయితే ఆ తరువాత..

Viral Video: సింహాన్ని చూడగానే భయపడిన గున్న ఏనుగులు.. వెంటనే పెద్ద ఏనుగులు ఏం చేశాయో చూస్తే..

అడవి జంతువులలో భారీ శరీరం కలిగిన ప్రాణులు ఏనుగులే. కాస్త మచ్చిక చేసుకుంటే ఏనుగులు చాలా విశ్వాసంగా ఉంటాయి.ఇక ఏనుగును వినాయకుడి స్వరూపంగా చూడటం కూడా ఏనుగుల మీద భారతీయులకు ఉన్న మమకారానికి ఒక ప్రత్యేక కారణం. ఏనుగుల ప్రవర్తన మనుషుల ప్రవర్తనకు చాలా దగ్గరగా ఉంటుంది. అడవిలో వెళుతున్న ఏనుగుల మీదకు సింహం వేగంగా దూసుకొచ్చింది. దాన్ని చూడగానే గున్న ఏనుగులు భయపడిపోయాయి. ఈ విషయం గమనించిన పెద్ద ఏనుగుల ప్రవర్తన చాలా షాకింగ్ గా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

అడవి జంతువులలో(Wild Animals) ఏనుగులది(Elephant) ప్రత్యేకమైన స్థానం. ఏనుగు మెదడు, మనిషి మెదడు నిర్మాణానికి దగ్గరగా ఉంటుంది. అందుకే వాటి ఆలోచనలు మనుషుల ఆలోచనకు దగ్గరగా ఉంటాయి. వీడియోలో అడవిలో(Forest) ఓ ఏనుగుల మంద(herd of elephants) నడుస్తూ వెళుతోంది. ఆ మందలో మూడు పిల్ల ఏనుగులు(baby elephants), 5పెద్ద ఏనుగులు ఉన్నాయి. అవి అలా వెళుతుండగా ఒక సింహం(Lion) ఏదో జంతువును తరుముతూ ఏనుగుమంద ఉన్న వైపు వచ్చింది. వేగంగా పరిగెడుతూ వచ్చిన సింహాన్ని చూసి పెద్ద ఏనుగులకు కాస్త దూరంలో అల్లరిగా ఆడుకుంటున్న పిల్ల ఏనుగులు బెదిరిపోయాయి. సింహం పరుగు చూసి పెద్ద ఏనుగులు కూడా వెంటనే అలర్ట్ అయ్యాయి. పెద్ద ఏనుగులు చాలా చురుగ్గా వాటి పొజిషన్ మార్చుకుని వాటి వీపు భాగాన్ని వెనక్కు ఉంచి వృత్తాకారంలో నిలబడటం మొదలుపెడతాయి. అవి అలా చేస్తోంటే.. పిల్ల ఏనుగులు కూడా చాలా చురుగ్గా వేగంగా పిరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద ఏనుగుల మధ్యలోకి వచ్చి నిలబడ్డాయి. అవి అలా వచ్చి చేరడం, పెద్ద ఏనుగులు వృత్తాకారంలో గున్న ఏనుగులకు రక్షణవలయంగా మారడం జరిగింది Elephants stand circle for baby's protection_). సెకెన్ల వ్యవధిలో అవి అంత చురుగ్గా, ఐకమత్యంగా తమ పిల్లల రక్షణ కోసం వలయంలా ఏర్పడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది ఇప్పుడు.

Donkey vs Old Man: పాపం.. ఈ పెద్దాయన.. తన మానాన తాను రోడ్డుపై వెళ్తోంటే.. ఈ గాడిద ఏం చేసిందో మీరే చూడండి..!


ఈ వీడియోను Susanta Nanda అనే ట్విట్టర్Twitter) అకౌంట్ నుండి సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్(IFS Officer) ట్విట్టర్ లో షేర్ చేశారు.'సింహం నుండి తమ పిల్లల్ని కాపాడుకోవడానికి తల్లి ఏనుగులు వృత్తాకారంలో నిలబడి రక్షణ ఇస్తున్నాయి. అడవి జంతువులలో ఏనుగుల కంటే బాగా తమ పిల్లల్ని రక్షించుకునే జంతువులు లేవు'అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగుల ప్రవర్తనకు ఫిదా అవుతున్నారు. 'ఎంత గొప్ప సెక్యూరిటీ ఇస్తున్నాయో.. మొత్తం అన్ని దిక్కులు కవర్ చేశాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'అడవి దున్నలు తమ పిల్లలకు ఏనుగుల కంటే బాగా ప్రొటెక్షన్ ఇస్తాయి' అని మరొకరు కామెంట్ చేశారు. 'సెకెన్ల వ్యవధిలోనే ఆ ఏనుగులు అంత చురుగ్గా రక్షణ వలయం ఏర్పరచడం చూస్తే ట్రైనింగ్ తీసుకున్న సైనికులు గుర్తొస్తున్నారు' అని ఇంకొందరు అంటున్నారు.

Ambani Family: అంత పెద్ద ఇంద్రభవనంలో అన్నీ వదిలేసి.. 27వ అంతస్తులోనే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఉండటం వెనుక..!


Updated Date - 2023-07-13T10:19:57+05:30 IST