Share News

Viral Video: వామ్మో ఈ పిల్లకు ఎంత ధైర్యం.. బైక్ రన్నింగ్ లో ఉన్నా సరే.. పాట వినబడగానే ఏం చేసిందంటే..

ABN , Publish Date - Dec 19 , 2023 | 10:02 AM

బైక్ మీద తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కూర్చోమని ఒకటికి పది సార్లు చెబుతారు. కానీ ఈ పాప మాత్రం ఉన్నట్టుండి చేసిన పనికి..

Viral Video: వామ్మో ఈ పిల్లకు ఎంత ధైర్యం.. బైక్ రన్నింగ్ లో ఉన్నా సరే.. పాట వినబడగానే ఏం చేసిందంటే..

చిన్నపిల్లలు ఏ విషయానికి అయినా తొందరగా స్పందిస్తారు. ముఖ్యంగా భావోద్వేగాలను అస్సలు దాచుకోలేరు. ఇక వారిని బయటకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు వేయి కళ్లతో వారిని కనిపెట్టుకుని ఉంటారు. బైక్ మీద తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కూర్చోమని ఒకటికి పది సార్లు చెబుతారు. ఓ చిన్నారిని ఆమె తండ్రి బైక్ మీద జాగ్రత్తగా తీసుకెళ్తోంటే ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పాట వినబడగానే ఆ పాప చేసిన పని చూస్తే షాకవుతారు. బైక్ వెనుక వస్తున్న కారులో వ్యక్తులు వీడియో తీయడంతో ఆ పాప చేసిన పని సోషల్ మీడియాకు పాకింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

చిన్నపిల్లలు వారికి నచ్చిన విషయాన్ని బయటకు చెప్పకుండా, చేయకుండా అస్సలు ఉండలేరు. ఈ పాప కూడా అలాగే ఉన్నట్టుంది. వీడియోలో ఓ వ్యక్తి తన కూతురుని బైక్ పై కూర్చోబెట్టుకుని రోడ్డుమీద వెళుతున్నాడు. వాళ్లు అలా వెళుతోంటే సడన్ గా ఆ చిన్నారికి పాట వినిపించింది. ఆ పాట వినగానే ఆ పాపలోని నృత్యకారిణి బయటకు వచ్చింది. తను బైక్ మీద ఉన్నాననే స్పృహ లేకుండా స్టేజ్ మీద ఎలాగైతే డాన్స్ పర్మామెన్స్ ఇస్తారో అలాగే ఆ పాప కూడా బైక్ మీదే క్లాసిక్ డాన్స్ చేయడం మొదలెట్టింది. తన వెనుక, పక్క నుండి వాహనాలు వస్తున్న విషయాన్ని కూడా ఆ పాప పట్టించుకోలేదు. ఆ పాప కాళ్లు చేతులూ కదుపుతూ వివిధ భంగిమలు మారుస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు. పాప అభినయాన్ని, వివిధ భంగిమలను బైక్ వెనుక వస్తున్న కారులో వ్యక్తులు రికార్డు చేశారు. కానీ బైక్ మీద అలా చేయడం ప్రమాదంతో కూడుకున్నది కావడంతో నెటిజన్ల స్పందన పలురకాలుగా ఉంది.

ఇది కూడా చదవండి: రోజూ 2కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే.. జరిగేది ఇదే..!


ఈ వీడియోను its_me_srinu_1706 అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. కొందరు ఈ పాప అభినయానికి ఫిదా అవుతుండగా మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. 'దీన్నే జీవితం అని అంటారు' అని ఒకరు కామెంట్స్ చేశారు. 'పాట వినగానే ఆ అమ్మాయిలో డాన్సర్ నిద్రలేచింది' అని మరొకరు స్పందించారు. 'నిజమైన కళాకారుడు తన ప్రతిభ వ్యక్తం చేయడానికి ఏ వేదికా అవసరం లేదు' అని ఇంకొకరు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. 'ప్రతిభ సరే, ఏమాత్రం స్లిప్ అయినా ఆ పాప తన డాన్స్ కు దూరమైపోయే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఇలాంటివి ప్రోత్సహించకూడదు' అని చాలామంది అంటున్నారు.

ఇది కూడా చదవండి: పిల్లలలో మొబైల్ వ్యసనం.. ఈ పనులు చేస్తే మాయం!

మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 19 , 2023 | 10:02 AM