Viral Video: పెళ్లి వేడుకల్లో ఓ వధువుకు ఊహించని షాక్.. అప్పటిదాకా పక్కన కూర్చున్న వరుడు సడన్‌గా లేచి వెళ్లిపోయి..!
ABN , First Publish Date - 2023-05-02T15:38:50+05:30 IST
అప్పటిదాకా పక్కపక్కనే కూర్చుని తమ పెళ్ళి క్షణాలను ఆస్వాదిస్తోందొక పెళ్ళి జంట. కానీ ఉన్నట్టుంటి వరుడు అమ్మాయి పక్కనుండి లేచివెళ్ళిపోయాడు. ఆ తరువాత జరిగిన సీన్ చూస్తే..
పదిమంది మాట్లాడుకునేలా పెళ్లి జరగాలని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్పటి యువత అయితే పెళ్లి విషయంలో అస్సలు రాజీ పడరు. తమ పెళ్ళి జీవితాతంతం గుర్తుండిపోవాలని వారు అనుకుంటారు. అందుకు తగ్గట్టే పెళ్ళి ఏర్పాట్ల నుండి వధూ వరులు ఒకరికొకరు సర్ఫ్రైజ్(surprise to each other) ఇవ్వడం వరకు అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. అప్పటిదాకా పక్కపక్కనే కూర్చుని తమ పెళ్ళి క్షణాలను ఆస్వాదిస్తోందొక పెళ్ళి జంట. కానీ ఉన్నట్టుంటి వరుడు అమ్మాయి పక్కనుండి లేచివెళ్ళిపోయాడు. ఆ తరువాత జరిగిన సీన్ చూస్తే షాకవ్వాల్సిందే.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ పెళ్లి వేడుక వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఓ వధువు 'బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..' అనే పాటకు డాన్స్ వేసి తన కాబోయే భర్తకు సర్ఫైజ్ ఇచ్చింది. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ అమ్మాయి డాన్స్, ఆ పాట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తరువాత ఆమె ప్రేరణతో, అదే పాటతో చాలామంది అమ్మాయిలు తమ కాబోయే భర్తల మనసు దోచేశారు. ప్రస్తుతం ఏ పెళ్ళిలో చూసినా వధువో.. వరుడో తమక్కాబోయే భాగస్వాములకు సర్ఫైజ్ ఇవ్వడం సాధారణం అయిపోయింది. ఓ వరుడు(groom) తన పెళ్ళిలో తనక్కాబోయే భార్యకు అధిరిపోయే సర్పైజ్ ఇచ్చాడు. వీడియోలో అప్పటివరకు వరుడు వధువు(bride) పక్కనే కూర్చున్నాడు . అతను ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె పక్కనుండి లేచి ఆమె చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ పెట్టాడు. ఆ తరువాత వేదికమీదకు వెళ్ళి 'తు మాన్ మేరీ జాన్' పాటకు డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ డాన్స్ లో భాగంగా అతను వధువుకు టెడ్డీ బేర్, గులాబీ పువ్వు వంటి బహుమతులు ఇస్తూ ప్రపోజ్ చేశాడు. అతని ప్రపోజల్ కు వధువు ఫిదా అయిపోయింది. ప్రపంచంలో సంతోషమంతా ఆమె కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపించింది. వరుడు, వధువుకు ఇలా ప్రపోజ్ చేసిన వీడియో ఇప్పుుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Viral Video: కారు డిక్కీ డోర్‌ను తీసేసి.. ఇనుప చువ్వలు అడ్డుగా పెట్టి.. ఓ డ్రైవర్ చేసిన నిర్వాకమిదీ..!
ఈ వీడియోను expressionewc అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి షేర్ చేశారు. ఈ పెళ్ళివేడుక ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడి ప్రపోజల్ కు ఫిదా అవుతున్నారు. 'వరుడు సూపర్ గా డాన్స్ చేశాడు, అతని ప్రపోజల్ అద్భుతం' అని కొందరు కామెంట్స్ చేశారు. 'ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు' అని మరికొందరు కామెంట్ చేశారు. ఓ అమ్మాయి అయితే 'నాకోసం కూడా ఇలా ఎవరైనా చేస్తే బాగుండు' అని తన మనసులో ఆశను బయటపెట్టింది. మొత్తానికి ఈ వరుడు కేవలం వధువు మనసునే కాదు.. నెటిజన్ల హృదయాలను కూడా దోచేశాడు.