Viral Video: డ్రైవరన్నా.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కదలకుండానే దొంగను ఎలా ఇరికించాడో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-04-09T17:50:01+05:30 IST
ఓ దొంగ తెలివిగా దొంగతనం చేసి జంప్ అవుదామని అనుకున్నాడు. కానీ బస్ డ్రైవర్ సీటు నుంచి లేవకుండానే
దొంగతనాలు(thefts), మోసాలు(Cheating) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు తమ చేతివాటం చూపిస్తుంటారు. . బహిరంగ ప్రదేశాల్లో దొంగతనాలు సర్వసాధారణంగా మారాయి. దొంగతనాలకు సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అవన్నీ ఒక ఎత్తు, ఈ దొంగతనం మాత్రం మరొక ఎత్తు. ఓ దొంగ తెలివిగా దొంగతనం చేసి జంప్ అవుదామని అనుకున్నాడు. కానీ బస్ డ్రైవర్ సీటు నుంచి లేవకుండానే దొంగను ఇరికించాడు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఓ దొంగ ప్రయాణికులతో కలసి బస్సు ఎక్కుతున్నాడు. అతని ముందు ఓ మహిళ బస్సు ఎక్కి లోపలికి వెళుతోంది. ఆ మహిళ చేతిలో హ్యాండ్ బ్యాగ్(Women hand bag) మీద ఆతని మనసు పడింది. అతను బస్సులో డ్రైవర్ సీటు దాడి రెండడుగులు ముందుకు వెళ్ళాకా ఒక్కసారిగా మహిళ చేతిలో బ్యాగ్ లాక్కున్నాడు. వెంటనే బస్ దిగి వెళ్ళిపోవాలని బస్ ఎక్సిట్ డోర్ వైపు పరిగెత్తాడు. అయితే డ్రైవర్ చాలా చురుగ్గా ఆలోచించాడు. అది ఎలక్ట్రిక్ డోర్(electric door) కావడంతో దొంగ పారిపోవాలని ప్రయత్నించినప్పుడు ఆ డోర్ ను లాక్ అయ్యేలా చేశాడు. ఇలా చేయడంతో ఆ దొంగ చెయ్యి డోర్ లో ఇరుక్కుపోయింది. దొంగ బస్ లోపల, అతని చెయ్యి కొంచెం డోర్ బయట ఇరుక్కుపోయాయి. డోర్ లో నుండి చెయ్యి బయటకు తీసుకోవాలని ప్రయత్నించి దొంగ విఫలమయ్యాడు. అదే సమయంలో డ్రైవర్ తన దగ్గరున్న దుడ్డు కర్ర( stick) తీసుకుని దొంగ వీపు విమానం మోత మోగించాడు. ఒకవైపు చెయ్యి ఇరుక్కుపోయి సతమతం అవుతున్న దొంగకు వీపు దెబ్బలు తోడవడంతో విలవిల్లాడిపోయాడు. అతనలా ఉండగానే బస్ రన్ అయ్యింది. చివరికి పోలీసులు బస్ దగ్గరకు వచ్చేవరకు ఆ దొంగను డ్రైవర్ వదల్లేదు.
Viral Video: గొర్రె పిల్లను ఎత్తుకెళ్లడమే ఓ తప్పు.. పైగా దగ్గరకు రావద్దంటూ తల్లికి కాలు చూపించిందో యువతి.. మరుక్షణమే షాకింగ్ సీన్..!
Karma Clips అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు డ్రైవర్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డ్రైవర్ భలే సమయస్పూర్తి ప్రదర్శించాడని అంటున్నారు. ప్రజలు బయట ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మరికొందరు కామెంట్స్ చేశారు.