Viral Video: పిల్లి.. దాన్ని వెంటాడుతున్న పులి.. రెండూ ఒకే బావిలో పడిపోతే.. ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-02-16T12:51:10+05:30 IST

సమయం అందరి లెక్కలు తేలుస్తుంది అంటారుగా అలాగే ఇది కూడా.. నిమిషాల్లో లెక్కలు మారిపోయాయి

Viral Video: పిల్లి.. దాన్ని వెంటాడుతున్న పులి.. రెండూ ఒకే బావిలో పడిపోతే.. ఏం జరిగిందో మీరే చూడండి..!

'దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక..' అని పుష్ప సినిమాలో పాట. కానీ ఈ పిల్లికి పాపం దాక్కునే అవకాశం కూడా రాలేదు. అందుకే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని తనకు తాను ధైర్యం చెప్పేసుకుని ఒకటే పరుగు తీసింది. ఓ చిరుతపులి పిల్లిని పట్టుకోడానికి వెంటాడినప్పుడు పిల్లి పరిస్థితి ఇది. అయితే సమయం అందరి లెక్కలు తేలుస్తుంది అంటారుగా అలాగే ఇది కూడా.. నిమిషాల్లో లెక్కలు మారిపోయాయి. ఈ పులి పిల్లి కథ ఏంటో తెలుసుకుంటే..

మహారాష్ట్ర రాష్టంలో ఓ ఫారెస్ట్ అధికారి విధుల నిమిత్తం అడవిలో ఉండగా చిరుత పులి గాండ్రింపు వినబడింది. అతను ఆ గాండ్రింపుకు అప్రమత్తం అయ్యాడు. అంతలోనే పులి పరిగెత్తుతున్న శబ్దం వినబడటంతో అటువైపు ఫాలో అయ్యాడు. పులి దేన్నో వేటాడుతున్నట్టు అర్థం చేసుకున్నాడు అతను. అప్పుడే ఉన్నట్టుండి నీళ్ళలో ఏదో పడిన శబ్దం వినిపించింది. ఏం జరుగుతోందనే కంగారుతో వెళ్ళి చూడగా బావిలో చిరుత పులి, పులితో పాటు పిల్లి కూడా నీళ్ళలో కనిపించాయి. అంతవరకూ ఆహారం కోసం పులి, ప్రాణభయంతో పిల్లి సాగించిన పరుగు కాస్తా రెండిటిని ఒకే పరిస్థితిలోకి నెట్టేశాయి.

Read also: పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు.. మోసం చేశారంటూ భార్య విడాకుల కేసు.. ఇంతకీ భర్తకు ఉన్న సమస్య ఏంటంటే..

సురేంద్ర మిశ్రా అనే ఫారెస్ట్ ఉద్యోగి ట్విట్టర్ లో పంచుకున్న వీడియో ప్రకారం చిరుతపులి, పిల్లి రెండూ బావిలో నీళ్ళలో పడిపోయాయి. అంతవరకు పిల్లిని పట్టుకుని చప్పరించేయాలని ఆరాటపడిన పులి నీళ్ళలో పడిపోగానే దాని ఆహారం గురించి మరచిపోయింది, ప్రాణాలతో ఎలా బయటపడాలిరా సామీ.. అనుకుంటూ నీళ్ళలో తడిసి ముద్దయి వణకుతోంది. మరోవైపు ఎక్కడ మీదపడి చీరేస్తుందోనని భయపడిన పిల్లి నీళ్ళలో పడగానే తప్పించుకునే మార్గం కోసం వెతుకుతూ అదే పులిమీద ఎక్కి చిందులువేస్తుంది. 'ప్రాణభయం అందరికీ ఒకటేరా భాయ్..' అని పిల్లి పులిని గిల్లినట్టే ఉంది ఈ వీడియో చూస్తున్నంత సేపు. ఏదిఏమైనా ఈ పిల్లికి ఇంకా కొన్ని ఎలుకలు బాకిపడినట్టున్నాయ్. అందుకే బ్రతికిపోయిందనిపిస్తుంది. కాగా నెటిజన్లు మాత్రం పాపం ఆ పిల్లికి ఏమయ్యి ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-16T12:51:19+05:30 IST