Viral Video: నడిసముద్రంలో షాకింగ్ సీన్.. నీళ్లలో మునిగిపోతూ కనిపించిన గ్రద్ద.. ఆ తరువాత జరిగిందేంటో చూస్తే..
ABN , First Publish Date - 2023-07-18T10:10:31+05:30 IST
నడిసముద్రంలో ఓ గ్రద్ద మునిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ తరువాత జరిగిందేంటో చూస్తే..
కార్లు, బస్సులు, భవంతులు, ఉద్యోగాలు, ఉరుకులు పరుగులు ఇదంతా మనిషి జీవితం. దీనికి అవతల అడవి, సముద్రం, కొండలు, కోనలు ఆయా ప్రాంతాలలో నివసించే జంతువులు ఉంటాయి. అవన్నీ వాటి మనుగడ కోసం పోరాడుతూ ఉంటాయి. నడిసముద్రంలో ఓ గ్రద్ద మునిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ తరువాత జరిగిందేంటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పోరాటం మనిషిని పదును చేస్తుంది అంటారు. ఈ విషయం మనిషి కంటే పశుపక్ష్యాదుల విషయంలో చాలా బాగా నిరూపణ అవుతుంటుంది. గ్రద్దలు, డేగలు చాలా ప్రాచీన పక్షులు. వర్షం కురుస్తున్నప్పుడు తడవకుండా ఉండటం కోసం పక్షులన్నీ తమ తమ గూళ్లకు చేరుకుంటే గ్రద్దలు మాత్రం మేఘాలనే అధిగమించి మేఘాలపైకి చేరుకుంటాయి. ఇదీ వాటి బలం. వీడియోలో ఓ గ్రద్ద(Eagle) సముద్రపు నీళ్లలో మునిగిపోతూ కనిపిస్తుంది. నిజానికి అది ఆహారం వేట కోసం సముద్రం మీదకు వెళ్ళింది(eagle hunt in sea). చేపలు పట్టే ఆలోచనతో నీళ్లమీద వాలింది. కానీ సముద్రంపు అలలు ఒకవైపు దాన్ని కుదురుగా ఉండనివ్వలేదు, మరొకవైపు దానికి ఆహారం దొరకలేదు. కానీ ఆ గ్రద్ద నిరుత్సాహపడలేదు. అలల తాకిడి ఒకవైపు, దానికి ఆహారం దొరకక మరొకవైపు ఏకంగా మూడు సార్లు నీళ్లలో మునగడం, మళ్ళీ పైకి లేవడం చూడచ్చు. ఇలా అది ఆహారపు వేటలో తన ప్రాణాలను మూడుసార్లు రిస్క్ లో పెట్టింది. చివరిగా గ్రద్ద నీళ్ళలోనుండి మెల్లిగా పైకి రావడం కనిపిస్తుంది. దాని కాళ్లతో దానికంటే బరువైన, భారీగా ఉన్న చేపను(big fish) పట్టుకుని ఎగురుతూ వస్తుంది. సముద్రపు నీళ్ళలో పట్టుదలగా ప్రయత్నించి అది చేపతోనే నీళ్లలోనుండి బయటకు వచ్చింది. ఈ దృశ్యాన్ని ప్రముఖ వైల్డ్ లైఫ్ పోటోగ్రాఫర్ మార్క్ స్మిత్(Wild life Photographer Mark Smith) తన కెమెరాలో బంధించారు.
Health Tips: బరువు తగ్గుతామనే భ్రమలో ఎన్ని పొరపాట్లు చేస్తున్నారో తెలుసా? ఉదయాన్నే అందరూ తాగే ఈ డ్రింక్స్ వల్లనే..
ఈ వీడియోను Hasnain Nazir అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఆహారం కోసం ఈ పక్షి మూడు సార్లు నీళ్ళలో మునిగి తన ప్రాణాలను రిస్క్ లో పెట్టింది. ఫలితంగా అది తన ఆహారంతో నీళ్లలో నుండి బయటకు వచ్చింది' అని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు, ఈ గ్రద్ద నుండి చాలా ప్రేరణ పొందుతున్నారు. 'తన కంటే ఎక్కువ బరువున్న చేపను పట్టుకుని అది ఒడ్డుచేరేవరకు ఎగురుతుందంటే దానికెంత బలముంటుందో కదా?' అని ఒకరు ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు. 'గ్రద్దలు చాలా శక్తివంతమైన పక్షులు. వాటి జీవనం గురించి తెలుసుకుంటే ఎన్నో గొప్ప పాఠాలు అర్థమవుతాయి'అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'ఆ గ్రద్ద తన ఇంటిని చూపించడానికి చేపను తీసుకెళ్తోంది' అని మరొకరు చమత్కరించారు.