Viral Video: ఈ చిన్నారికి ఏమైంది? అమ్మవారిని చూస్తూ ఎందుకిలా ఏడుస్తోంది? దేవీనవరాత్రులలో విస్తుపోయే సంఘటన..
ABN , First Publish Date - 2023-10-30T10:14:53+05:30 IST
తీరా దేవీనవరాత్రులు ముగుస్తున్నాయనగా ఓ చిన్నారి అమ్మవారి ముందు కన్నీటి పర్యంతం అయ్యింది.
భారతదేశం ఎంతో గొప్పగా జరుపుకునే దేవీనవరాత్రుల గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచాన్ని ఓ గొప్ప శక్తి నడిపిస్తోందని అంటారు. ప్రతి మతం ఆ శక్తి తమ దేవుడే అని నమ్ముతారు. హిందూ మతంలో శక్తిగా, స్త్రీకి ప్రతిరూపంగా భావించే అమ్మవారిని ఈ సృష్టికి అమ్మగా నిర్వచిస్తారు.దేవీనవరాత్రుల సంబరం అంతా ఈ అమ్మవారిదే. తెలుగు రాష్ట్రాల గురించి పక్కన పెడితే ఉత్తరాది రాష్ట్రాలలో అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి వినాయక ఉత్సవాలలా నిర్వహస్తారు. నవరాత్రులు ముగిశాక అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవీనవరాత్రులు ముగిశాయని ఓ చిన్నారి చేసిన పని అందరి మనసులను బరువెక్కిస్తోంది. ఈ సంఘటన గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, దేవుడిని మెప్పించడానికి భక్తి మార్గం చాలా సులువైనది, శక్తివంతమైనదని చెబుతారు. ఈ కారణంగానే పలువురు దేవుడిని భక్తిశ్రద్దలతో పూజిస్తారు. భక్తి ఎక్కువైనప్పుడు ఆ భగవంతుడితో అనుసంధానం పెరిగినప్పుడు కలిగే ఎమోషన్స్ ను చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. వీడియోలో దేవీనవరాత్రుల(Navratri) సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తుండటం చూడచ్చు. తొమ్మిది రోజులూ ఎంతో సంతోషంగా సాగిన ఈ నవరాత్రి ఉత్సవాలలో చివరిరోజు భక్తుల భక్తి తారాస్థాయికి చేరింది. అమ్మవారి భజన చేస్తూ ఓ చిన్నారి కంట తడి పెట్టుకుంటోంది(girl crying for maa Durga). తొమ్మిది రోజులు అమ్మవారికి ఎంతో ప్రేమగా పూజలు చేసిన చిన్నారి ఇక ఆ అమ్మ నిమజ్జనానికి వెళ్లిపోతుందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మవారి భజన చేస్తుంటే ఇంత చిన్న వయసులో ఆ పాపకు అంత భక్తి ఎలా అలవడిందనే విషయం ఆశ్చర్యపరుస్తుంది. కేవలం ఈ చిన్నారి మాత్రమే కాదు, చాలామంది అమ్మవారి ఉపాసకులు పలుచోట్ల అమ్మవారి ముందు మోకరిల్లి కన్నీరు పెట్టుకున్నారు.
Health Tips: వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు.. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..!
ఈ వీడియోను zindagi.gulzar.h అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. 'ఆ చిన్నారికి ఇంత చిన్నవయసులోనే ఎంత భక్తో' అని అంటున్నారు. 'అమ్మవారు ఆ చిన్నారిని ఆశీర్వదిస్తుంది' అని మరొకరు అన్నారు. 'కేవలం దేవీనవరాత్రులలోనే కాదు, ఆ అమ్మవారిని భక్తిగా పూజించే భక్తులు ప్రతిరోజూ ఇదే అనుభూతి చెందుతారు' అని ఇంకొకరు అన్నారు.