Viral Video: నీళ్ళోలో మాటు వేసిన మొసలి.. ఒడ్డున నిలబడి నీళ్లు తాగుతున్న జింక.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో..
ABN , First Publish Date - 2023-05-11T17:35:16+05:30 IST
మొసలి చేసిన సడన్ అటాక్ చూస్తే(sudden attack) ఒక్కసారిగా గుండెపోటు వచ్చినంత పనవుతుంది..
జంతువులకు సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా జంతువుల వేట(Animals hunt) చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఓ మొసలి(crocodiles) ఏదైనా జంతువు నీళ్ల దగ్గరకు వస్తే లటుక్కున పట్టుకుని చటుక్కున చప్పరించేయాలని నీళ్ళలో మాటు వేసింది. అప్పుడే ఓ జింక అక్కడికి వచ్చి నీళ్ళు తాగుతోంది. ఆ తరువాత జరిగన సంఘటన చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
అడవి జంతువులు(wild animals) చాలా తెలివైనవి. అవి తమ ఆహారం కోసం చాలా విభిన్నంగా వేటాడుతాయి(intelligence hunting). 'నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు' అని వేమన చెప్పాడు. మొసలి బలమంతా నీళ్ళలోనే(crocodiles strength in water) ఉంటుంది. అందుకే నీళ్లలో మాటువేసి నీళ్ళ దగ్గరకు ఏవైనా జంతువులు వస్తే వాటిని పట్టుకుంటుందది. వీడియోలో ఓ మొసలి అలాగే నీళ్లలో మాటువేసింది. అడవిలో గెంతి గెంతి అలసిపోయిన ఓ జింక(deer) దాహం తీర్చుకుందామని నీటి కొలను దగ్గరకు వెళ్లింది. అప్పటికే మాటు వేసిన మొసలి జంక రాగానే ఉన్నదున్నట్టుగా పెద్ద నోరు తెరుస్తూ జింక మీదకు వెళ్లింది. అయితే మెరుపు వేగంతో పరిగెత్తగల జింక ఆ మొసలి దాడి నుండి ఒక్క గెంతులో తప్పించుకుంది. చేతికి దొరకాల్సిన జింక చేజారిపోవడంతో మొసలి నిస్తేజంగా మళ్లీ నీళ్లలోకి వెళ్లిపోయింది. మొసలి చేసిన సడన్ అటాక్ చూస్తే(sudden attack) ఒక్కసారిగా గుండెపోటు వచ్చినంత పనవుతుంది. కానీ జింక చురుకుదనం(deer agility) దాని ప్రాణాలను కాపాడింది.
Hot Water: ఆరోగ్యానికి మంచిది కదా అని వేడినీరు తాగుతున్నారా? ఇన్ని సమస్యలు ముంచుకొస్తాయని తెలిస్తే..
ఈ వీడియోను clips that go hard అనే ట్విట్టర్ అకౌంట్(twitter account) నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'వామ్మో ఆ మొసలి చాలా వేగంగా అటాక్ చేసింది' అని కామెంట్ చేస్తున్నారు. 'జింక స్థానంలో వేరే జంతువు ఉంటే మొసలికి ఆహారం అయిపోయేది' అని మరికొందరు అంటున్నారు. 'మొసలి వేగమే దిమ్మతిరిగిపోయేలా ఉంటే జింక వేగం దానికి జేజమ్మలాగా ఉంది' అని మరికొందరు అన్నారు.