Viral Video: నిజమైన హీరో నువ్వేనయ్యా.. ఆవు పీక పట్టుకుని చంపుతున్న సింహాన్ని ఒంటిచేత్తో ఉరికించాడు..

ABN , First Publish Date - 2023-07-02T16:14:18+05:30 IST

ఎక్కడైనా సింహం కనబడితే వెనక్కు తిరిగి చూడకుండా, సాద్యమైనంత వేగంగా పరిగెడతారు. పొరపాటునవ వాటి చేతికి చిక్కామా ఇక ప్రాణాలమీద ఆశ వదులుకోవాల్సిందే. కానీ ఈ రైతు మాత్రం

Viral Video: నిజమైన హీరో నువ్వేనయ్యా.. ఆవు పీక పట్టుకుని చంపుతున్న సింహాన్ని ఒంటిచేత్తో ఉరికించాడు..

పులులు, సింహాలు వేటకు పెట్టింది పేరు. వాటి పేరు చెప్పినా, వాటిని నేరుగా చూసినా భయపడతారు, వెనక్కు తిరిగి చూడకుండా, సాద్యమైనంత వేగంగా పరిగెడతారు. పొరపాటునవ వాటి చేతికి చిక్కామా ఇక ప్రాణాలమీద ఆశ వదులుకోవాల్సిందే. ఓ ఆవుకు అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఒంటరిగా ఉన్న ఆవును చూసి సింహం రెచ్చిపోయింది. ఆవు పీక పట్టుకుని దాని అంతు తేల్చాలని అనుకుంది. కానీ అప్పుడే ఊహించని విధంగా అక్కడికి దాని యజమాని వచ్చాడు. ఆ సమయంలో అతను చూపించిన తెగువ చూస్తే అతన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

గుజరాత్(Gujarat) రాష్ట్రం గిర్ సోమనాథ్ జిల్లాలో దర్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో కిరీతిన్ చౌహాన్ అనే రైతు(farmer) నివసిస్తున్నాడు. ఇతని ఆవు(cow) మేత కోసం ఊరిపొలిమేరకు వెళ్ళింది. ఎంతసేపైనా ఆవు తిరిగి రాకపోవడంతో ఆవును వెతుక్కుంటూ అతను బయల్దేరాడు. అతను రహదారి దగ్గర మలుపు తిరగ్గానే షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ సింహం(Lion) తన ఆవు పీక పట్టుకుని కొరుకుతూ కనిపించింది. వీడియోలో రహదారిమీద సింహం ఆవు పీక కొరుకుతూ దాన్ని చంపడానికి ప్రయత్నించడం చూడొచ్చు. పాపం ఆవు సింహం పట్టు నుండి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించేకొద్ది సింహం ఇంకా ఎక్కువగా తన పట్టు పెంచుకుంది. ఈ సంఘటన నడిరోడ్డులో జరుగుతోంటే అవతలివైపు నుండి ఆవు యజమాని దగ్గరగా రావడం కనిపిస్తుంది. అతను తన ఆవును ఎలా కాపాడుకోవాలా అని అటూ ఇటూ తచ్చాడుతూ తర్జభర్జన పడ్డాడు. సింహం ఆవును వదిలేసి తనమీదకు వస్తే తన పరిస్థితేంటని అతను ఆలోచన చేయలేదు. పక్కనే పొదలలో ఓ కర్ర, ఒక రాయి(stick, stone) తీసుకుని ఒంటిచోత్తో సింహం మీద దాడి చేశాడు. అతను దగ్గరగా వచ్చి సింహం మీదకు రాళ్లు రువ్వడంతో ఆ సింహం ఆవును వదిలి పక్కనే ఉన్న పొదలలోకి పారిపోయింది. ఈ సంఘటన మొత్తాన్ని రహదారికి ఇవతలి వైపు ఓ వ్యక్తి కారులో నుండి రికార్డు చెయ్యడంతో విషయం బయటకు వచ్చింది.

Soya Beans: సోయాబీన్స్ గురించి దిమ్మతిరిగిపోయే నిజాలు.. మహిళలకు ఏకంగా ఇన్ని లాభాలా??


ఈ వీడియోను @Vivekkotadiya అనే ట్విట్టర్ యూజర్(Twitter user) తన అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రైతు ధైర్యానికి ఫిదా అవున్నారు. 'ఆ రైతు చాలా ధైర్యవంతుడు, అతను నిజమైన హీరో' అని అంటున్నారు. 'రైతు ఆవును కాపాడటంలో సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది' అని మరొకరు అన్నారు. 'రహదారికి ఇవతలివైపున్న వ్యక్తి ఆవును కాపాడకుండా వీడియో రికార్డ్ చేస్తూ ఎందుకున్నాడు' అని అతని మీద సీరియస్ అవుతున్నారు.

Viral Video: దేవుడు నడిపే డ్రామాలు ఇలానే ఉంటాయా? కొంగను వేటాడాలని సైలెంట్ గా వెళ్ళిందొక మొసలి.. చివరకేం జరిగిందో చూస్తే..


Updated Date - 2023-07-02T16:14:18+05:30 IST