Viral Video: ఐఏఎస్ అధికారి పోస్ట్ చేసిన వీడియో.. సైకిల్‌పై స్కూలుకు వెళ్తూ సడన్‌గా రోడ్డు పక్కన ఆగి.. ఈ పిల్లాడు చేసిన పనేంటో చూస్తే..!

ABN , First Publish Date - 2023-05-24T14:31:04+05:30 IST

ఆ ప్రాంతంలో జనసంచారం లేదు, ఆ పిల్లాడు అటూ ఇటూ గమనించి ఆ తరువాత అతను చేసిన పని అందరికీ షాకిస్తోంది. ఓ ఐఏఎస్ ఆఫీసర్ వీడియో షేర్ చేయడంతో

Viral Video: ఐఏఎస్ అధికారి పోస్ట్ చేసిన వీడియో.. సైకిల్‌పై స్కూలుకు వెళ్తూ సడన్‌గా రోడ్డు పక్కన ఆగి.. ఈ పిల్లాడు చేసిన పనేంటో చూస్తే..!

పిల్లలు ఇంట్లో ఉంటే అమ్మకు, నాన్నకు భయపడి బుద్దిగా ఉంటారు. అదే బయటకు వెళ్ళారంటే వాళ్ళ ఆలోచనలు, వారి అల్లరి వేరుగా ఉంటుంది. ఓ పిల్లాడు స్కూలుకు వెళ్ళడానికి ఇంటినుండి బయల్దేరాడు. దారిమధ్యలో సడన్ గా రోడ్డు మీద సైకిల్ ఆపాడు. ఆ ప్రాంతంలో జనసంచారం లేదు, ఆ పిల్లాడు అటూ ఇటూ గమనించి ఆ తరువాత అతను చేసిన పని అందరికీ షాకిస్తోంది. ఓ ఐఏఎస్ ఆఫీసర్ వీడియో షేర్ చేయడంతో ఈ సంఘటన బయటపడింది. ఇంతకూ ఈ పిల్లాడు చేసిన పని ఏంటి? అందరూ ఎందుకంత షాకవుతున్నారు పూర్తీగా తెలుసుకుంటే..

తల్లిదండ్రుల ప్రవర్తినను(Parents behaveness) బట్టే పిల్లలకు బుద్దులు(Children's behaveness) అలవడతాయి అని పెద్దవాళ్ళు ఎప్పటినుండో చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులను చూసి పిల్లలు చాలా అనుకరిస్తారు(Children's fallow their parents). పిల్లలు స్కూలుకు వెళ్ళి నేర్చుకునేది పాఠ్యపుస్తకాల విషయమే తప్ప జీవిత విలువలు(Life values), మంచి నడవడిక(good Dicipline) పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలి. ఓ పిల్లాడు ఈ మాటలకు బలం చేకూరుస్తున్నాడు. వీడియోలో ఇంటి నుండి స్కూలుకు బయల్దేరిన ఓ పిల్లాడు(School boy) సడన్ గా రోడ్డు మధ్యలో సైకిల్(bicycle) ఆపాడు. అసలే బాగా వర్షం పడునట్టుంది. కాలువలలోకి వెళ్ళిపోవలసిన నీరు రోడ్డంతా పొంగి ప్రవహిస్తోంది(rain water on road). ఆ పిల్లాడు సైకిల్ ఆపగానే అటూ ఇటూ గమనించి తన సైకిల్ స్టాండ్ వేశాడు. ఆ తరువాత పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువ దగ్గరకు వెళ్ళి కాలువలో అడ్డంగా ఉన్న చెత్తాచెదారం, ఆకులు వంటివి అన్నీ తన చేతులతో తీసేశాడు(Boy remove papers, leaves in drainage). కాలువలో అవన్నీ అడ్డుగా ఉండటం వల్ల వర్షపు నీరు పోవడానికి అంతరాయం ఏర్పడటం గమనించి ఆ పిల్లాడు ఆ పని చేసినట్టు అర్థమవుతుంది. అంతా చేసి ఆ పిల్లాడు ఎవరి మెప్పుకోసం చూడకుండా సైకిలెక్కి అక్కడినుండి స్కూలుకు వెళ్ళిపోయాడు.

Viral Video: ఇలాంటోళ్లకు ఇలాగే జరగాలి.. కుక్కను హింసిస్తూ కుర్రాళ్ల వికృతానందం.. మరుక్షణంలోనే మైండ్‌బ్లాకయ్యే సీన్..!


ఈ వీడియోను Awanish Sharan అనే ఐఏఎస్ అధికారి(IAS Officer) తన ట్విట్టర్ అకౌంట్(Twitter Account) లో షేర్ చేశారు. వీడియోకు 'ఎడ్యుకేషన్' 'Education' అనే క్యాప్షన్ ను మెన్షన్ చేశారు. నిజమైన విద్య పాఠశాలలో చెప్పే పాఠాలలో కాదు పిల్లల ప్రవర్తన, నడవడికలో ఉంటుందనే విషయాన్ని ఒకే ఒక్క పదంతో పోల్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లాడు చేసిన పనికి పిధా అయిపోయారు. 'ఆ పిల్లాడు చాలా మంచి పని చేశాడు' అని కొందరు కామెంట్స్ చేశారు. 'కనీసం అడుక్కునేవారికి సహాయం చేసినా పది సెల్ఫీలు, నాలుగు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునేవారికి ఈ పిల్లాడు చేసిన పని పెద్ద కనువిప్పు. కనీసం ఒకరి మెప్పుకోసం చూడకుండా తన పని తాను చేసి వెళ్ళిపోయాడు' అని మరికొందరు అంటున్నారు. 'ఆ పిల్లాడిని వారి తల్లిదండ్రులు సరైన విధంగా పెంచారు' అని కామెంట్స్ చేస్తున్నారు.

Marriage: పెళ్లికి వచ్చిన బంధువులు చేసిన నిర్వాకంతో వరుడికి కొత్త తలనొప్పి.. పెళ్లయిన మర్నాడే జరిగింది తెలిసి..!


Updated Date - 2023-05-24T14:31:04+05:30 IST