Viral Video: బామ్మను బైక్ వెనుక సీటులో కూర్చోబెట్టుకుని యమా స్పీడ్ గా వెళ్తున్న పిల్లాడు.. పక్కనే వెళుతున్న కారు ప్రయాణీకుడికి ఊహించని షాక్..

ABN , First Publish Date - 2023-05-28T15:09:02+05:30 IST

'ఒరేయ్ బాబూ.. చెప్పిన మాట విను అలా చేయకు' అని ఆ పిల్లాడికి హితవు చెప్పినా ఇంకా రెచ్చిపోయాడు తప్ప..

Viral Video:  బామ్మను బైక్ వెనుక సీటులో కూర్చోబెట్టుకుని యమా స్పీడ్ గా వెళ్తున్న పిల్లాడు..  పక్కనే వెళుతున్న కారు ప్రయాణీకుడికి ఊహించని షాక్..

పిల్లలు చిన్నవారు అయినా పెద్ద వాళ్లకు పోటీ ఇస్తున్నట్టు పనులు చేస్తారు. వారు చేసే పనులు చూసినప్పుడు ఒక్కసారిగా కోపం కూడా వస్తుంది. నిండా 10ఏళ్ళు కూడా లేని ఓ పిల్లాడు తన అమ్మమ్మను వెంటబెట్టుకుని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఒరేయ్ బాబూ.. చెప్పిన మాట విను అలా చేయకు' అని ఆ పిల్లాడికి హితవు చెప్పినా ఇంకా రెచ్చిపోయాడు తప్ప మాట వినలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

చిన్నపిల్లలు(kids) వద్దన్నపనిని అదే పనిగా మరింత అతిగా చేస్తారు. ఓ వీడియో ఇప్పుడు అదే ప్రూవ్ చేస్తోంది. వీడియోలో నిండా 10ఏళ్ళు కూడా లేని పిల్లాడు(under 10years kid) మోపెడ్ బైక్(moped bike) మీద వెళ్తున్నాడు. వెనుక సీటులో ఆ పిల్లాడి అమ్మమ్మ(Grand mother) కూర్చుని ఉంది. ఆమె చాలా వృద్దురాలిగా కనబడుతోంది. అంత చిన్న పిల్లాడు బైక్ నడపడమే నేరమైతే చాలా వేగంగా వెళ్ళడం మరింత ప్రమాదకరంగా ఉంది. ఆ పిల్లాడు అంత వేగంతో వెనక బామ్మను కూర్చోబెట్టుకుని వెళుతుండటం పక్కనే కారులో వెళుతున్న(car passenger) వ్యక్తి గమనించాడు. అతను తన కారును స్లో చేసి పిల్లాడితో 'నెమ్మదిగా వెళ్ళు బాబూ.. నిదానంగా డ్రైవ్ చెయ్యి' అని చెప్పాడు. అయితే ఆ మాట వినగానే ఆ పిల్లాడికి ఇగో ఎక్కువైంది. అప్పటికే వేగంగా వెళుతున్న బైక్ ను మరింత వేగం పెంచి కారును దాటుకుని వెళ్ళిపోయాడు. అయితే పిల్లాడు బైక్ అంత వేగంగా నడుపుతుంటే వెనక కూర్చున్న బామ్మ మాత్రం ఎలాంటి కంగారు లేకుండా నింపాదిగా కూర్చుని ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ బామ్మ పాత సినిమా హీరోయిన్ లాగా చక్కగా బైక్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించింది(old women enjoyed bike journey).

Viral Video: థియేటర్‌కు వెళ్లిన భార్యాభర్తలు.. సినిమా పూర్తయ్యాక ఏం చేస్తున్నారో చాటుగా వీడియో తీశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే..!


ఈ వీడియోను aj___boy_aj___ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో(Instagram page) షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'ఆ బామ్మకు తన మనవడి మీద చాలా నమ్మకం ఉంది. అందుకే అంత స్పీడ్ గా వెళ్తున్నా భయపడటం లేదు' అని అంటున్నారు. 'ఆ పిల్లాడు యముడితో రేసింగ్ చేస్తున్నాడు, చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాడు' అని కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: ఐఏఎస్ అధికారి పోస్ట్ చేసిన వీడియో.. సైకిల్‌పై స్కూలుకు వెళ్తూ సడన్‌గా రోడ్డు పక్కన ఆగి.. ఈ పిల్లాడు చేసిన పనేంటో చూస్తే..!


Updated Date - 2023-05-28T16:42:11+05:30 IST