Viral Video: ఈ పిల్లాడు త్వరలోనే ఓవర్ నైట్ సెలబ్రెటీ అయిపోవడం ఖాయం.. నాలుకతోనే ఈ బండి సౌండ్‌ను దించేశాడుగా..!

ABN , First Publish Date - 2023-09-05T11:24:30+05:30 IST

సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న ట్యాలెంట్ ఉన్నా చాలు సెలబ్రిటీ అయిపోతారు ఇప్పట్లో. దీనికి పిల్లలు పెద్దలు అనే తేడా లేదు. ఈ పిల్లాడు కూడా అంతే..

Viral Video: ఈ పిల్లాడు త్వరలోనే ఓవర్ నైట్ సెలబ్రెటీ అయిపోవడం ఖాయం.. నాలుకతోనే ఈ బండి సౌండ్‌ను దించేశాడుగా..!

సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న ట్యాలెంట్ ఉన్నా చాలు సెలబ్రిటీ అయిపోతారు ఇప్పట్లో. దీనికి పిల్లలు పెద్దలు అనే తేడా లేదు. వాహనాలు, పక్షులు, ఇతర వ్యక్తుల లాగా వారి స్వరాన్ని, శబ్దాన్ని వ్యక్తం చేయడం కొందరి ప్రతిభ. అలాంటి వారిలో ఈ పిల్లాడు కూడా ఒకడు. ఇతను తన నాలుక సహాయంతో నేటికాలం యూత్ కు ఫేవరెట్ బండి సౌండ్ ను దించేస్తున్నాడు. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పిల్లాడు తొందరలోనే సెలబ్రిటీ అయిపోతాడు అని అంటున్నారు. అసలింతకూ ఈ పిల్లాడి ట్యాలెంట్ ఏంటి? వీడియోలో ఏముంది తెలుసుకుంటే..

ఇప్పుడంటే పిల్లలకు ఆడుకోవడానికి బోలెడు బొమ్మలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి పిల్లలు అడిగిన బొమ్మలు తీసిస్తుంటారు. పైపెచ్చు వీడియో గేమ్స్ కాలంలో పిల్లలు బొమ్మలవైపు వెళ్ళడంకూడా తక్కువే. అయితే 20, 30ఏళ్ళ కిందట పరిస్థితులు వేరు. అప్పుడు ఇన్ని బొమ్మలు లేవు. డబ్బు లేని పిల్లలు బస్సు ఆట, రైలు ఆట ఆడుకునేవారు. ఆ సమయంలో బస్సులా, రైలు లా కూత పెడుతూ పిల్లలందరూ వరుసగా పరిగెత్తుకుంటూ వీధులన్నీ తిరిగేవారు. ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని ఈ పిల్లాడు గుర్తుచేస్తున్నాడు. మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం, యవత్మాల్ జిల్లా వాణి తాలుకా లో ఓ గ్రామానికి చెందిన ఈ పిల్లాడి పేరు గోపాల్ సందీప్. అయితే ఇతను బస్సునో, రైలునో కాదు ఏకంగా యూత్ ఫేవరెట్ బండి RX100 సౌండ్(RX100 bike sound) ను తన నాలుక మీద దించేస్తున్నాడు(kid make sound as RX100 bike). వీడియోలో పిల్లాడు మొదట తన పేరు చెప్పి 'ఈ రోజు నేను RX100 బైక్ సౌండ్ చేయబోతున్నాను' అని చెబుతాడు. ఆ తరువాత నాలుక బయట పెట్టి డుర్మ్మ్ అనే సౌండ్ క్రియేట్ చేస్తూ బండి నడుస్తున్నప్పుడు ఎలా సౌండ్ వస్తుందో అలా చేస్తాడు.

Marriage: ఈ పెళ్లిని నేను ఒప్పుకోనంటూ.. వివాహమయిన కొద్ది రోజులకే అడ్డం తిరిగిన యువతి.. ఆమె చెప్తున్న కారణం వింటే..!



ఈ వీడియోను royal_kastkar__ అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్ చేస్తున్నారు. 'తొందరలో ఈ పిల్లాడు సెలబ్రిటీ అయిపోతాడు' అని ఒకరు కామెంట్ చేశారు. 'గ్రీన్ చెట్నీతో నాలుగు సమోసాలు తిన్నతరువాత నా పరిస్థితి ఇలానే ఉంటుంది' అని మరొకరు కామెంట్ చేశారు. 'నిబ్బా RX100' అని ఇంకొందరు అంటున్నారు.

Shocking: మీ ఇంట్లోంచి ఏదో పాడు వాసన వస్తోందంటూ పక్కింటి వాళ్ల నుంచి ఫోన్.. హడావిడిగా వచ్చి తలుపులు తీసి చూస్తే..!


Updated Date - 2023-09-05T11:24:30+05:30 IST