Viral Video: అమ్మబాబోయ్.. పండ్లన్నీ వేసి ఇతను చేసింది సలాడ్ అనుకుంటే పొరపాటే.. అసలేం చేశాడో చూస్తే షాకవుతారు..
ABN , First Publish Date - 2023-05-08T19:47:52+05:30 IST
'పండ్లే కదా.. ఎలా చేసినా బానే ఉంటుందిలే.. ఆరోగ్యమేలే' అనుకుంటే పొరపాటే.. ఇతను పండ్లు ఉపయోగించి చేసిందేంటో చూస్తే కచ్చితంగా షాకవుతారు.
ఇప్పటికాలంలో ప్రతి ఆహార పదార్థాన్ని వెరైటీ పేరుతో ప్రయోగం చేస్తున్నారు. మ్యాంగో పిజ్జా అనీ, 24క్యారెట్ గోల్డ్ చాయ్ అని చాలానే వింటున్నాం. ఇప్పుడూ ఓ వ్యక్తి పండ్లు ఉపయోగించి ఓ ప్రయోగం చేశాడు. 'పండ్లే కదా.. ఎలా చేసినా బానే ఉంటుందిలే.. ఆరోగ్యమేలే' అనుకుంటే పొరపాటే.. ఇతను పండ్లు ఉపయోగించి చేసిందేంటో చూస్తే కచ్చితంగా షాకవుతారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో దుమారం రేపుతోంది. ఇంతకూ ఇతను పండ్లతో చేసిన ప్రయోగం ఏంటో.. అందరూ అంతగా ఎందుకు కంగారు పడుతున్నారో తెలుసుకంటే..
అరటి(banana), సపోటా(sapota), యాపిల్(Apple) వంటి పండ్లతో ఎంతో రుచికరమైన జ్యూస్(juice) చేయచ్చు, అలా కాకుంటే కాసిన్ని పాలు జతచేసి మిల్క్ షేక్(Milk shake) చేయచ్చు. అది కూడా కాకుంటే పండ్లముక్కలతో సలాడ్(Fruit salad) చేయచ్చు. కానీ ఇవన్నీ కాదని ఓ వ్యక్తి వింత ప్రయోగం చేశాడు. వీడియోలో ఒక వీధి వ్యాపారి స్టౌ మీద ఒక గిన్నె పెట్టాడు. అందులో పాలు(milk) వేసి పాలల్లో అరటి పండు వేశాడు. అందులోకి దశల వారీగా టీ పొడి, పంచదార(tea powder, sugar) వేశాడు. ఆ తరువాత సపోటా పండును రెండుగా చీల్చి విత్తనం తీసేసి పండును అందులో వేశాడు(adding sapota). ఒక యాపిల్ ను రెండుగా కట్ చేసి, గ్రేటర్ సహాయంతో యాపిల్ ను ఉడుకుతున్న గిన్నెలోనే తురిమేశాడు(grated apple and mix it). తరువాత అదంతా బాగా ఉడికాక దాన్ని స్ట్రైనర్ సహాయంతో వడగట్టి గాజు గ్లాస్ లో ఇస్తున్నాడు. దీన్ని ఫ్రూట్ చాయ్(fruit chai) అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ట వైరల్ అవుతోంది.
Burn scars: ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలిన మచ్చలు పోవడం లేదా? ఈ సింపుల్ చిట్కాలతో అవెంత తొందరగా మాయమవుతాయో తెలిస్తే..
Foodie Incarnate అనే యూట్యూబ్ ఛానల్(you tube channel) లో ఈ వీడియో ను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అదిరిపడుతున్నారు. 'బాబోయ్ ఫ్రూట్ ఛాయ్ ఏంటీ.. జనాల్ని చంపేస్తారా ఏంటీ' అని కామెంట్స్ చేస్తున్నారు. 'ఈ టీ సూర్యవంశం సినిమాలో వెంకేటేష్ కు పెట్టిన పాయసం కంటే విషపూరితమైనది' అని మరొకరు పంచ్ వేశారు. 'ఆరోగ్యరకరమైన పండ్లను పాడుచేస్తున్నారు' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్రూట్ చాయ్ అందరినీ ఓ రేంజ్ లో భయపెడుతోంది.