Viral Video: మూత్ర విసర్జనకు వెళ్లిన ఓ వ్యక్తికి డ్రైనేజీలో కనిపించిందో షాకింగ్ దృశ్యం.. ప్రాణభయంతో పారిపోయి పోలీసులకు ఫోన్..!

ABN , First Publish Date - 2023-08-03T14:21:21+05:30 IST

సాధారణంగా మగవారు బయటున్నప్పుడు మూత్రవిసర్జన చేయాల్సివస్తే రహదారుల ప్రక్కనా, డ్రైనేజీ కాలువల దగ్గరా పనికానిచ్చేస్తుంటారు. ఓ వ్యక్తి కూడా అత్యవసరం అవడంతో దగ్గరలోనే ఉన్న డ్రైనేజీ కాలువ దగ్గరకు పరుగు తీశాడు. కానీ..

Viral Video: మూత్ర విసర్జనకు వెళ్లిన ఓ వ్యక్తికి డ్రైనేజీలో కనిపించిందో షాకింగ్ దృశ్యం.. ప్రాణభయంతో పారిపోయి పోలీసులకు ఫోన్..!

సాధారణంగా మగవారు బయటున్నప్పుడు మూత్రవిసర్జన చేయాల్సివస్తే రహదారుల ప్రక్కనా, డ్రైనేజీ కాలువల దగ్గరా పనికానిచ్చేస్తుంటారు. ఓ వ్యక్తి కూడా అత్యవసరం అవడంతో దగ్గరలోనే ఉన్న డ్రైనేజీ కాలువ దగ్గరకు పరుగు తీశాడు. కానీ ఆ డ్రైనేజీ కాలువలో ఏదో కదులుతున్నట్టు అనిపించడంతో జాగ్రత్తగా పరిశీలించాడు. అతనికి కనిపించిన దృశ్యంతో గుండె ఆగినంత పనయ్యింది. అతను వెంటనే అక్కడినుండి పారిపోయాడు. ఆ వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా వారు కూడా షాకయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్ల గుండెలు కూడా భయంతో ఝల్లుమంటున్నాయి. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

సోషల్ మీడియాలో ఎన్నోరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో పాములు, క్రూరజంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ప్రజలను భయానికి గురిచేస్తుంటాయి. రహదారి మీద వెళుతున్న ఓ వ్యక్తి అత్యవసరంగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. అది జనసంచార ప్రాంతమే అయినా గత్యంతరం లేక అతను ప్రక్కనే ఉన్న డ్రైనేజీ కాలువ దగ్గర పనికానిచ్చేద్దామని అనుకున్నాడు(man urination at drainage). అతను డ్రైనేజీ కాలువ దగ్గరకు వెళ్లగానే కాలువలో కొంచెం దూరంలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. కాలువలో, అది కూడా అంత లోపల కదులుతున్నది ఏంటా అని అతను బాగా పరిశీలించి చూశాడు. ఓ భారీ కొండ చిలువ(giant python) ఆ డ్రైనేజీ కాలువలో అటూ ఇటూ కదులుతూ కనిపించింది(giant python in drainage). అది చూడగానే అతను భయంతో కంపించిపోయాడు. వెంటనే అక్కడినుండి పారిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకోగానే రెస్య్కూ టీమ్ అక్కడికి నిమిషాలలో చేరుకుంది. దాదాపు 6మంది సేఫ్టీ గార్డులు ప్రయత్నించిన మీదట డ్రైనేజీలోని కొండచిలువను బయటకు లాగారు. ఈ కొండచిలువ సుమారు 8అడుగుల పైన పొడవు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదకరమైన కొండచిలువలు ఉండటం భయాందోళనలు కలిగిస్తోందని అంటున్నారు.

Parrot Missing: నా చిలుక తప్పిపోయింది.. వెతికి తెచ్చిన వాళ్లకు రూ.10 వేల నజరానా.. అంటూ పోస్టర్లు.. ఏంటా అని ఆరా తీస్తే..!



ఈ వీడియోను rosebirumediaco అనే ఇన్స్టాగ్రామ్(Instagram) పేజీ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొండచిలువ పరిమాణం చూసి భయపడుతున్నారు. 'వాటికి ఆవాసం లేకుండా చేస్తున్నాం అందుకే జనావాస ప్రాంతాలలోకి కొండచిలువలు వస్తున్నాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'చిన్నతనంలో అలాంటి కాలువలలో చిన్నచిన్న చేపలు పట్టేవాడిని, ఇప్పుడు సేప్టీ గార్డులు కొండచిలువలు పడుతున్నారు' అని మరొకరు వ్యంగ్యంగా స్పందించారు. 'చిన్న పిల్లలు ఆడుకుంటూ బాల్ పోగొట్టుకునో లేక వేరే కారణంతోనో అందులోకి వెళ్లి ఉంటే ఏంటి పరిస్థితి?' అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tigers Video: బస్సును చుట్టుముట్టిన పులులు.. గజగజ వణికిపోయిన ప్రయాణీకులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!


Updated Date - 2023-08-03T14:21:21+05:30 IST