Viral Video: నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో.. చింపాంజీకి నీళ్ళుతాగడంలో సహాయం చేశాడొక వ్యక్తి.. ఆ చింపాంజీ ఏం చేసిందో చూస్తే..
ABN , First Publish Date - 2023-07-23T18:29:16+05:30 IST
బహుశా ప్రపంచంలో ఎప్పుడూ, ఎక్కడా ఇలాంటి సంఘటన చూసుండరు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన మనసున్న వ్యక్తులు కూడా ఈ వీడియో చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు.
ఈ సృష్టిలో మనుషులు, జంతువులు మొదటినుండి ఉన్నాయి. ఇన్నేళ్లు గడిచినా కొన్ని జంతువుల ప్రవర్తన కొత్తగానూ, షాకింగ్ గానూ ఉంటుంది. అడవిలో ఎక్కడైనా చింపాంజీలు కనబడితే చాలామంది గుండెలు వణికిపోతాయి. చింపాంజీలు మనుషుల్ని చూస్తే బ్రతకనివ్వవని, వెంటాడి మరీ చంపేస్తాయని చెప్పేవాళ్ళు, నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. ఓ వ్యక్తి అడివిలో వెళుతూ ఉంటే ఓ చింపాంజీ నీటి గుంట దగ్గర కూర్చుని కనబడింది. అతను చింపాంజీ నీళ్లు తాగడంలో దానికి సహాయం చేశాడు. ఆ తరువాత ఆ చింపాజీ చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బహుశా ప్రపంచంలో ఎప్పుడూ, ఎక్కడా ఇలాంటి సంఘటన చూసుండరు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన మనసున్న వ్యక్తులు కూడా ఈ వీడియో చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. 'మనుషులు లేని ప్రపంచం ఉంటే ఎంత బాగుంటుందో' అని కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లను కట్టిపడేస్తున్న ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
జీవపరిణామ సిద్దాంతం ప్రకారం మనిషి ఈ సృష్టిలో చాలా అభివృద్ది చెందాడని అనుకుంటాం. కానీ, జంతువుల ప్రవర్తన మనిషి కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని అక్కడక్కడా జరిగే కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. వైల్డ్ లైఫ్ ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ జెసి పియరీ(Wild life French Photographer) ఆఫ్రికాలోని కామెరూన్ అడవులలోకి(Africa Cameron forest) వెళ్ళారు. అతను ఫోటోల కోసం అడివిలో తిరుగుతుండగా అతనికి ఒక నీటి గుంట ముందు చింపాంజీ(Chimpanzee) కూర్చుని కనిపించింది. అదే సమయంలో చింపాంజీ కూడా అతన్ని చూసింది. ఆ చింపాంజీ వెంటనే అతన్ని తన దగ్గరకు రమ్మని సైగచేసింది. అతను అనుమానంగానే దాని దగ్గరకు వెళ్ళాడు. ఆ చింపాంజీ అతని చేతులు ముందుకు లాగింది. దీంతో అతను ఆ చింపాంజీ ముందు ఉన్న నీటి గుంట దగ్గర కూర్చున్నాడు. ఆ చింపాంజీ అతని చేతులను రెండు కలిపి దోసిలిగా చేసి తన ముందున్న నీటి గుంటలో అతని చేతులు ముంచి నీళ్ళు తీసింది. అతని దోసిట్లో ఉన్న నీళ్లను నోటితో తాగింది. ఇలా మూడు సార్లు అది నీళ్లు తాగింది. నీళ్లు తాగడం వల్ల అతని చెయ్యి ఎంగిలై ఉంటుందనే ఆలోచనతో ఆ చింపాంజీ అతని చేతిని ఆప్యాయంగా నీళ్ళతో కడుగుతోంది. ఈ దృశ్యాన్ని జెసి పియరీ తన కెమెరాలో బంధించారు.
Health Tips: తెలియక చేస్తున్న మిస్టేక్ ఇదే.. పొరపాటున కూడా రెండోసారి వేడి చేయకూడని ఆహార పదార్థాలివీ..!
ఈ వీడియోను జెసి పీయరీ jcpieri తన ఇన్స్టాగ్రామ్(Instagram) లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చలించిపోతున్నారు. 'మనం జంతువుల పట్ల ఎంత క్రూరంగా ఉంటామో..' అని మనుషుల ప్రవర్తనను గుర్తుచేసుకుంటున్నారు. 'ఈ ప్రపంచంలో మనుషుల కంటే జంతువులు చాలా విశ్వాసమైనవి' అని మరొకరు కామెంట్ చేశారు. 'దాని కృతజ్ఞతాభావం ఎంత అందంగా ఉందో' అని ఇంకొకరు కామెంట్ చేశారు.'మనుషులు లేకపోతే వాటి ప్రపంచం ఇంకెంత అందంగా ఉండేదో' అని మరికొందరు అంటున్నారు.