Viral Video: ఇది రిస్క్ కాదు.. పిచ్చి పీక్స్.. జెడ్ స్పీడ్‌తో గాల్లోకి దూసుకుపోతున్నామని అనుకుంటున్నారు కానీ..
ABN , First Publish Date - 2023-04-10T18:55:34+05:30 IST
బాబోయ్ ఇదెక్కడి సాహసంరా నాయనా.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంత ప్రమాదం జరిగిపోతుందో మీరే చూడండి..
కొన్నిసార్లు థ్రిల్ అని, సాహసం అనీ చాలామంది రిస్క్ పనులు చేస్తుంటారు. వాటిని చూసిన వారు ఏమాత్రం కాస్త తేడా జరిగినా ఎలాంటి పర్యావసానం ఉంటుందో చెబుతుంటారు. ఇప్పుడు ఈ సంఘటన విషయంలో అలాగే జరుగుతోంది. ఓ వ్యక్తి జెడ్ స్పీడ్ వేగంతో గాల్లోకి దూసుకుపోతూ స్టంట్ లు చేస్తోంటే.. నెటిజన్లు మాత్రం 'అది సాహసం కాదు, రిస్క్ అంతకన్నా కాదు, దాన్నిఏకంగా పిచ్చి పీక్స్ లోకి వెళ్ళడం' అని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
కొందరికి సాహసాలు చేయడం అంటే మహా ఇష్టం. చాలా ప్రమాదకరమైన స్టంట్లు(Stunts) చేసి సాహసవంతులుగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటారు. బ్రేవ్ మ్యాన్(brave man) అని అందరూ చప్పట్లు(clapps) కొడుతూ మెచ్చుకుంటూ ఉంటే చాలా గర్వంగా ఫీలైపోతూ ఉంటారు. ఓ వ్యక్తి చేసిన స్టంట్ ఇప్పుడు అలాగే ఉంది. పచ్చిక మైదానం లాంటి ప్రదేశంలో కొందరు వ్యక్తులు గుంపులు గుంపులుగా నిలబడుకుని ఉన్నారు. మధ్యలో ఒక వ్యక్తి స్లింగ్ షాట్(sling shot) లో తనను తాను కట్టుకుని కాటాపుల్ట్(catapult) లో కూర్చున్నాడు. అందరి వైపు చూసి తనని తాను ఎంకరేజ్ చేసుకుంటూ కనిపిస్తాడు. అతనికి కొంత దూరంలో ఓ చిన్న నీటి సరస్సు కృత్రిమంగా(Artificial water pond) తయారు చేశారు.అతను కాటాపుల్ట్ లో కూర్చుని వేగంగా రాకెట్ లాగా ఎగిరి ఎదురుగా దూరంలో ఉన్న సరస్సులోకి జంప్ చేస్తాడు.కాటాపుల్ట్ కు సరస్సుకు మధ్యలో అక్కడక్కడా మంటలు(flames) ఏర్పాటు చేశాడు. ఈ స్టంట్ చూడటానికి పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పలు దిశల్లో నుండి అతను జంప్ చేసి నీళ్ళలో దూకుతున్న దృశ్యాలు వీడియోలో చూడవచ్చు.
White hair: కొబ్బరి నూనెలో ఈ రెండిటినీ కలపి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!
ఈ వీడియోను @HumansNoContext అనే ట్విట్టర్ పేజీ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని స్టంట్ మీద మండిపడుతున్నారు. 'అది రిస్క్ లా అనిపిస్తుంది కానీ దాన్ని పిచ్చి పీక్స్ లోకి వెళ్ళడం అంటారు' అని విరుచుకుపడుతున్నారు. 'అతను చేసిన స్టంట్ లో ఏమాత్రం తేడా జరిగునా అతని ప్రాణాలు పైకి పోయేలా ఉన్నాయి'అని మరికొందరు కామెంట్ చేశారు. 'దాన్ని స్టంట్ అని ఎలా అనాలి? అది పిచ్చి పని ' అని అంటున్నారు ఇంకొందరు.