Viral Video: అమ్మ బాబోయ్.. అక్కడ ఎలా నిద్రపడుతోందయ్యా సామీ.. పొరపాటున జారి కింద పడితే..!

ABN , First Publish Date - 2023-09-14T15:15:57+05:30 IST

ఎంతమంచి పడక ఉన్నా కొందరికి నిద్ర పట్టదు. కానీ ఓ వ్యక్తి పడుకున్న స్థలం, పడుకున్న తీరు చూస్తే గుండె ఆగినంత పనవుతుంది.

Viral Video: అమ్మ బాబోయ్.. అక్కడ ఎలా నిద్రపడుతోందయ్యా సామీ.. పొరపాటున జారి కింద పడితే..!

హాయిగా నిద్రపోవాలంటే దానికి తగినట్టు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. వాతావరణం ఎంత బాగున్నా మనిషి మానసిక పరిస్థితి కూడా బాగుండాలి. జీవితంలో టెన్షన్లు, గొడవలు, బరువు బాధ్యతలు ఇవన్నీ మనసులో పోరుతుంటే ప్రశాంతంగా నిద్రపోయేవారు చాలా తక్కువ. ఇలాంటి వారు చాలావరకు రాత్రవ్వగానే పక్కమీద వాలి గంటసేపు అటూ ఇటూ దొర్లితే తప్ప నిద్రపోరు. కానీ ఈ వ్యక్తి అందుకు పూర్తీగా విభిన్నం. అతను పడుకున్న స్థలం, పడుకున్న తీరు చూస్తే గుండె ఆగిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జడుసుకుంటున్నారు. 'అసలు నీకు నిద్ర ఎలా వస్తోందయ్యా సామీ.. అంత నింపాదిగా నిద్రపోతున్నావ్' అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్(Viral Videos) అవుతుంటాయి. వీటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. మరికొన్ని కామన్ మాన్ ట్యాలెంట్ కు సంబంధించినవి ఉంటాయి. ఇవి రెండూ కలిసున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో రహదారి మీద వేగంగా వెళుతున్న ట్రక్(truck) ను చూడచ్చు. ఆ ట్రక్ వేగాన్ని అందుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ రెండు టైర్ల మధ్య ఏర్పాటు చేసిన ఒక మంచం, ఆ మంచం మీద ఎలాంటి చీకు చింత లేకుండా నిద్రపోతున్న ఓ వ్యక్తి కనిపిస్తాడు(man sleeping middle of the truck tires). ఆ ట్రక్ చక్రాల మధ్యలో నిద్రపోవడానికి మంచం ఏర్పాటుచేయడమే పెద్ద సాహసం అయితే.. అక్కడ అతను హాయిగా నిద్రపోవడం ప్రాణాలతో చలగాటం ఆడుతున్నట్టే అనిపిస్తుంది. ట్రక్ వేగానికి ఏ ఒక్క బోల్ట్ లూజ్ అయినా, ఊడిపోయినా అతను ఆ మంచంతోపాటు కిందపడటమే కాకుండా ఏకంగా చక్రాల కింద పడి నలిగిపోయే అవకాశం ఉంది.

Eye Health: ఏళ్ల తరబడి కళ్లజోళ్లను వాడుతున్నారా..? అసలు వాటి అవసరమే లేకుండా చేయాలంటే..!



ఈ వీడియోను indian_ka_talent అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. దీని గురించి పంచులు, సెటైర్లు వేస్తున్నారు. 'టెన్షన్ ఫ్రీ జీవితం అంటే ఇదే.. అతను ఎంత హాయిగా నిద్రపోతున్నాడో చూడండి' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతను ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇడియట్. లేకపోతే అతను అలా చెయ్యడు' అని మరొకరు విమర్శిస్తున్నారు. 'బాబోయ్ అతనికి అది ప్యాలెస్ లాంటి అనుభూతిని ఇస్తున్నట్టుంది' అని ఇంకొకరు కామెంట్ చేశాకు. 'క్యాబిన్ లో చాలా స్థలం ఉంటుంది. దాన్ని వదిలేసి ట్రక్ చక్రాల మధ్య పడుకోవడం ఏంటి నాన్సెన్స్' అని చాలామంది మండిపడుతున్నారు.

Child Health: 18 నెలల వయసు దాటిన పిల్లలు అసలేం తినొచ్చు..? తినకూడని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా..?


Updated Date - 2023-09-14T15:19:14+05:30 IST