Viral Video: బోట్లో వెళ్తూ చేపను పట్టి.. వెరైటీ ఫోజులతో సెల్ఫీ కూడా దిగాడు.. మరుక్షణంలోనే అతడు చేసిన ఒక్క మిస్టేక్తో..!
ABN , First Publish Date - 2023-04-24T18:40:42+05:30 IST
ఓ వ్యక్తి సముద్రం మధ్యన బోటులో ప్రయాణిస్తూ ఓ చేపను పట్టుకున్నాడు. దాన్ని చేతిలోపట్టుకుని వెరైటీ ఫోజులు ఇస్తూ సెల్ఫీలు కూడా తీసుకున్నాడు. కానీ..
ఫోటోలు(photos) తీసుకోవడం కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరికి పిచ్చి. స్మార్ట్ పోన్ లు అందరికీ అందుబాటులోకి వచ్చాక ఫోటోల హవా పెరిగిందని చెప్పవచ్చు. కొత్త ప్రాంతాలకు(new places) వెళ్ళినప్పుడు ఫోటోస్(photos), సెల్ఫీ(selfies)లు తీసుకోనివారు ఉన్నారంటేనే ఆశ్చర్యపడాలి. ఓ వ్యక్తి సముద్రం మధ్యన బోటులో ప్రయాణిస్తూ ఓ చేపను పట్టుకున్నాడు. దాన్ని చేతిలోపట్టుకుని వెరైటీ ఫోజులు ఇస్తూ సెల్ఫీలు కూడా తీసుకున్నాడు. అయితే అతను చేసిన ఒకే ఒక్క మిస్టేక్ అక్కడి సీన్ మొత్తం మార్చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు అయ్యో.. అని నిట్టూర్చుతున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో సింహాలు(Lions), పులులు(Tigers), పాములతో(Snakes) సెల్ఫీలు(Selfies) దిగటం అందరికీ ఫ్యాషనైపోయింది. ఇలా ఫోటోలు తీసుకుంటున్నప్పుడు చాలా మంది ఎదుర్కొన్న అనుభవాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రం(Sea) అంటే ఇష్టపడనివారు ఉండరు కదా.. అలాంటిది సముద్రంలో ప్రయాణం(sea voyage) చేస్తున్న్పపుడు ఆ థ్రిల్ ను ఎంజాయ్ చేసేవారు కొందరు ఉంటారు. ఇతనూ ఆ కోవకు చెందినవాడే.. ఒక వ్యక్తి సముద్రంమీద బోటులో(boat) ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణంలో సముద్రంలో చేప పట్టుకుని దాన్ని చేతిలో పట్టుకుని వెరైటీగా ఫోజులు ఇచ్చాడు. పోటోలు తీసుకోవడం అయిపోయాక ఆ చేపను ఇక సముద్రంలోకి విసిరేద్దామని అనుకున్నాడు. సముద్ర ప్రయాణపు థ్రిల్ లో లీనమైపోయాడో ఏమో కానీ చేతిలో చేపను సముద్రంలో విసరడానికి బదులుగా మరొక చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ను నీళ్ళలో విసిరేశాడు(phone throw out in sea water). అలా విసరగానే అతను చేసిన పని అతని గుర్తొచ్చి 'అయ్యయ్యో నా ఫోన్..!' అన్నట్టు చెయ్యి చాపుతూ ముందుకు వంగాడు. కానీ అప్పటికే ఆ ఫోన్ సముద్ర గర్బంలో కలిసిపోయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Viral Video: చిన్న పిల్లాడిని గుండెలపై పడుకోబెట్టుకుని స్కూటీపై ఇలా పడుకున్నాడో తండ్రి.. మరుక్షణంలోనే ఊహించని సీన్..!
Wtf Scene అనే ట్విట్టర్ అకౌంట్(Twitter account) నుండి ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'అయ్యో.. ఫోను పాయనే..' అని అంటున్నారు. 'నేను ఈ చేపను ఇప్పుడు నా డిన్నర్ కోసం అలాగే ఉంచుకున్నాను, అని అతను చెబుతున్నాడు' అంటూ పరిహాసం ఆడుతున్నారు. 'చేసే పనికి కొందరికి వెంటనే కర్మ ఫలితం దొరుకుతుంది, ఇతనికీ దొరికింది' అని మరికొందరు అంటున్నారు. 'ఫోన్ అతిగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ర్పభావాలు ఇవే' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇతను చేపకు బదులుగా స్మార్ట్ ఫోన్ సముద్రంలో విసిరేయడం వల్ల నెటిజన్లకు కావాల్సినంత ఫన్ దొరికినట్టయ్యింది.